నిన్ను కోరి నవంబర్ 15 ఎపిసోడ్: శాలిని ప్లాన్ ఫెయిల్ చేసిన రఘురాం- బర్త్ డే రోజున భార్య నిజ స్వరూపం తెలుసుకున్న క్రాంతి

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 15 ఎపిసోడ్‌లో క్రాంతిని ఢిల్లీకి పంపించి రఘురాం నోరు శాశ్వతంగా మూయించాలని ప్లాన్ వేస్తుంది శాలిని. కానీ, క్రాంతి బర్త్ డే అని చెప్పి శాలిని ప్లాన్‌ను ఫెయిల్ అయ్యేలా చేస్తాడు రఘురాం. మావయ్య పాత స్థితికి రావాలని డాక్టర్‌తో కాల్ మాట్లాడుతుంది శాలిని. ఆ మాటలు క్రాంతి వింటాడు.

Published on: Nov 15, 2025 8:47 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌తో శ్రుతి మాట్లాడటం, హగ్ చేసుకోవడం రఘురాం చూస్తాడు. రాజ్ వెళ్లిపోతాడు. శ్రుతి అని గట్టిగా అరిచిన రఘురాం బావ అంటే ప్రాణం అని చెప్పి బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతావా. ఇంట్లోకి రా నీ సంగతి చెబుతాను అని అంటాడు. భయంతో శ్రుతి వస్తుంది.

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 15 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 15 ఎపిసోడ్‌

చెల్లెళ్లను తోసేసిన రఘురాం

మొత్తం చూసేశాను అంటూ కామాక్షి, శ్యామలను తోసేసి మరి శ్రుతి దగ్గరికి కోపంగా వెళ్తాడు రఘురాం. నేలపై ఫ్లవర్ వాజ్ కిందపడిన సౌండ్ విని ఆగిపోతాడు. ఏం చూశారు అని వచ్చి జగదీశ్వరి అడుగుతుంది. మర్చిపోయాను అని రఘురాం అంటాడు. అన్నయ్య శ్రుతి వైపు పరిగెత్తాడు. ఏమైనా చెప్పాలనుకున్నాడా అని శ్యామల అంటుంది.

శ్రుతి నువ్వు బైక్‌పై వచ్చావుగా. అతనెవరు అని రఘరాం అంటాడు. బుక్ చేసుకున్నాను. అతను డ్రైవర్ అని శ్రుతి కవర్ చేస్తుంది. మరోవైపు విరాట్, క్రాంతిని ఎలా విడగొట్టాల అని ఆలోచిస్తుంది శాలిని. క్రాంతి వస్తాడు. వాళ్లతో నాన్న కోసం చనువుగా నటించడం కష్టంగా ఉందంటాడు. రెండు రోజులు బయటకెళ్దామని క్రాంతి అంటాడు.

తప్పించుకోడానికే వెళ్లారని నిందిస్తారు. వద్దని శాలిని అంటుంది. డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కి కావాల్సిన మెటీరియల్ కోసం ఢిల్లీకి వెళ్లాలన్నావుగా. ఇప్పుడే వెళ్లు అని శాలిని అంటుంది. దాంతో క్రాంతి సరే అంటాడు. నువ్వు ఇంట్లో లేని టైమ్‌లో మావయ్య నోరు శాశ్వతంగా మూతపడేలా చేసి, అది చంద్రపై తోసేస్తాను అని శాలిని కొత్త స్కెచ్ వేస్తుంది.

ఢిల్లీకి క్రాంతి

మరోవైపు సౌండ్ రాగానే రఘురాం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడని కనిపెడుతుంది చంద్రకళ. ఇంతలో క్రాంతి లగేజ్‌తో వచ్చి ఢిల్లీకి వెళ్తున్నా అని అంటాడు. క్రాంతికి ఇంట్లో ఉండాలనిపించట్లేదట. మనశ్శాంతి కోసం వెళ్తానంటున్నాడని శాలిని అంటుంది. నాన్న కోసమే ఇంట్లోంచి వెళ్తున్నా అని క్రాంతి అంటాడు. ఇంతలో రఘురాం వచ్చి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదంటాడు.

