నిన్ను కోరి నవంబర్ 3 ఎపిసోడ్: ముంచుకొస్తున్న గడువు-బాధలో చంద్ర, విరాట్-శ్యామల గొడవ-జగదీశ్వరి వార్నింగ్
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో తన ఇంటికి రావొచ్చని చంద్రకళకు భరోసా ఇస్తాడు అర్జున్. కానీ చంద్ర వద్దంటుంది. ఈ మాటలు విన్న కామాక్షి, శ్యామలతో చెప్పి గొడవ జరిగేలా చేస్తుంది. జగదీశ్వరి వచ్చి వార్నింగ్ ఇస్తుంది. రఘురాం కనపడకపోవడంతో అందరూ కంగారు పడతారు.
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో నువ్వు చేసిన పూజ పనికి రాకుండా పోయింది. ఆ దేవుడు కూడా నీకు సపోర్ట్ గా లేడు. తట్టాబుట్టా సర్దుకోవడానికి రెడీగా ఉండమని చంద్రకళతో శాలిని అంటుంది. ఎలాగైనా నిజం బయటపెట్టి కుటుంబాన్ని కాపాడుతానని చంద్ర అంటుంది. ఇంకా రెండు రోజుల్లో, 48 గంటల్లో ఏం చేస్తావని వెళ్లిపోతుంది శాలిని.

అర్జున్ కాల్
చంద్రకళకు ఫోన్ చేస్తాడు అర్జున్. ఇంకా రెండు రోజుల డెడ్ లైన్ మాత్రమే ఉంది. మామయ్య కోలుకుని నిజం చెప్పకపోతే ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తుందని చంద్రకళ చెప్తుంది. నేను వచ్చి మాట్లాడతానని అర్జున్ అంటే వద్దంటుంది చంద్ర. మా ఇంటికి వచ్చి ఉండొచ్చని అర్జున్ చెప్తాడు. కానీ రాలేనని, రెండు రోజుల్లో అవకాశం వస్తుందని చెప్తుంది చంద్ర.
శ్యామల గొడవ
శాలిని కోసం స్వీట్ చేసి తీసుకొస్తుంది జగదీశ్వరి. గది నుంచి బయటకు వచ్చి స్ట్రెస్ పెంచుకోవడం కంటే లోపలే ఉండటం బెటర్ అని చెప్తుంది శాలిని. ఇంకా రెండు రోజులే, వదిన వెళ్లిపోతుందని క్రాంతి అంటాడు. మరోవైపు చంద్రను తాళాలు అడుగుతుంది శ్యామల. ఎలాగో ఇల్లు వదిలి వెళ్లిపోతున్నావు కదా అని అంటుంది. నువ్వు అర్జున్ తో మాట్లాడటం విన్నానని కామాక్షి చెప్తుంది.
విరాట్ సీరియస్
చూడు విరాట్ ఇంట్లో నుంచి వెళ్లిపోతే రోడ్డు మీద పడుతుంది. నిన్ను వదిలి వెళ్లిపోతుందని బాధ పడ్డావు. కానీ ఈ ఇల్లు వదిలి వెళ్లగానే అర్జున్ ఇంట్లో తిష్ఠ వేయాలని చూస్తోందని శ్యామల అంటుంది. చెప్పిన మాటలు విని తప్పుగా మాట్లాడకండి. అంత సంస్కారహీనురాలిని కాదు అని చంద్ర సీరియస్ అవుతుంది. గడువు ముగిసే వరకూ తాళాలు తన దగ్గరే ఉంటాయని, అనవసరంగా గొడవ చేయొద్దని అంటాడు విరాట్.
జగదీశ్వరి వార్నింగ్
శాలినికి మనశ్శాంతి లేకుండా చేసి, ఆ స్ట్రెస్ వల్ల కడుపులో బిడ్డకు ఏమైనా జరిగితే కానీ మీ కళ్లు చల్లబడవు కదా అని క్రాంతి అంటాడు. కడుపులో బిడ్డను చిదిమేయాలని ఆలోచించే క్రూరమైన మనుషులం కాదు మేం అని విరాట్ ఫీల్ అవుతాడు. ఇక గొడవలు ఆపేయండి. ఆయన లేచి నిజం చెప్పేవరకూ ఎవరు ఎవరితో గొడవ పడకండి. మళ్లీ నాకు గొడవ వినిపిస్తే మర్యాదగా ఉండదని జగదీశ్వరి వార్నింగ్ ఇస్తుంది.
రఘురాం మిస్సింగ్
మెడిసిన్ మారింది కదా బావ మళ్లీ లేస్తారేమో అనే ఆశతో చూస్తున్నానని విరాట్ తో అంటుంది చంద్ర. నాకు మిగిలింది ఇంకా ఒక్కరోజు అని రాత్రి బాధపడుతుంది చంద్ర. పొద్దున బాత్రూమ్ నుంచి జగదీశ్వరి వచ్చేసరికి రఘురాం కనిపించడు. ఆయన గదిలో లేరని చెప్పేసరికి అందరూ కంగారు పడతారు. అందరూ ఇళ్లంతా వెతుకుతారు కానీ కనిపించడు.
చంద్ర కూడా కనిపించదు. అప్పుడే వీల్ చెయిర్ లో రఘురాంను తీసుకొని వస్తుంది చంద్ర. మామయ్యకు సన్ రైజ్ చూడటమంటే ఇష్టమని గతంలో చెప్పారు. అందుకే పక్కన ఉన్న పార్క్ కు తీసుకెళ్లా. ఈ ఒక్క రోజు నాకు చాలా విలువైంది. అందుకే సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నానని చంద్ర అనడంతో ఈ రోజు నిన్ను కోరి ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


