నిన్ను కోరి నవంబర్ 5 ఎపిసోడ్ : అందరినీ ఏడ్పించేసిన చంద్ర- విరాట్‌ క‌న్నీళ్లు- ల‌గేజీ స‌ర్దుకుని గుడ్‌బై!

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో ఇంటి నుంచి వెళ్లిపోతున్న చంద్ర అందరినీ ఏడిపించేస్తుంది. శ్యామల, జగదీశ్వరితో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. కానీ క్రాంతి మనసు మాత్రం కరగదు. విరాట్ తో కలిసి కన్నీళ్లు పెట్టుకుంటుంది చంద్ర.  

Published on: Nov 05, 2025 7:26 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో ఫిష్ కర్రీలో విషం కలిపాను. మీరు గెస్ చేసింది నిజమే అని చెప్పగానే శ్యామల, కామాక్షి, శ్రుతి వాంతి చేసుకుంటారు. జోక్ చేశానని చంద్ర అంటుంది. చంపాలనే ఆలోచన నాకుంటే ఎప్పుడో చేసి ఉండేదాన్ని, మీరు అనుకున్నంత క్రూరమైన దాన్ని కాదని చంద్ర చెప్తుంది.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్యామలను ఏడ్పించేసిన చంద్ర

వరుసకు పిన్ని ఏమో కానీ మిమ్మల్ని అమ్మలాగే చూస్తా. అందరూ ద్వేషించిన సమయంలో మీరు నాకు కొండంత అండగా నిలిచారు. మీ కారణంగానే నా భర్త మనసు గెలుచుకోగలిగా. నా మనసులో ఎప్పుడూ మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ కోపం కొండంత అయితే ప్రేమ ఆకాశమంత అని శ్యామలను హగ్ చేసుకుంటుంది చంద్రకళ. శ్యామల కూడా ఎమోషనల్ అవుతుంది.

కరగని క్రాంతి

నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా వదిన అని పిలవడం మానలేదు. నేను నీకు గుడ్ బై చెప్పడానికి వచ్చా. అన్నదమ్ముల్లా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా అన్ని షేర్ చేసుకున్నారు. మీ మధ్య దూరం పెరగడం నాకిష్టం లేదు. నేను వెళ్లిపోయిన తర్వాత ఎప్పటిలా కలిసి ఉండండని చంద్ర అంటుంది. సింపతీగా నాలుగు మాటలు మాట్లాడితే మంచితనం అని నమ్మే అమాయకుడు క్రాంతి ఇప్పుడు లేడని క్రాంతి సీరియస్ గా అంటాడు.

మళ్లీ వస్తా

ఏ రోజుకైనా మళ్లీ తిరిగొస్తాననే నమ్మకంతో వెళ్తున్నా. మామయ్య ఎప్పుడు కోలుకున్నా నా తప్పు లేదనే చెప్తారు. మీ కొడుకు నాతో వస్తానన్నా నేను రావద్దనే చెప్తా. నా వల్ల మీ అబ్బాయి మీకు దూరమవడం ఇష్టం లేదు. నేను వెళ్లాక బావ ఒంటరి అవుతాడు. ఆయన బాధను మీరు అర్థం చేసుకోండని జగదీశ్వరిని కూడా ఏడిపించేస్తుంది చంద్ర.

విరాట్ బాధ

తెల్లవారితే నువ్వు వెళ్లిపోతావన్న ఆలోచన తట్టుకోలేకపోతున్న చంద్ర. బాధను దాచడం తేలిక కాదు. గుండె పిండేసినట్లు అవుతుందని విరాట్ అంటాడు. మనం కలిసి ఉన్న రోజులు గుర్తు చేసుకో బావ అని పాత విషయాలు గుర్తుచేస్తుంది చంద్ర. జీవితాంతం ప్రేమను పొందాలనుకున్నా కానీ ఆ అవకాశం లేదు బావ. గడువులోపు ప్రూవ్ చేసుకోలేకపోయా. నన్ను క్షమించు బావ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది చంద్ర. చంద్రను హత్తుకుని ఓదార్చుతాడు విరాట్.

పొద్దున వెళ్లిపోతున్న చంద్రతో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండటం సాధ్యమేనా అని విరాట్ అంటాడు. మామయ్య కోలుకున్నాక మళ్లీ ఇంట్లో అడుగుపెడతానని చంద్ర చెప్తుంది. ఈ రోజు మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్న మామయ్య. కానీ ఏదో ఒక రోజు మీ నుంచి పిలుపు వస్తుందనే నమ్మకంతో వెళ్తున్నా అని రఘురాంతో చంద్ర అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.