నిన్ను కోరి అక్టోబర్ 29 ఎపిసోడ్: శాలిని హిప్నటైజ్‌కు విరాట్ ప్లాన్- వంద బిందెలతో చంద్రకళ అభిషేకం
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో శాలినిని హిప్నటైజ్ చేయించి నిజాలు రాబట్టాలని విరాట్ అనుకుంటాడు. కానీ శాలిని తెలివిగా సమాధానాలు చెప్తుంది. మరోవైపు చంద్రకళ పూజ స్టార్ట్ చేస్తుంది. వంద బిందెలతో అభిషేకం చేస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 29 ఎపిసోడ్ లో ఇవన్నీ చూస్తుంటే నాకే ఆయన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోందని జగదీశ్వరి బాధ పడుతుంది. ఈ గొడవలు పక్కనపెట్టి ముందు ఎవరి పనులు వాళ్లు చేసుకోండి. శాలినికి టెస్టులు చేయిస్తాన్నవావు కదా క్రాంతి. నాలుగు రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని శ్యామల చెప్తుంది.

డాక్టర్ కు విరాట్ కాల్
డాక్టర్ కు విరాట్ కాల్ చేస్తాడు. డాక్టర్ ను ఓ ఫేవర్ ఆడుగుతాడు. హాస్పిటల్ వెళ్లి డాక్టర్ ను కలుస్తాడు. సైక్రియార్టిస్ట్ ను కలుస్తాడు విరాట్. శాలినిని అడగాల్సిన ప్రశ్నలను డాక్టర్ కు ఇస్తాడు విరాట్. ఇది సీరియస్ మ్యాటర్ అని డాక్టర్ అంటే, చాలా సీరియస్ అని విరాట్ చెప్తాడు. మా నాన్న ప్రాణాలకే ప్రమాదం ఉందని, హెల్ప్ చేయమని అడుగుతాడు.
హిప్నటైజ్ చేయాలని
లేడీ డాక్టర్ శాలినికి సైక్రియార్టిస్ట్ ను కలవమని చెప్తుంది. హిప్నటైజ్ థెరపీతో నాన్నను కొట్టింది శాలిని అని చెప్పించాలనుకుంటాడు విరాట్. మరోవైపు పూజకు రెడీ అవుతుంది చంద్రకళ. కాపురాన్ని నిలబెట్టుకోవాలని, కుటుంబాన్ని కాపాడుకోవాలని పూజలు చేస్తున్నావు. నీకు సపోర్ట్ గా నిలుస్తానని స్వామిజీ చెప్తాడు. శివలింగానికి వంద సార్లు కోనేరులోని నీటిని బిందెతో తీసుకొచ్చి అభిషేకం చేయాలని చెప్తాడు. పొరపాటు జరిగితే మళ్లీ మొదటి నుంచి చేయాలంటాడు. చంద్రకళ అభిషేకం ప్రారంభిస్తుంది.
చంద్రకళ అభిషేకం
శాలిని, క్రాంతిని సైక్రియార్టిస్ట్ ప్రశ్నలు అడుగుతాడు. క్రాంతిని పక్కకు తీసుకెళ్లమని డాక్టర్ కు చెప్తాడు విరాట్. వెంటనే శాలినిని హిప్నటైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు డాక్టర్. మరోవైపు అడుగులు తడబడుతున్నా సరే చంద్రకళ వంద బిందెలతో అభిషేకం పూర్తి చేస్తుంది. ఇంకోవైపు విరాట్ ను లోపలికి పిలుస్తాడు డాక్టర్. శాలినిని హిప్నటైజ్ చేసి మాట్లాడతాడు.
క్రాంతి సోల్ మేట్
చంద్రకళను పొర్లు దండాలు పెట్టాలని స్వామిజీ చెప్తాడు. మధ్యలో ఆగకూడదు. ఒకవేళ ఆగిపోతే క్రతువు ఆపేయాల్సిందేనని అంటాడు. చంద్రకళ సంకల్ప బలంతో గుడి చుట్టూ 101 పొర్లు దండాలు పెట్టడం ప్రారంభిస్తుంది. మరోవైపు విరాట్ రాసిచ్చిన ప్రశ్నలను అడుగుతాడు డాక్టర్. భర్త అంటే ప్రేమ ఉంది అని అడిగితే, ఆశ్చర్యంగా అవునని, అతను నా సోల్ మేట్ అని చెప్తుంది. చంద్రకళ డామినెన్స్ కారణంగా నాకు నచ్చలేదు, కానీ ఒపీనియన్ మారిపోయిందని శాలిని చెప్తుంది.
వినాయక చవితి రోజు ఏం జరిగిందో చెప్పమని డాక్టర్ అడుగుతాడు. ఆ రోజు మామయ్యకు చలనం వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని శాలిని చెప్తుంది. ఆ రోజు మీ మామయ్య తలమీద కొట్టింది మీరే కదా అని డాక్టర్ అడుగుతాడు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












