నిన్ను కోరి అక్టోబర్ 20 ఎపిసోడ్: శాలిని ప్రెగ్నెంట్‌-విరాట్‌తో మాట్లాడిన త‌ల్లి-కోపాన్ని దాచుకున్న విరాట్‌-చంద్ర‌కు సారీ

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 20 ఎపిసోడ్ లో శాలిని ప్రెగ్నెన్సీ విషయం తెలిసి కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో ఇంటికి కోపంతో వచ్చిన విరాట్ నిజం చెప్పకుండా ఆగిపోతాడు. విరాట్ తో జగదీశ్వరి చాలా రోజుల తర్వాత మాట్లాడుతుంది.

Published on: Oct 20, 2025, 07:36:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ లో ఈ రోజు అంటే అక్టోబర్ 20 ఎపిసోడ్ లో శాలిని ప్రెగ్నెన్సీ న్యూస్ తో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. చంద్రకళ చెప్పినా వినకుండా విరాట్ కోపంగా ఇంటికి వస్తాడు. క్రాంతి వెళ్లి విరాట్ ను హగ్ చేసుకుంటాడు. నువ్వు పెద్దనాన్నవి, వదిన నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావని క్రాంతి చెప్తాడు. ఈ శుభవార్త వల్ల ఇంట్లో వాతావరణమే మారిపోయిందని జగదీశ్వరి అంటుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

విరాట్ తో మాట్లాడిన తల్లి

ఈ వార్త విన్నాక ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఇంటికి దూరమైనా సంతోషాన్ని శాలిని కడుపులో పడ్డ బిడ్డ తీసుకొచ్చిందని విరాట్ తో జగదీశ్వరి అంటుంది. అవును వదినా విరాట్ తో మాట్లాడట్లేదనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావని శ్యామల అంటుంది. కొడుకు మీద తల్లి ఎన్నాళ్లని కోపంగా ఉంటుంది? తల్లిగా వాడి బాధను తగ్గించకుండా పంతంతో నేనే ఇంకా పెంచుతున్నానని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది. విరాట్ కూడా ఏడ్చేస్తాడు.

ప్రెగ్నెంట్ కావాలేమో

వీడి కాపురం కూడా చక్కబడితే నా సగం దిగులు తీరిపోతుందని జగదీశ్వరి అంటుంది. అమ్మను ఆనందంతో హత్తుకుంటాడు విరాట్. నువ్వు శాలినికి కంగ్రాట్స్ చెప్పవా అని విరాట్ ను శ్రుతి అడుగుతుంది. కంగ్రాట్స్ శాలిని అని చెప్పేసి విరాట్ వెళ్లిపోతాడు. నన్ను కూడా జాగ్రత్తగా చూడాలంటే నేను కూడా ప్రెగ్నెంట్ కావాలేమోనని శ్రుతి అనగానే కామాక్షి షాక్ అవుతుంది.

శివుణ్ని కాదు

నీ మౌనం వల్ల ఇల్లంతా సంతోషంగా నిండిపోయిందని గదిలోని విరాట్ దగ్గరకు వెళ్లి అంటుంది చంద్రకళ. కానీ నేను సంతోషంగా లేను చంద్ర. నా తండ్రిని చంపాలని చూసిన మనిషికి ఈ ఇంట్లో పట్టం కట్టడం భరించలేకపోతున్నా. నేరాన్ని దాచి నేను నేరం చేస్తున్నా చంద్ర. ఈ విషాన్ని గొంతులో దాచడానికి నేను శివుణ్ని కాదు మామూలు మనిషిని. నీ అంత మంచి మనసు శాలినిక ఎందుకు లేదని విరాట్ అంటాడు.

నిజం తెలియకుండా

పుట్టుకతోనే ఎవరూ చెడ్డవాళ్లు కాదు బావ. మారడానికి ఒక్క సంఘటన చాలు. శాలిని మంచిగా మారడానికి ఒక్క సంఘటన చాలు అదే ప్రెగ్నెన్సీ అని చంద్ర అంటుంది. మార్పు వస్తే మంచిదే కానీ ఇంకా దారుణాలు చేస్తే ఊరుకోనని విరాట్ అంటాడు. చంద్రను బాధపెట్టినందుకు సారీ చెప్తాడు విరాట్. ఆ నిజం అత్తయ్యకు తెలియనివ్వకూడదని బావకు చెప్తుంది చంద్ర.

ఈ పూజ నేనే వంట చేస్తానని జగదీశ్వరి చకచకా వండేస్తుంది. మరోవైపు ఈ రోజుతో నాకు ఇంట్లో నూకలు చెల్లిపోయాయని అనిపించింది. కానీ డాక్టర్ వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో బతికిపోయానని శాలిని అనుకుంటుంది. క్రాంతి వచ్చి బెడ్ మీద నుంచి కాలు కిందపెట్టడానికి వీల్లేదని అంటాడు. భార్యపై ప్రేమ కురిపిస్తాడు. కానీ ముందు నువ్వు, బావ కలిసి భోజనం చేయండని శాలిని డ్రామా ఆడటంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More