నిన్ను కోరి నవంబర్ 19 ఎపిసోడ్: శాలినికి చంద్ర‌, విరాట్ వార్నింగ్‌-క్రాంతిని రెచ్చ‌గొట్టిన శాలిని-విరాట్‌పై శ్యామ‌ల ఫైర్‌

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 19 ఎపిసోడ్ లో శాలినికి విరాట్, చంద్ర వార్నింగ్ ఇస్తారు. కానీ క్రాంతి దగ్గర నటించిన శాలిని భర్తను రెచ్చగొడుతుంది. శ్యామల వెళ్లి విరాట్ పై ఫైర్ అవుతుంది. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని చంద్ర చెప్తుంది. 

Published on: Nov 19, 2025 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 19 ఎపిసోడ్ లో నువ్వు వేస్తున్న వెధవ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవలు మామయ్య చూసేలా చేయాలని అనుకుంటున్నావు. కానీ ఏ ప్రయత్నాలు నెరవేరవని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్ ను చూసి శాలిని డ్రామా ఆడుతుంది. నా మీద వేయాల్సిన నింద నిజం చేయాలన్నిది మీ మోటో అని విరాట్, చంద్రతో అంటుంది శాలిని.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar )
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar )

విరాట్ వార్నింగ్

మా జీవితాలను బలి తీసుకోవాలని అనుకుంటుంది నువ్వు. ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుంది నువ్వు. నీ రంగులు త్వరలోనే బయటపడతాయి చూడు అని విరాట్ కూడా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే శాలిని వాంతులు చేసుకుంటుంది. ఆమెను శ్యామల రూమ్ లోకి తీసుకెళ్తుంది. గదిలో కూర్చుని రెస్ట్ తీసుకోక ఏం చేస్తున్నావని శ్యామల అడుగుతుంది.

క్రాంతి ఆవేశం

మీ అన్నదమ్ముల గొడవ గురించి మామయ్యకు తెలిసేలా చేస్తున్నానని చంద్రకళ అంటుంది. బావగారు కలగజేసుకుని హర్ట్ చేసేలా మాట్లాడారు. మామయ్యను కొట్టానని ఒప్పుకునేదాకా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారని క్రాంతికి శాలిని చెప్తుంది. ఈ టైమ్ లో శాలినిని ఇబ్బంది పెడుతుంటే ఎలా అని క్రాంతి మళ్లీ ఆవేశపడతాడు. ఈ విషయాన్ని నెమ్మదిగా డీల్ చేసి, వాళ్లు శాలిని జోలికి రాకుండా చూస్తానని శ్యామల చెప్తుంది.

రాజ్ ఢీ

గోల్డ్ చెయిన్ తీసుకుని వస్తున్న రఘురాం ఐస్ క్రీం తిందామని ఆగుతాడు. అప్పుడే బైక్ పై వచ్చిన రాజ్.. రఘురాంను ఢీకొడతాడు. రాజ్, రఘురాం గొడవపడతాడు. శాలిని వచ్చి ఆపుతుంది. రాజ్ సారీ చెప్పడంతో వెళ్లిపోతారు. ఇటు రూమ్ లో విరాట్ ను కూల్ చేసేందుకు చంద్రకళ ట్రై చేస్తుంది. విసిగించకు చంద్ర అని విరాట్ కోప్పడతాడు.

శ్యామల ఫైర్

పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తూ కోపాన్ని వదిలేయాలి. నవ్వితే చూడు ఎంత క్యూట్ గా ఉన్నావో అని చంద్ర అంటుంది. నువ్వు నా స్ట్రెస్ బస్టర్ అని విరాట్ అనేసరికి ఇద్దరూ నవ్వుకుంటూ క్లోజ్ గా వస్తారు. అప్పుడే శ్యామల వచ్చి కడుపుతో ఉన్న పిల్లను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతుంది. నువ్వెందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని విరాట్ ను అంటుంది శ్యామల. నిజం నాకు తెలుసు కాబట్టి అని విరాట్ అంటాడు.

ప్రేమతో మార్చాలని

నిజం బయటపడ్డ రోజు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతి దానికి చంద్రను కార్నర్ చేస్తావు అత్త. తనను ఏమన్నా అంటే బాగోదని విరాట్ అంటాడు. అమ్మానాన్న గురించి పట్టించుకోవా? ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్ ఈవిడ చేతుల్లోకి వెళ్లిపోయింది. నువ్వు, క్రాంతి ఎక్కడ విడిపోతారోనని అమ్మ బాధపడుతుంది. ఈ ఇంటి గురించి కూడా ఆలోచించమని చెప్పి శ్యామల వెళ్లిపోతుంది.

ఎందుకు క్రాంతి ఇంత మూర్ఖంగా మారిపోయాడు. శాలిని మాయలో ఎలా పడిపోయాడని విరాట్ ఆవేశపడతాడు. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని బావకు చంద్ర చెప్తుంది. క్రాంతి కోసం కామాక్షి గ్రీటింగ్ కార్డు చేస్తే రఘురాం బాలేదంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.