నిన్ను కోరి అక్టోబర్ 30 ఎపిసోడ్: హిప్నటైజ్ ప్లాన్ ఫెయిల్- విరాట్‌కు శాలిని పెద్ద ఝలక్- చంద్రకళ హోమం నుంచి భస్మం

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో శాలినిని హిప్నటైజ్ చేయించిన విరాట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. విరాట్ ప్లాన్ ముందే తెలిసిన శాలిని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. విరాట్‌పై క్రాంతి తిరగబడేలా శాలిని ఝలక్ ఇస్తుంది. చంద్రకళ చేసిన హోమం సక్సెస్ అవుతుంది. అందులో నుంచి భస్మం ఇస్తాడు స్వామిజీ.

Published on: Oct 30, 2025, 09:20:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినిని హిప్లటైజే చేయిస్తాడు విరాట్. కానీ, శాలిని అందులో అబద్దం చెబుతుంది. మరోవైపు గుడిలో హోమం చేయిస్తుంది చంద్రకళ. ఈ హోమం నీ అంతరాత్మకే పరీక్ష. నీ ఉద్దేశం సరైనది కాకపోతే నువ్వు ఎంత నిష్టగా పూచ చేసిన దాని త్యాగఫలం దక్కదు అని స్వామిజీ అంటాడు.

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 30 ఎపిసోడ్‌

చంద్రకళ హోమం

నా దీక్ష దేనికో మీకు తెలుసు. దేవుడికి తెలుసు. నన్ను రక్షిస్తాడో, శిక్షిస్తాడో దేవుడి ఇష్టం అని పూజలో కూర్చొంటుంది చంద్రకళ. హోమం స్టార్ట్ చేస్తారు. అత్తయ్య మావయ్య కష్టాల నుంచి విముక్తి పొందాలి. నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అని చంద్రకళ మనసులో కోరుకుంటుంది. అగ్ని స్వచ్ఛమైనది. నీ కోరిక మంచిదో చెడుదో ఈ అగ్ని చెబుతుందని స్వామిజీ అంటాడు.

ఈ పూర్ణాహుతి అగ్నిలో వేస్తే అగ్ని చల్లారిపోతే నీ కోరిక స్వచ్ఛమైనది కాదు అని అర్థం. ఎగసి పడిందంటే ఆ దేవుడు నీ పూజను సంతోషంగా అందుకుని నిన్ను కరుణాస్తాడని చెప్పినట్లు అని ఆ పూర్ణాహుతి చంద్రకు ఇస్తాడు స్వామిజీ. పూర్ణాహుతి అగ్నిలో వేయగానే మరింత మండుతుంది. దాంతో చంద్రకళ సంతోషిస్తుంది. మరోవైపు హిప్నటైజ్‌తో నిజం చెబుతారు అంటారు. మరి శాలిని అబద్ధం చెప్పిందేంటీ అని విరాట్ ఆలోచిస్తాడు.

సైకియాట్రిస్ట్ డాక్టర్‌కు కాల్ చేసి క్రాంతిని రమ్మని చెబుతాడు. దాంతో క్రాంతి వస్తాడు. శాలినికి మెలకువ వస్తుంది. వాష్ రూమ్‌లోకి వెళ్లి చెవిలో ఉన్న దూది తీస్తుంది. డాక్టర్‌తో విరాట్ మాట్లాడటం శాలిని విన్నది గుర్తు చేసుకుంటుంది. డాక్టర్‌తో హిప్నటైజ్ గురించి అడుగుతాడు. అదంతా శాలిని వింటుంది. దాంతో ముందుగానే ప్లాన్ తెలుసుకున్న శాలిని చెవిలో దూది పెట్టుకుంటుంది.

ఝలక్ ఇచ్చిన శాలిని

ఈ శాలినికి ఝలక్ ఇద్దామనుకున్నారుగా. మీకే నేను ఇస్తాను పెద్ద ఝలక్ అని శాలిని అనుకుంటుంది. హోమ గుండంలోని భస్మాన్ని చంద్రకళకు ఇస్తాడు స్వామిజీ. రోజు మీ మావయ్యకు భస్మం పెట్టని, కోలుకుంటారని స్వామిజీ చెబుతాడు. మరోవైపు శాలిని రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గానే ఉన్నాయని చెబుతుంది డాక్టర్. శాలిని బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అనుకుంటా. ఎవరికి దొరకూడదని ముందే గట్టిగా అనుకున్నట్లున్నారు అని విరాట్‌తో సైకియాట్రిస్ట్ అంటాడు.

శాలినికి మెడిసిన్ రాస్తుంది డాక్టర్. విరాట్‌ను క్రాంతికి చూపిస్తుంది. బావగారు ఇక్కడ ఎందుకు ఉన్నారు. సైకిటార్టిస్ట్‌ను ఎందుకు కలిశారు అని క్రాంతికి అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది శాలిని. సైకియార్టిస్ట్ క్రాంతి వాళ్లను చూసి షాక్ అయి వెళ్లిపోతాడు. ఆయనేంటీ అలా రియాక్ట్ అయ్యారంటుంది శాలిని. క్రాంతి వెళ్లి సైకియాట్రిస్ట్‌ను నిలదీస్తాడు.

అక్కడ విరాట్ రాసి ఉన్న ప్రశ్నలు చూపిస్తుంది శాలిని. దాంతో సైకియార్టిస్ట్‌ను వరాట్ విరాట్ చేసింది అంతా చెబుతాడు. ఈరోజు అన్నయ్య సంగతి తేలుస్తాను అని క్రాంతి అంటాడు. మరోవైపు రాజ్ బైక్‌పై వస్తే కారు ఎక్కడ అని అడుగుతుంది శ్రుతి. బైక్ అయితే రొమాంటిక్‌గా ఉంటుందని రాజ్ అంటాడు. రాజ్‌కు గిఫ్ట్ ఇస్తుంది శ్రుతి. గోల్డ్ రింగ్ అనుకుని చూసిన రాజ్ చూస్తే కీ చైన్ ఉంటుంది.

రాజ్‌కు శ్రుతి గిఫ్ట్

ఇది మన కార్‌కు బాగుంటుందని శ్రుతి అంటే.. మనది అంటున్నావేంటే లైఫ్ పార్టనర్‌గా ఒప్పుకున్నట్లేగా అని రాజ్ అంటాడు. శ్రుతి సంతోషిస్తుంది. మరోవైపు హోమం విబూదిని జగదీశ్వరికి చంద్రకళ ఇస్తే శ్యామల వద్దంటుంది. తర్వాత క్రాంతి వచ్చి గొడవ చేస్తాడు. శాలినికి హిప్నటైజ్ చేయించడం గురించి చెప్పి నిలదీస్తాడు క్రాంతి.

దాంతో విరాట్ అవును చేయించానని ఒప్పుకుంటాడు. నిన్ను అన్నయ్య అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉందని క్రాంతి అంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More