గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతి, కామాక్షితో వర్కౌట్ కానీ బాలు ప్లాన్- డిస్కౌంట్ ఆఫర్‌తో బయటపడిన మనోజ్ మోసం

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 20 ఎపిసోడ్‌లో మనోజ్‌కు శ్రుతి కాల్ చేసి ఆఫర్ గురించి చెబుతుంది. కానీ మనోజ్ వార్నింగ్ ఇస్తాడు. కామాక్షి దగ్గరికి వెళ్లిన బాలు, మీనా నిజం రాబట్టడానికి ట్రై చేస్తారు. కానీ, ప్రభావతి వచ్చి అడ్డుపడుతుంది. రాజేష్ చెప్పిన డిస్కౌంట్ ఆఫర్‌తో మనోజ్ 4 లక్షల మోసం తెలుస్తుంది.

Nov 20, 2025, 08:26:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి కాల్ చేసి చింటు మాట్లాడుతాడు. తల్లిని రోహిణి తిడుతుంది. వాన్ని ఆపలేకపోతున్నాను. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు వస్తావని అడుగుతున్నాడు. వాడి బర్త్ డే వస్తుంది. అప్పుడైనా వస్తావా అని రోహిణి తల్లి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్‌

కవరింగ్ నగలు కొన్నారుగా

సరే చూస్తాను అని రోహిణి చెబుతుంది. ఇంతలో మనోజ్‌కు శ్రుతి కాల్ చేసి గత వారం మా గోల్డ్ షాప్‌లో కవరింగ్ నగలు కొన్నారుగా. అందుకే మీకు ఫ్రీగా బెన్‌ఫిట్స్ ఇస్తున్నాం. మీరు కొన్నట్లు ఆర్డర్ కాపీ ఉంది అని అన్ని నగలు పేర్ల చెబుతుంది శ్రుతి. మీలాంటి కస్టమర్స్‌కు గోల్డెన్ ఆఫర్. మీరు కొన్న నగల మీద 30 పర్సంట్ క్యాష్ బ్యాక్ ఇస్తాం. లేదా ఏదైనా నెక్లెస్ కొనొచ్చు అని ఆఫర్స్ చెబుతుంది శ్రుతి.

ఈ ఆఫర్ ఇవాల్టీకే ఉందని శ్రుతి చెబుతుంది. ఆఫర్ చూస్తే ఆశగా ఉంది. కానీ, ఎక్కువ ఆశకు పోతే నా బండారం బయటపడుతుంది. ఈ కాల్ వెనుక ఎవరైనా ఉన్నారా. ఇప్పటికే నాలుగు లక్షల క్యాష్ పోగొట్టుకున్నాను అని ఆలోచిస్తాడు మనోజ్. ఎవరు నువ్వు ఆటలుగా ఉందా. నేను కొనడం ఏంటీ. ఇదేదో కొత్త రకమైన స్కామ్ ఉన్నట్లుంది అని శ్రుతిని తిట్టి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు మనోజ్.

కచ్చితంగా మనోజే చేశాడు అనుకుంటారు. మరోవైపు తనకు వచ్చిన కాల్ గురించి ప్రభావతికి చెబుతాడు మనోజ్. బాలు, మీనా కలిసి వేరే వాళ్లతో మాట్లాడించి ఉంటారు. మనం ఇలాంటి ఆఫర్స్‌కు కక్కుర్తి పడతామనే చేయించారు. బాలు గాడు దొంగ దొరికే వరకు వదలడు. తొందరగా వాళ్ల నగలు తెచ్చి ఇవ్వు. వాడికి నిజం తెలిస్తే నిన్ను ఊరంతా ఉరికించి కొడతాడు అని ప్రభావతి చెబుతుంది.

