నిన్ను కోరి నవంబర్ 14 ఎపిసోడ్: కలిసిన అన్నదమ్ములు- ముద్దు కోసం విరాట్ పాట్లు- చంద్ర‌కళకు అత్త స‌పోర్ట్‌

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో ఇన్వెర్టర్ రిపేర్ చేస్తుండగా విరాట్ వెనక్కి పడతాడు. అప్పుడు క్రాంతి పట్టుకుంటాడు. అన్నదమ్ములు ఇలా ఉండటం చూసి ఫ్యామిలీ హ్యాపీగా ఫీలవుతుంది. ముద్దు కోసం చంద్ర దగ్గర నానా పాట్లు పడతాడు విరాట్. చంద్రకు అత్త సపోర్ట్ గా నిలుస్తుంది. 

Published on: Nov 14, 2025, 07:41:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 14 ఎపిసోడ్ లో మారడానికి ప్రయత్నించమని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. కడుపుతో ఉన్న మనిషివి ఇలాంటి క్రూరమైన ఆలోచనలు చేయొద్దంటుంది. చేయని తప్పునకు నింద వేస్తున్నావని క్రాంతికి చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించుకో అని శాలిని అంటుంది. అప్పుడే విరాట్ వచ్చి నాన్నను రెచ్చగొట్టి పైకి పంపించింది శాలిని హా అని అడిగితే లేదని చంద్ర అబద్దం చెప్తుంది.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్యామలకు కరెంట్ షాక్

బైక్ మీద వచ్చిన రాజ్ ను చూసి మళ్లీ డౌట్ పడుతుంది శ్రుతి. పనివాళ్ల బైక్ మీద తిరగొద్దని చెప్పాను కదా అని శ్రుతినే అనడంతో రాజ్ తప్పించుకుంటాడు. మరోవైపు రఘురాం సంతోషంగా బొబ్బట్లు తినడంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెంట్ పోతుంది. ఇన్వెర్టర్ రిపేర్ చేయకుండా ఏం చేస్తున్నారని అడుగుతాడు రఘురాం. చూస్తానని వెళ్లిన శ్యామలకు షాక్ కొడుతుంది.

విరాట్, క్రాంతి కలిసి

విరాట్ చెక్ చేస్తాడు. అన్నయ్యకు టూల్ బాక్స్ ఇవ్వమని క్రాంతికి చెప్తాడు రఘురాం. క్రాంతి అన్నయ్య అని పిలుస్తాడు. విరాట్ వెనక్కి పడిపోతుంటే పట్టుకుంటాడు క్రాంతి. అది కాదు అన్నయ్య పక్క వైర్ అని చెప్తాడు క్రాంతి. కలిసి ఉంటే కలదు సుఖమని ఒకరికొకరు ఇలా హెల్ప్ ఫుల్ గా ఉంటే ప్రాబ్లెం ఉండదని రఘురాం అంటాడు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్స్ అని తండ్రి అంటాడు.

ముద్దు కోసం

బావ మీ తమ్ముడు నీతో మాట్లాడినందుకు ఉప్పొంగిపోతున్నావని చంద్రకళ అంటుంది. అన్ని మర్చిపోయి నాతో ఎప్పటిలాగే బిహేవ్ చేశాడు. అది జెన్యూన్ ఫీల్. అలా కలిసి ఉండటం చూసి అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని విరాట్ అంటాడు. విరాట్ షర్ట్ మార్చుకుంటుంటే సిగ్గుపడి చంద్ర అటు తిరుగుతుంది. చంద్రను దగ్గరకు లాక్కుంటాడు విరాట్. ముద్దు ఇవ్వబోతుంటే నెట్టేస్తుంది చంద్ర.

చంద్రపై నిందలు

చంద్ర కారణంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. అన్నదమ్ములను విడగొట్టింది. అన్నయ్య కోలుకున్నా కొడుకులను చూసి వదిన బాధపడుతోందని శ్యామల, కామాక్షి మాట్లాడుకుంటారు. అది విన్న చంద్ర వచ్చి వాళ్లు విడిపోవాలని నేనెందుకు అనుకుంటా. క్రాంతి కాపురం విడిపోకుండా అడ్డుపడినదాన్ని. అన్నదమ్ముల మధ్య అడ్డుగోడ ఎందుకు కడతానని చంద్ర అడుగుతుంది. క్రాంతి తిరగబడేసరికి విరాట్ దృష్టిలో చెడ్డవాన్ని చేస్తున్నావని కామాక్షి అంటుంది.

కామ్ గా ఉండాలని

ఇదంత విన్న జగదీశ్వరి వచ్చి నిజమేంటో పూర్తిగా తెలియకుండా తప్పు చేశావని ఒక మనిషిని పదే పదే నిందించడం సరికాదు. ఈ టాపిక్ గురించి చర్చించకూడదని ఎన్నిసార్లు చెప్పినా నట్టింట్లో నిలబడి మరీ మాట్లాడుతున్నారు. దయచేసి కామ్ గా ఉండండని జగదీశ్వరి వెళ్లిపోతుంది.

మా అత్తయ్య బంగారం. రేపో మాపో అది నిజం కాదని మీకు తెలిసిపోతుంది. నా కథ సుఖాంతం అవుతుంది. భర్తను కొంగుకు కట్టుకునే అవకాశం లేదని బాధ పడుతున్నారా? అని శ్యామల, కామాక్షికి కౌంటర్ ఇస్తుంది చంద్ర. రాజ్ బైక్ పై శ్రుతి రావడం రఘురాం చూస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More