నిన్ను కోరి నవంబర్ 6 ఎపిసోడ్: మాట్లాడిన రఘురాం- చంద్ర తప్పులేదన్న మామయ్య- తలపై కొట్టింది ఎవరంటే? శాలిని టెన్షన్
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 6 ఎపిసోడ్ లో చంద్రకళ ఇల్లు వదిలి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఆ సమయంలోనే రఘురాంలో కదలిక వస్తుంది. అతను మాట్లాడి చంద్ర తప్పు లేదని చెప్తాడు. కానీ తన తల మీద కొట్టింది ఎవరన్నది కచ్చితంగా చెప్పలేకపోతాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 6 ఎపిసోడ్ లో ఏదో ఒక రోజు ఈ ఇంటి నుంచి పిలుపు వస్తుందనే నమ్మకంతో వెళ్తున్నానని రఘురాంతో చెప్తుంది చంద్రకళ. మీ నోటితో తప్పు లేదని చెప్పించాలనుకున్నా. ఆ రోజు సీతారాములు వనవాసం చేశారు. ఈ రోజు నేను ఒంటరిగా చేయాలని ఉందేమోనని చంద్ర బాధపడుతుంది. ఇక బయల్దేరొచ్చు అని కామాక్షి అంటుంది.
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
మాట్లాడిన రఘురాం
చంద్ర లగేజీ పట్టుకుని గడప దాటబోతుంది. అప్పుడే ఆగు చంద్ర అని రఘురాం అనడంతో అందరూ షాక్ అవుతారు. రఘురాం లేచి నిల్చుంటాడు. అమ్మ చంద్రా, నువ్వెందుకమ్మా గడప దాటడం. నువ్వు ఏ తప్పు చేశావని. చేసిన వాళ్లు ఇక్కడే ఉన్నప్పుడు ఏ తప్పూ చేయని నువ్వు ఇళ్లు వదలడం ఏంటమ్మా? అని రఘురాం అంటాడు. నాన్న నువ్వు మాట్లాడుతున్నావా? అని విరాట్ సంతోషం పట్టలేకపోతున్నాడు.
నిజం చెప్పిన మామయ్య
అందరూ కలిసి చంద్రకళను వదిలించుకోవాలని చూస్తున్నారా? నాకు అన్ని వినపడుతూనే ఉన్నాయి. కనబడుతూనే ఉన్నాయి. కానీ స్పందించలేక చంద్రకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోలేకపోయా. చంద్రకు నిజం దాయమని చెప్పిందే నేను. ఆ రోజు నిజం చెప్దామని బయల్దేరా. ఆ వరదరాజులు, శ్రీరాజులు ఇద్దరు కలిసి యాక్సిడెంట్ ప్లాన్ చేశారు. ఇదే జరిగిన వాస్తవం అని రఘురాం అంటాడు. ఈ మాట కోసం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూశానని చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది.
తలపై ఎవరు కొట్టారు?
చంద్రను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది జగదీశ్వరి. వినాయక చవితి రోజు నిన్ను తల మీద కొట్టిందెవరూ అని శ్యామల, క్రాంతి అడుగుతారు. రఘురాం అందరి వైపు వేలు చూపిస్తూ చివరకు శాలిని దగ్గర ఆపుతాడు. కానీ ఏమోరా ఫేస్ తెలియడం లేదని రఘురాం అంటాడు. ఆ తర్వాత నువ్వే కదా ఆ రోజు నన్ను కొట్టిందని శాలిని వైపు చూపిస్తూ అంటాడు రఘురాం. విరాట్ డాక్టర్ ను రప్పిస్తాడు.
గుర్తు పట్టలేక
మనుషులను గుర్తు పట్టనట్లుగా బిహేవ్ చేస్తాడు రఘురాం. అప్పుడే గుర్తుపట్టి, మళ్లీ అంతలోనే మర్చిపోతాడు. ఆయన కండీషన్ బట్టి చూస్తే గతంలో జరిగిన సంఘటలను, మనుషులను గుర్తు చేసుకోకపోవడం. ఈ విషయంలో కొన్ని విషయాలు గుర్తుంటాయి. కొన్ని మర్చిపోతారు. ఒకరిని చూసి ఒకరు అనుకుంటారు. రెండు సార్లు తల మీద దెబ్బ తగిలిన తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కామన్ అని డాక్టర్ చెప్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.