కామాక్షి అత్తకు తెలుస్తుంది

నా షో రూమ్ సరిగా నడవట్లేదు. ఒకటి అర అమ్మినా రోహిణి లెక్కలు అడుగుతుంది అని మనోజ్ అంటాడు. ఏదోటి చేసి తొందరగా ఆ నగలు అరెంజ్ చేయు అని చెప్పి వెళ్లిపోతుంది ప్రభావతి. శ్రుతితో చేయించిన ఫలితం ఫలించలేదు. ఏం చేద్దామని మీనా అంటుంది. అమ్మా ఏం చేసిన కామాక్షి అత్తకు చెబుతుంది. ఆవిడను అడగాలి. ఆవిడతో ఏదోటి చేసి చెప్పించాలని బాలు అంటాడు.

కామాక్షి దగ్గరికి బాలు, మీనా వెళ్తారు. కామాక్షికి పళ్లు ఇస్తారు. సుశీల బర్త్ డే ఫంక్షన్ గురించి మాటల్లో బాలు పెడతాడు. సుశీలకు బాలు చేయాలనుకుంది చేయలేకపోయినందుకు బాధపడుతున్నారని మీనా చెబుతుంది. ఇంట్లో నగలు మార్చేసి ఇవ్వాలనుకున్నాం. కానీ కుదర్లేదు అని మీనా అంటుంది. అవి కవరింగ్ నగలు కదా అని కామాక్షి అంటుంది.

నీకెలా తెలుసు పిన్ని అని బాలు అడగ్గానే కామాక్షి షాక్ అవుతుంది. మీ అమ్మ చెబుతుంటే విన్నాను అని కవర్ చేస్తుంది కామాక్షి. తర్వాత మాటల్లో ఆ నగలు మార్చినట్లు అని ఆగిపోతుంది కామాక్షి. తర్వాత సర్దుకుని మనం జాగ్రత్త పడాలి అని మనసులో అనుకుంటుంది కామాక్షి. నిన్ను సొంత అత్తలా చూస్తానని తెలుసు అని కామాక్షి గురించి గొప్పగా చెబుతాడు.

అడ్డుపడిన ప్రభావతి

ఆ నగలు దొరికితే ఇప్పటికైనా బామ్మకు నగ చేయించవచ్చని చూస్తున్నాం అని బాలు అంటాడు. మార్చిన నగల గురించి కామాక్షిని అడుగుతారు. ఇంతలో ప్రభావతి వస్తుంది. ప్రభావతి షాక్ అవుతుంది. బాలు, మీనా వెళ్లిపోతారు. ఆ నగల గురించి తెలుసుకుందామని వచ్చారని, నువ్వు రాకుంటే చెప్పేవాన్ని అని కామాక్షి చెబుతుంది. దాంతో ప్రభావతి షాక్ అయి ఏమాత్రం చెప్పకు అని అంటుంది.

మరోవైపు కరెక్ట్ టైమ్‌కు అమ్మ వచ్చి అడ్డుపడిందని బాలు అంటాడు. ఇంతలో బాలుకు రాజేష్ కాల్ చేసి ఇక్కడ చాలా తక్కువ రేట్‌కు ఫర్నిచర్ అమ్ముతున్నారు. మీ అన్నయ్య ఎలాగు డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఇక్కడే కొంటాను. నువ్వు వచ్చి సెలెక్ట్ చేయు అని రాజేష్ అంటాడు. బాలు రాను అని కాల్ కట్ చేస్తాడు. గంట, అరగంటేగా, అన్నయ్య మనకు చాలా హెల్ప్ చేశాడు. వెళ్లండి అని మీనా చెబుతుంది.

దాంతో రాజేష్ దగ్గరికి బాలు వెళ్తాడు. ఇద్దరు ఆఫర్ ఇచ్చే చోటుకు వెళ్తారు. అక్కడ నగల గురించి కాదు డైరెక్ట్‌గా మనోజ్ నాలుగు లక్షలు మోసపోయినట్లు బాలుకు తెలుస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More