నిన్ను కోరి అక్టోబర్ 24 ఎపిసోడ్: శాలినికి చంద్ర వార్నింగ్-పాలల్లో విషం కలిపావన్న శ్యామల-తాగేసిన విరాట్
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 24 ఎపిసోడ్ లో శాలినిక చంద్రకళ వార్నింగ్ ఇస్తుంది. తప్పు బయటపడే రోజు వస్తుందంటుంది. చంద్రపై శ్యామల అనుమానపడుతూనే ఉంటుంది. పాలల్లో విషం కలిపావంటుంది. ఆ పాలను విరాట్ తాగేస్తాడు. శాలినిని మళ్లీ మాటలంటాడు విరాట్.
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 24 ఎపిసోడ్ లో తేజుకు కథ చెప్తూ నిద్రపుచ్చుతాడు అర్జున్. నీ ఆఖరి కోరిక ఎలా తీర్చాలో తెలియక లోలోపలే నాన్న కుమిలిపోతున్నాడని అర్జున్ ఫీల్ అవుతాడు. నేను నా భర్తను ఎలా కంట్రోల్ లో పెట్టుకున్నానో చూశావు కదా. నా గురించి నిజం చెప్పినా నమ్మనంతగా నమ్మించానని చంద్రకళతో శాలిని అంటుంది.

శాలినికి వార్నింగ్
తప్పు మీద తప్పు చేస్తున్నావు శాలిని. నువ్వు పాపల చిట్టా పెంచుకుంటూ పోతే అంతకంతా అనుభవించాల్సి వస్తుందని చంద్రకళ వార్నింగ్ ఇస్తుంది. ఏ పరిస్థితినైనా నాకు అనుకూలంగా మార్చుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నిన్ను పంపించేద్దామనుకున్నా కానీ అత్తయ్య ఆపిందని శాలిని అంటుంది. ఈ గొడవ వల్ల మామయ్య ప్రమాదంలో ఉన్నారనే విషయం అందరికీ అర్థమైంది. ఆ రక్షణ కవచాన్ని దాటి మామయ్యను ఏం చేయలేవు. ఏ రోజైనా మామయ్య కోలుకుని నీ గుట్టు బయటపడుతుందని తెలుసుకో అని చంద్ర అంటుంది.
విరాట్ కు కోపం
నీ కంట్రోల్ లో ఉన్నాడనుకున్న క్రాంతి నిజం తెలిసిన రోజు గాండ్రించి ఉమ్మేస్తాడు. ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే నీ మీద జాలేస్తుంది శాలిని అని చెప్పి చంద్ర వెళ్లిపోతుంది. నువ్వు పడుకుంటే రూమ్ కు తాళం వేసి పడుకుంటానని చంద్రతో శ్యామల అంటుంది. విరాట్ కోపంగా వచ్చి ఎందుకు అని అడుగుతాడు. అన్నయ్య మీద అటాక్ చేసిందని అంటుంది శ్యామల. మళ్లీ అటాక్ చేస్తే ఎలా అని అడుగుతుంది.
బేబీ అంటూ శ్రుతి
చంద్ర చేతిని శ్యామల పట్టుకుంటే, అత్త చేతిని విరాట్ పట్టుకుంటాడు. నేను ఈ రూమ్ బయట పడుకుంటానని విరాట్ చెప్తాడు. నువ్వు ఎప్పుడో తన మైకంలో పడిపోయావు. నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేనని శ్యామల అంటుంది. నా భర్త గురించి నేను చూసుకుంటా ఎవరి గదిలో వాళ్లు వెళ్లి పడుకోండని జగదీశ్వరి వచ్చి చెప్తుంది. పొద్దున రాజ్ తో ఫోన్లో బేబీ అంటూ శ్రుతి మాట్లాడుతుంది. అది చూసి కామాక్షి కంగారు పడుతుంది. ఎవరని అడిగితే, గర్ల్ ఫ్రెండ్ పేరు బేబీ అని కవర్ చేస్తుంది శ్రుతి.
క్రాంతి రియాక్షన్
మామయ్య కోసం చంద్ర పాలు తీసుకొస్తుంది. కానీ శ్యామల వచ్చి మళ్లీ కోప్పడుతుంది. ఏం కలిపావు ఆ పాలల్లో అని అడుగుతుంది. ఆ పాలు నువ్వే తాగు అని శ్యామల అంటుంది. అప్పుడు విరాట్ గ్లాస్ తీసుకుని తాగేస్తాడు. నిజంగా పాలల్లో చంద్ర విషం కలిపి ఉంటే నాకేమైనా జరగాలి కదా. తప్పు చేసిన మనిషిని నమ్మి, అమాయకురాలిని నిందిస్తున్నారని విరాట్ అంటాడు. అన్నయ్య శాలినిని ఏమైనా అంటే బాగోదని క్రాంతి రియాక్టవుతాడు.
ఎందుకు అనకూడదు, తప్పు చేసింది తనే కాబట్టి కచ్చితంగా అంటాను. శాలినిని ఎందుకు అనుమానించకూడదు? నాన్నను కొట్టింది తను కాదని కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు వేసి ప్రూవ్ చేసుకోమనండి అని విరాట్ అంటాడు. దీంతో మొసలి కన్నీళ్లతో శాలిని నాటకం స్టార్ట్ చేస్తుంది. ఆయన కోలుకునేంతవరకూ ఎవరూ మాట్లాడొద్దని చెప్పా కదా అని జగదీశ్వరి కోప్పడుతుంది. నాన్న పనుల్లో జోక్యం చేసుకుంటే అనుమానిస్తూనే ఉంటారు చంద్ర అని విరాట్ చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


