Sign in

నిన్ను కోరి నవంబర్ 4 ఎపిసోడ్: చేపలమ్ముతూ దొరికిపోయిన రాజ్-కలిసే తిందామన్న శాలిని-ఫిష్ కర్రీలో విషం కలిపానన్న చంద్రకళ

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 4 ఎపిసోడ్ లో చివరి రోజు కుటుంబంతో సంతోషంగా గడపుతానని చంద్ర అంటుంది. అందరి కోసం స్పెషల్ గా చేపల కూర వండుతుంది. రాజ్ చేపలమ్ముతూ శ్రుతికి దొరికిపోతాడు. కానీ గెటప్ అని కవర్ చేస్తాడు. ఫిష్ కర్రీలో విషం కలిపానని చెప్తుంది చంద్ర. 

Published on: Nov 4, 2025, 07:31:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 4 ఎపిసోడ్ లో ఈ ఒక్క రోజు నాకెంతో విలువైంది. సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. పగతో కాదు తాళి పడిందనే బంధంతో ఇంటికి వచ్చా. నా భర్త మనసు మాత్రమే గెలుచుకున్నా. మిగతావాళ్లందరూ శత్రువులా చూస్తున్నారు. ఈ కుటుంబానికి దూరమవుతున్నాననే బాధ ఉంది. ఆ బాధతో జీవితమంతా గడపాలని లేదు. అందుకే ఈ రోజు అందరూ నాకు కోపరేట్ చేయాలి. నా చేతితో వండిపెడతానని చంద్రకళ అంటుంది.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

రాజ్ ను చూసిన శ్రుతి

జల్ రాజ్ చేపలు అమ్ముతాడు. తొందరగా శ్రుతిని సెట్ చేయాలని రాజ్ అనుకుంటాడు. చేపలు చేపలు అంటూ వీధిలో తిరుగుతూ అమ్ముతాడు. అప్పుడే అతణ్ని చంద్రకళ పిలుస్తుంది. చేపలు అమ్ముతున్న రాజ్ ను శ్రుతి చూసి షాక్ అవుతుంది. చేపలంటే నాకిష్టం అందుకే కొంటుంది అత్తయ్య అని శ్యామలకు చెప్తాడు విరాట్. శ్రుతిని చూసి రాజ్ కంగారు పడతాడు. అక్కడి నుంచి జారుకుంటాడు. శాలిని, క్రాంతి బయటకు వెళ్తారు.

గెటప్ అని కవరింగ్

శ్రుతి బయటకు వచ్చి రాజ్ తో సీరియస్ గా మాట్లాడుతుంది. నోటికి వచ్చినట్లు తిడుతుంది. కానీ నిన్ను కలవడానికి వేసిన గెటప్ ఇది. మొన్న ఫోన్ చేస్తే మీ అమ్మ మాట్లాడింది. మనం కలవలేదు. అందుకే ఇలా ఇంటికి వచ్చానని కవర్ చేస్తాడు రాజ్. మరి ఎందుకు కంగారు పడ్డావని అడుగుతుంది శ్రుతి.

ఫ్యామిలీ బయటకు వస్తే కంగారుగా ఉండదా, నీకే ప్రాబ్లెం కదా అని అంటాడు రాజ్. చేపలు అమ్మేవాళ్లయితే ప్రాబ్లెం ఏంటీ? వాళ్లకు మనసు ఉండదా? అని ప్రశ్నిస్తాడు రాజ్. నా కోసం గెటప్ లో వచ్చావని చెప్పాక ఇంప్రెస్ అయ్యానని శ్రుతి అంటుంది.

విరాట్ హెల్ప్

నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడానికి వీల్లేదని విరాట్ ఉల్లిపాయలు కోస్తాడు. మీరు ఏం చెప్తే అది చేస్తా మహారాణి అని అంటాడు. ఆ సీన్ చూసి కామాక్షి కుళ్లుకుంటుంది. విరాట్, చంద్ర కలిసి వంట కంప్లీట్ చేస్తారు. వాసన ఘుమఘుమలాడుతోందని అంటాడు విరాట్. ఇద్దరే కలిసి తినండని శ్యామల అంటుంది. కానీ శాలిని ఏమో అందరం కలిసి తిందామని అంటుంది. సంతోషాలు పోగేసుకోవాలని అనుకుంటుంది. చంద్ర ఉసురు కారణంగా కడుపులో బిడ్డకు ఏమైనా అయితే ఎలా? అని శాలిని అంటుంది.

కర్రీలో విషం

చంద్ర, విరాట్ కలిసి వడ్డిస్తారు. జగదీశ్వరి మినహా అందరూ తింటారు. చంద్ర వెళ్లిపోతే ఆమె చేతి వంట మిస్ అవుతానమ్మా అని కామాక్షితో అంటుంది శ్రుతి. ఈ రోజు గడిస్తే ప్రశాంతంగా తినొచ్చని శ్యామల అంటుంది. ఫిష్ కర్రీ టేస్టీగా ఉండాలని మసాలాతో పాటు విషం కూడా యాడ్ చేశానని చంద్ర అంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More