బర్త్ డే రోజు ఇంట్లో ఉండకుండా ఢిల్లీకి వెళ్తానంటావేంటీ. ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటావ్. రేపు అంతా సెలబ్రేట్ చేసుకుందాం. ఎప్పటిలా గ్రాండ్‌గా చేయాలని రఘురాం అంటాడు. ఏరా విరాట్ మాట్లాడవు అని రఘురాం అంటాడు. నీ భార్య కడుపుతో ఉంది. నీ బర్త్ డే, నాన్న ఆరోగ్యంగా కోలుకున్నారు. ఇంతకంటే సంతోషం ఏముంది అని విరాట్ అంటాడు.

దాంతో క్రాంతి ఢిల్లీకి వెళ్లడు. అలా శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఏం చేస్తారో తెలియదు. అంతా సంతోషంగా బర్త్ డే జరగాలని రఘురాం డిమాండ్ చేస్తాడు. సరేనని జగదీశ్వరి అంటుంది. ఎలాంటి గొడవలు జరకుండా చూసుకోరా అని విరాట్‌ను బతిమిలాడుకుంటుంది జగదీశ్వరి. పరిస్థితులను బట్టి వాడికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది కానీ వాడి మీద నాకు ఎలాంటి కోపం లేదు అని బంధాల గురించి చెబుతాడు విరాట్.

కూతురుతో సమానమేగా

పాల గ్లాస్‌తో చంద్రకళ వెళ్తుంటే శ్యామల ఆపుతుంది కామాక్షి అవమానిస్తుంది. చంద్రకళను శ్యామల తిడుతుంది. అది విన్న రఘురాం నా కూతురుని అంత అంటావా అని శ్యామలపై కోప్పడతాడు. మావయ్య నేను మీ కోడలిని అని చంద్రకళ అంటుంది. కోడలివి అయితే ఏంటీ కూతురుతో సమానమేగా. భార్యాభర్తల అన్యోన్యంగా ఉంటే అడ్డుపడతారా అని జగదీశ్వరితో చేసిన రొమాన్స్ గురించి చెబుతాడు.

దానికి ఇబ్బంది పడిన శ్యామల వాళ్లు ఇంట్లో పనులు చేయాలిగా అంటారు. మీరు ఖాలీగానే ఉన్నారుగా. నీకు పెళ్లి కాలేదు. దానికి అయినా లాభం లేదు. మీకు లేని సంతోషం తనకు దక్కుతుందని కుళ్లుకుంటున్నారా ఏంటీ అని వార్నింగ్ ఇస్తాడు రఘురాం. దాంతో శ్యామలకు పని చెప్పి వెళ్లిపోతుంది చంద్రకళ. గదిలో ముద్దు గురించి చంద్ర, విరాట్ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు.

శాలిని నిజ స్వరూపం తెలుసుకున్న క్రాంతి

మరుసటి రోజు ఉదయం క్రాంతి బర్త్ డేకి ఫస్ట్ విష్ చేయడం గురించి విరాట్ చెబుతాడు. మరోవైపు రఘురాంను పాత స్థితిలోకి తీసుకెళ్లడానికి ఏం చేయాలో చెప్పండి అని డాక్టర్‌తో శాలిని మాట్లాడుతుంది.

ఆ మాటలు క్రాంతి వింటాడు. కోపంతో చూస్తాడు. అది చూసి శాలిని షాక్ అవుతుంది. బర్త్ డే నాడే భార్య నిజ స్వరూపం తెలుసుకుంటాడు క్రాంతి. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/నిన్ను కోరి నవంబర్ 15 ఎపిసోడ్: శాలిని ప్లాన్ ఫెయిల్ చేసిన రఘురాం- బర్త్ డే రోజున భార్య నిజ స్వరూపం తెలుసుకున్న క్రాంతి
News/Entertainment/నిన్ను కోరి నవంబర్ 15 ఎపిసోడ్: శాలిని ప్లాన్ ఫెయిల్ చేసిన రఘురాం- బర్త్ డే రోజున భార్య నిజ స్వరూపం తెలుసుకున్న క్రాంతి