నిన్ను కోరి నవంబర్ 7 ఎపిసోడ్: శాలినిపై రఘురాం డౌట్- శ్యామల, కామాక్షిని ఇంట్లోంచి వెళ్లమన్న రఘురాం- చంద్రకళ విరాట్ శోభనం
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్‌లో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రఘురాంకు కొంత గుర్తుంది కొంత లేదని డాక్టర్ చెబుతాడు. శ్యామల, కామాక్షి చెల్లెల్లం అని చెప్పడంతో ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు రఘురాం. విరాట్ భార్యగా గదిలోకి అధికారికంగా వెళ్తుంది చంద్రకళ. విరాట్, చంద్రకళ శోభనం చేసుకుంటారు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం గతం మర్చిపోయారని డాక్టర్ చెబుతాడు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకురాకుండా చూసుకోండి అని డాక్టర్ వెళ్లిపోతాడు. పరిస్థితి అర్థమైందిగా అంతా చూసుకుని మెదలండి అని జగదీశ్వరి అంటుంది. చంద్ర నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్లు అని విరాట్ అంటే ఆగమని శ్యామల అంటుంది.

నిజం పూర్తిగా బయటపడలేదు
నిజం ఇంకా పూర్తిగా బయటపడలేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని శ్యామల అంటుంది. జరిగిన యాక్సిడెంట్‌కు నాకు ఏ సంబంధం లేదని, తల మీద కొట్టింది కూడా నేను కాదని మావయ్య గారు క్లియర్‌గా చెప్పారు. కాబట్టి నా సమస్యకు పరిష్కారం దొరికింది. అసలు నిజాన్ని మెల్లిగా కనిపెడతాం. ఇక నన్ను నిందించడం, ఇంట్లోంచి వెళ్లమనడానికి ఎవరికి హక్కు లేదని చంద్రకళ అంటుంది.
అవునమ్మా ఇది నీ ఇల్లు, దర్జాగా ఉండొచ్చు అని రఘురాం అంటాడు. దాంతో శాలిని విసుక్కుంటుంది. వెళ్లి డాక్టర్‌తో చెప్పిందేంటీ చేసిందేంటీ అని అడుగుతుంది. నన్ను నమ్మించి ఫూల్‌ను చేశారు అని శాలిని అంటుంది.
లేదు నేను చెప్పినట్లే ఇచ్చాను. కానీ, మెడిసిన్ ఎఫెక్ట్ చూపించడానికి కాస్తా టైమ్ తీసుకుంటుంది. ఈలోపు మీ ఇంట్లో జరిగిన గొడవల వల్ల పెరిగిన స్ట్రెస్ వల్ల లేచి మాట్లాడే తపన ఎక్కువైంది. ఆ సంకల్ప బలంతోనే ఆయన లేచారు. లక్కీగా జ్ఞాపక శక్తి పోయింది కాబట్టి మీరు సేఫ్ అని డాక్టర్ అంటాడు.
పేషంట్ చనిపోయేలా చేయను
ఎప్పటికైనా గతం గుర్తుకు వస్తే సమస్యేగా. మళ్లీ ఆయన్ను పాత స్టేజీలోకి తీసుకెళ్లండి అని శాలిని అంటుంది. అలా చనిపోతారు. మీకోసం ఏదో చేశాను కానీ ఒక పేషంట్ చనిపోయే పని నేను చేయను అని డాక్టర్ కాల్ కట్ చేస్తాడు. తన మొర ఆలకించనందుకు దేవుడికి దండం పెట్టుకుంటుంద చంద్ర. పెద్ద గండం నుంచి బయటపడ్డాను. అసలు నిజాన్ని కూడా బయటపెట్టాలి అని చంద్రకళ అంటుంది.
మరోవైపు విరాట్ సేమ్యా పాయసం చేస్తాడు. వంట గదిలో ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. హాల్లో జగదీశ్వరితో తాను వేసుకున్న డ్రెస్ గురించి రఘురాం మాట్లాడుతాడు. డ్రెస్ గుర్తుందంటే మనం కూడ గుర్తుంటాం అని శ్యామల, కామాక్షి వస్తారు. మీరెవరు అని అడిగితె చెల్లెలం అని చెబుతారు. నా ఇంట్లో ఎందుకు ఉన్నారు. మీకు ఇళ్లు లేవా అని రఘురాం అంటాడు.
