నిన్ను కోరి నవంబర్ 1 ఎపిసోడ్: చంద్రకళకు ఒక్కరోజే గడువు- చంద్ర, రఘురాం మిస్సింగ్- రాజ్‌తో రొమాంటిక్‌గా మాట్లాడిన కామాక్షి

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్‌లో రఘురాంకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ ఇంకోసారి ఒత్తిడి తీసుకొస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తాడు. శ్యామలకు దెబ్బ తగిలితే చంద్ర ఐస్ పెడుతుంది. శ్రుతికి రాజ్ కాల్ చేస్తే కూతురు గొంతుతో కామాక్షి రొమాంటిక్‌గా మాట్లాడుతుంది.

Published on: Nov 01, 2025 9:40 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాంను డాక్టర్‌కు చూపిస్తారు. సొమ్మసిల్లి పోయింది చెబుతాడు విరాట్. ఇంట్లో నెగెటివిటీ ఉండటం వల్లే నాన్న కోలుకోవట్లేదు అని క్రాంతి అంటాడు. జగదీశ్వరి కోపంగా చూడటంతో ఊరుకుంటాడు. ఏమైందని డాక్టర్‌ను అడుగుతుంది జగదీశ్వరి.

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్‌

గుండెపోటు వచ్చే ప్రమాదం

బీపీ రెయిజ్ అయింది. మాట్లాడించడం వల్ల నర్వ్ సిస్టమ్‌పై ప్రెజర్ పడింది. దానివల్ల ఒక్కోసారి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఇంట్లో గొడవలున్నాయని అర్థమైంది. ఆ ఎఫెక్ట్ మీ నాన్నపై పడనివ్వకండి. బలవంతంగా మాట్లాడించే ప్రయత్నించకండి. మెంటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటేనే ఆయన బాడీ సపోర్ట్ చేస్తుంది. ఈ సిరప్ వాడండి. ఇది నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అయి శక్తి రావచ్చు. కోలుకోవాలని పట్టుదల ఉంటే ఆయన కోలుకోవచ్చు అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

ఇప్పటివరకు జరిగింది చాలు. ఇక వదిలేయండి. ఆయన కోలుకునేవరకు ఎవరు గొడవపడకండి అని శ్యామల అంటుంది. విరాట్ వెళ్లిపోతాడు. చంద్రకళ వెళ్తుంది. శాలినిని హిప్నటైజ్ ఎందుకు చేయించావ్ అని అడుగుతుంది. మనకు టైమ్ లేదు. ఇంతకంటే చేసేది కనిపించలేదు అని విరాట్ అంటాడు. నాకోసం మీ వాళ్లకు దూరమవుతావా. నేను వెళ్లేటప్పుడు ఇంటిని విడగొట్టిన పాపం మూటగట్టుకోవాలా అని చంద్రకళ అంటుంది.

అలా అనకు. నవ్వు ఎక్కడికి వెళ్లవ్ అని విరాట్ అంటాడు. నాకు నమ్మకం పోతుంది. బొట్టు పెట్టగానే మావయ్యలో కదలిక రాగానే సంతోషించా. కానీ, అది ఎంతోసేపు లేదు. నిజంగా దేవుడు కరుణిస్తే అలా జరిగేది కాదుగా. నేను చేసిన ప్రయత్నాలు అన్ని ఫలించట్లేదు అని చంద్రకళ అంటుంది. శాలినిని హిప్నటైజ్ చేసిన ఎందుకు నిజం చెప్పలేదో అర్థం కావట్లేదు అని విరాట్ అంటాడు.

ఎలాగైన బయటపెడతా

తను చాలా షార్ప్ మైండ్. తనతో పెట్టుకుని క్రాంతి దృష్టిలో నువ్వు బ్యాడ్ అవుతున్నావ్. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వదిలేయ్ అని చంద్ర అంటుంది. ఏంటీ వదిలేసేది. తన ఫ్యామిలీని ముక్కలు చేయాలని చూస్తుంది. ఉన్న టైమ్‌లో శాలిని నిజ స్వరూపం బయటపెడతాను అని విరాట్ అంటాడు. మరోవైపు శ్రుతికి రాజ్ కాల్ చేస్తాడు.

