నిన్ను కోరి నవంబర్ 25 ఎపిసోడ్: శ్రుతిపై రాజ్‌కు డౌట్‌-గుడిలో ర‌ఘురాం మిస్సింగ్‌-చంద్ర‌పై శాలిని కుట్ర‌

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 25 ఎపిసోడ్ లో శ్రుతి గురించి పూర్తిగా కనుక్కోమని రాజ్ కు తల్లి చెప్తుంది. గుడిలో పూజ కోసం రఘురాం ఫ్యామిలీ వెళ్తుంది. చంద్రకళపై నింద పడేలా శాలిని ఏదో ప్లాన్ వేస్తుంది. ప్రదక్షిణ చేస్తుండగా రఘురాం మిస్ అవుతాడు. 

Published on: Nov 25, 2025, 07:36:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో జగదీశ్వరి జడలో మల్లెపూలు పెడతాడు రఘురాం. అప్పుడే వదిన అంటూ శ్యామల, కామాక్షి వస్తారు. అందరిని డిస్టర్బ్ చేయడమేనా? మీ పని అని అంటాడు రఘురాం. మరోవైపు రాజ్ అప్పుల లెక్కలు వేస్తాడు. రూ.9 లక్షలు అప్పు అయిందని అమ్మతో చెప్తాడు. శ్రుతి పడిపోయింది, పెళ్లి చేసుకున్నాక అప్పు తీర్చేస్తానని అంటాడు.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

రాజ్ కు తల్లి సలహా

శ్రుతి మంచిదో, పిచ్చిదో అర్థం కావడం లేదు. లేదంటే నీ వేషాలు కనిపెట్టేదే. అసలు ఆ ఇంద్రభవనంలో శ్రుతి యువరాణో చెలికత్తో ఎవరికి తెలుసు? నువ్వు సరైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావో లేదో చెక్ చేసుకోరా అని రాజ్ కు సరోజ సలహానిస్తుంది. అదే పని చేస్తానని రాజ్ అంటాడు.

గుడికి వెళ్లకుండా

రేపు మనం గుడికి వెళ్లకపోవడమే మంచిదనిపిస్తుంది శాలిని అని క్రాంతి అంటాడు. అత్తయ్యకు వస్తానని చెప్పి ఇప్పుడ ఇలా అంటావేంటీ అని శాలిని అడుగుతుంది. నీ మంచి కోసమే శాలిని. ఈ రోజు వదిన నాన్న మైండ్ ను పొల్యూట్ చేసి నువ్వే దోషివని చెప్పించాలని చూసింది. అంటే తనను తాను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. మొక్కు తీరకుండా చేసి నీపై తోసేస్తుందేమోనని క్రాంతి అంటాడు. రాకపోతే మొక్కు తీరడం ఇష్టం లేదేమో అంటారని శాలిని చెప్తుంది.

రఘురాం మిస్సింగ్

ఉదయం రఘురాం కుటుంబం గుడికి వెళ్తుంది. చీరలను చంద్రకళ టేబుల్ పై పెడుతుంది. ఫ్యామిలీ అంతా గుడిలో ప్రదక్షిణలు చేస్తుంది. అప్పుడే రాజ్ కూడా గుడికి వస్తాడు. ఈ రోజు ఫ్యామిలీలో శ్రుతికి ఉన్న వాల్యూ ఏంటో కనిపెడతానని తల్లికి ఫోన్ చేసి చెప్తాడు రాజ్. మరోవైపు ఎవరి కోసమో ఎదురు చూస్తుంటుంది శాలిని. కానీ క్రాంతి అడిగితే కవర్ చేస్తుంది.

రాజ్ గుడి గంట కొట్టడంతో రఘురాం డైవర్ట్ అవుతాడు. ఒక్కడే ఆగిపోతాడు. మీ అన్నయ్య ఎక్కడ? అని జగదీశ్వరి అడిగితే వెనకాల వస్తున్నాడేమో అని కామాక్షి చెప్తుంది. రఘురాం వెళ్లి ప్రసాదం తీసుకుంటాడు. మళ్లీ గంట సౌండ్ కు మర్చిపోతాడు. ఎందుకు వచ్చాను? గుర్తు రావడం లేదు అని రఘురాం వెళ్లిపోతాడు.

చీప్ గా మాటలు

రఘురాం కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడి వెతుకుతారు. శ్రుతిని శ్యామల నానామాటలు అంటుంది. ఎందుకు ఇంత చీప్ గా మాటలు అంటుందని రాజ్ అనుకుంటాడు. శ్రుతిని తీసుకొని రాజ్ పక్కకువెళ్తాడు. మీ పెద్దమ్మ ఏంటి నిన్ను మరీ పనిమనిషిలా ట్రీట్ చేస్తోంది. మీ ఇంట్లో వాళ్లకు నువ్వంటే లెక్కలేదా? అని అడుగుతాడు రాజ్. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More