నీకు బాగా లేదని చూసుకునేందుకు వచ్చామని శ్యామల అంటే.. ఇప్పుడు బాగానే ఉందిగా. ఇక బయలుదేరండి బయలు దేరండి. ఇక్కడే ఉంటే మీ భర్తలు ఇబ్బంది పడరా అని రఘురాం అంటాడు. ఇంతలో చంద్రకళ పాయసం తీసుకొచ్చి ఇస్తుంది. నా ఇష్టాలు నీకు బాగా తెలుసుమ్మా అని చంద్రకళను మెచ్చుకుంటాడు రఘురాం. పాయసం ఎందుకు చేశావని రఘురాం అడుగుతాడు.
నాకు కూడా పునర్జన్మ
ఇవాళ మీకు బర్త్ డే. మీకు పునర్జన్మ. మీకే కాదు నాకు కూడా పునర్జన్మ అని చంద్రకళ ఎమోషనల్‌గా చెబుతుంది. క్రాంతి, శాలిని పాయసం తీసుకోకుంటే రఘురాం వచ్చి ఇస్తాడు. శాలిని చూసి అనుమానంగా నువ్వు నా మెడిసిన్ అని రఘురాం అంటే నేనే మీకు ఎన్నోసార్లు ఇచ్చానని కవర్ చేస్తుంది శాలిని. తర్వాత పండుగ రోజు అంటూ తల్లివి కాబోతున్నావ్‌గా అని రఘురాం అంటాడు.
ఈ గ్యాప్‌లో శాలిని వణికిపోతుంది. మనింటికి వారసుడు రాబోతున్నాడు. ఇక మనకు ఫుల్ టైమ్ పాస్ అని రఘురాం అంటాడు. వాదోపవాలు జరిగి తీర్పు వచ్చిందిగా. ఇక నువ్వు నా భార్యగా స్టోర్ రూమ్ వదిలి బెడ్ రూమ్‌కు వచ్చేసేయ్ అని విరాట్ అందరిముందు చెబుతాడు. మరోవైపు చంద్రకళ ఉండటం గురించి కామాక్షి, శ్యామల మాట్లాడుకుంటారు.
వాళ్లు గనుక పిల్లలను కంటే చంద్ర తప్పున్న బయటకు పంపించలేం. విరాట్, చంద్ర ఒక్క గదిలో ఉండకుండా చేయాలని కామాక్షి అంటుంది. వదినతో మాట్లాడుదామని జగదీశ్వరి దగ్గరికి వెళ్తారు. నిజం పూర్తిగా తెలియకముండే విరాట్ గదిలోకి చంద్రకళ వెళ్లడాన్ని ఆపమని శ్యామల అంటుంది.
ద్వేషంతో తాళి కట్టినవాడే
చంద్ర తప్పు చేస్తే నేను శిక్షిస్తాను. కానీ, వాళ్లు కలిసి ఉండకూడదని చెప్పలేను. ద్వేషంతో తాళి కట్టినవాడే నమ్మి భార్యగా చేసుకున్నాడు. వాళ్ల బంధం దేవుడు ముడిపెట్టింది. వాళ్లను దూరం చేసే హక్కు ఎవరికి లేదు అని జగదీశ్వరి అంటుంది. ఇంతలో చంద్రకళ వస్తుంది.
ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పొప్పులు కాదు. మావయ్య గారు సంతోషంగా ఉండటం. మళ్లీ ఆయన స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. మీతో చేరి తెలివిగా ఆలోచించే శ్యామల పిన్ని గారు కూడా పొల్యూట్ అవుతున్నారు అని చెప్పేసి వెళ్లిపోతుంది చంద్రకళ. తర్వాత విరాట్, చంద్రకళకు ఫస్ట్ నైట్ జరుగుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