ముచ్చట్లు తప్పా ఆస్తి రాబట్టట్లేదు అని రాజ్ తల్లి అంటుంది. శ్రుతికి రాజ్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కామాక్షి లిఫ్ట్ చేస్తుంది. హాయ్ బేబీ అని రాజ్ అనేసరికి కామాక్షి షాక్ అవుతుంది. శ్రుతి చెప్పిన బేబీ ఈ బాయ్ ఒక్కరేనా అని కామాక్షి మాట్లాడుతుంది. రాజ్ రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. శ్రుతి వాయిస్‌తో కామాక్షి మాట్లాడుతుంది. కామాక్షి మెలికలు తిరుగుతూ మాట్లాడుతుంది.

అది చూసిన శ్రుతి షాక్ అవుతుంది. బేబీ అంటూ నా వాయిస్‌తో మాట్లాడుతుందేంటీ అని శ్రుతి వెళ్లి అరుస్తుంది. తనకు తెలియకుండానే మాట్లాడిన కామాక్షి తెరుకుని రేయ్ నువ్వు ఎవడ్రా అని అరుస్తుంది. మీరెవరండి మాట్లాడేది. నేను శ్వేత కోసం కాల్ చేశాను అని రాజ్ అంటే.. ఇది శ్రుతి నెంబర్ అని కామాక్షి అంటుంది. రాంగ్ నెంబర్ అని రాజ్ కట్ చేస్తాడు.

నా హీరో జీనియస్

తల్లి వచ్చి అడిగితే.. నేను మాట్లాడితంది శ్రుతి తల్లితో. శ్రుతి వాయిస్‌తో మాట్లాడింది అని రాజ్ అంటాడు. శ్రుతి అడిగేసరికి కామాక్షి నిజం తెలుసుకుందామని అంటుంది. నన్ను అనుమానిస్తున్నావా అని శ్రుతి అంటే లేదు.. నిన్ను ఎవరు ఇష్టపడతారని వెళ్లిపోతుంది కామాక్షి. నా హీరో కవర్ చేశాడు. ఎంతైనా జీనియస్ అని శ్రుతి మురిసిపోతుంది.

శ్యామల వెనుక చంద్రకళ నిల్చుంటుంది. వెనక్కి తిరిగి చూసిన శ్యామల చంద్రకళను చూసి భయపడుతుంది. దెయ్యంలా నిల్చున్నావేంటే అని శ్యామల అంటుంది. మీతో ఓ విషయం చెప్పాలి. శాలినిని హిప్నటైజ్ చేయించింది మావయ్య గారిని అటాక్ చేసిందో ఎవరో కనిపెట్టి మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు అని చంద్రకళ అంటుంది. విరాట్ గురించి నాకు తెలుసు అని కోపంగా శ్యామల వెళ్లిపోతు కుర్చుకి తగిలి దెబ్బ తగిలించుకుంటుంది.

నొప్పితో విలవిల్లాడుతుంది శ్యామల. ఐస్ తీసుకొచ్చి చంద్రకళ పెడితే శ్యామల పెట్టనివ్వదు. మీరు నాకు తల్లితో సమానమని ఎన్నోసార్లు చెప్పాను. తల్లి బాధపడుతుంటే బిడ్డ చూస్తు ఊరుకోలేదు అని శ్యామల కాలు తీసుకుని ఐస్ పెడుతుంది చంద్రకళ. దాంతో కాస్తా కరుగుతుంది శ్యామల. గతంలో చంద్రకు చెప్పింది గుర్తు చేసుకుంటుంది శ్యామల.

చంద్రకళ, రఘురాం మాయం

చంద్రకళ మొహం చూడటంతో ఇక చాల్లే అమ్మాయి. తగ్గిపోయిందని వెళ్లిపోతుంది శ్యామల. చంద్రకళ వెళ్తుంటే శాలిని ఆపుతుంది. నేను మారిపోతాను అని నమ్మావ్. నువ్వు మీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసిన నన్ను ఏం చేయలేరు. హిప్నటైజ్ చేస్తే దొరికిపోతాను అనుకున్నారా. దాన్ని కూడా ఎలా వాడుకున్నానో చూశారుగా అని శాలిని అంటుంది.

తర్వాత రాత్రి తనకు ఇంకా ఒక్కరోజే గడువు ఉందని చంద్రకళ బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం రఘురాం కనిపించడు. చంద్రకళ కూడా కనిపించదు. దాంతో అన్నయ్యను చంద్రకళ ఏం చేయలేదుగా అని శ్యామల భయపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.