నిన్ను కోరి నవంబర్ 24 ఎపిసోడ్: రాజ్ నాటకం-నిజం తెలుసుకున్న విరాట్-భార్య కోసం జిలేబీ, మల్లెపూలు
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 24 ఎపిసోడ్ లో శ్రుతి కోసం పెద్ద ఇల్లు ఉన్నట్లు నాటకం ఆడతాడు రాజ్. ఇంట్లో జరిగిన విషయాన్ని చంద్రను అడిగి తెలుసుకుంటాడు విరాట్. చంద్ర కోసం జిలేబీ, మల్లెపూలు తీసుకొస్తాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శ్రుతి మన ఇల్లు చూడాలంటుంది. అర్జెంట్ గా ఓ పెద్ద ఇల్లు రెంట్ కు తీసుకోవాలి. చేపలు అమ్మేందుకు వెళ్లే లాయర్ ఇల్లును వాడుకుందామని ఫోన్లో తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు జల్ రాజ్. అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు పని వాళ్లు కూడా ఉండాలి కదా, అరెంజ్ చేయమని చెప్తాడు.

నిజం తెలుసుకున్న విరాట్
విరాట్ తొందరగా ఆఫీస్ నుంచి వస్తాడు. ఆ చంద్ర అన్నయ్యను కొట్టింది శాలిని అనే విషయాన్ని ఇంజెక్ట్ చేసేందుకు ప్రయత్నించింది. ఆయనకు స్ట్రెస్ పెరగడంతో బీపీ పెరిగింది. మళ్లీ డైవర్ట్ అయ్యాడు కాబట్టి అన్నయ్యకు ఏం కాలేదని విరాట్ కు చెప్తుంది శ్యామల. ఏం జరిగిందని చంద్రను అడుగుతాడు విరాట్. జరిగిందంత చెప్తుంది చంద్రకళ.
శాలిని మారాలని
నిజం బయటకు రావడం కన్నా శాలినిలో మార్పు రావడం ముఖ్యం. మాటలు పడటం నాకు అలవాటు అయిపోయింది. నా గురించి ఆలోచిస్తే క్రాంతి మనసు ముక్కలవుతుంది. అది నాకిష్టం లేదు బావ అని చంద్ర అంటుంది. శాలినిని కాదనుకుంటారు కానీ కడుపులో బిడ్డను కాదనుకోరు. బయటకు పంపించలేక, ఇంట్లో తిరుగుతుంటే చూడలేక అందరూ బాధపడతారు. పసి ప్రాణం గురించి ఆలోచించి అయినా శాలినికి అవకాశం ఇవ్వాలని చంద్ర చెప్తుంది.
రాజ్ నాటకం
శ్రుతి కళ్లకు గంతలు కట్టి తీసుకొస్తాడు రాజ్. ఇల్లు చూసి వావ్ అంటుంది శ్రుతి. ఇంట్లో నలుగురు సర్వెంట్లను పరిచయం చేస్తూ కన్ఫ్యూజ్ అవుతాడు రాజ్. స్వాతి అలా ఉంటుంది, ఇలా ఉంటుందని పని మనిషి చెప్పేసరికి రాజ్ షాక్ అవుతాడు. మేడం పేరు స్వాతి కాదు శ్రుతి అని ఏదో కవర్ చేస్తాడు. శ్రుతిని తీసుకొని వెళ్లిపోతాడు.
మల్లెపూలు, జిలేబీ
చంద్రకళకు జిలేబీ అంటే ఇష్టమని తీసుకొచ్చిన విరాట్ నోట్లో పెడతాడు. అలాగే ఇంకోటి కూడా తెచ్చానని మల్లెపూలు చూపిస్తాడు. ఈ పూలు ఎందుకు తీసుకు వస్తారో తెలియదా? ప్రేమగా పూలు తీసుకొచ్చానని చెప్తే ఎందుకు అడుగుతున్నావని విరాట్ అంటాడు. చంద్ర జడలో పూలు పెడతాడు విరాట్. ఇప్పుడు కార్డ్స్ ఆడబోతున్నామని విరాట్ పేక ముక్కలు తీస్తాడు. పొద్దున పూజకు వెళ్లాలి ఉంది, ఆటలేం వద్దని చంద్ర అంటుంది.
రఘురాం తన గదిలోకి వెళ్లి జగదీశ్వరికి జిలేబీ తినిపిస్తాడు. మల్లెపూలు తీసుకొచ్చి జడలో పెడతానంటాడు. ఎవరు చూస్తారు? మా చెల్లెల్లే కదా. నా భర్త నా ఇష్టం అని దబాయించు అని రఘురాం అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


