నిన్ను కోరి డిసెంబర్ 3 ఎపిసోడ్: శాలిని అబార్ష‌న్ నాట‌కం-చంద్ర‌క‌ళ‌పై నింద‌లు-ప్రెగ్నెన్సీ లేద‌ని విరాట్‌కు తెలిసిన నిజం

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 3 ఎపిసోడ్ లో విరాట్ తోసేయడంతో మెట్ట మీద నుంచి జారి పడ్డ శాలిని డ్రామా కంటిన్యూ చేస్తుంది. నాటకం ప్రకారం డాక్టర్ వచ్చి అబార్షన్ అయిందని చెప్తుంది. అందరూ చంద్రకళపై నిందలు వేస్తారు. శాలిని ప్రెగ్నెంట్ కాదని విరాట్ కు నిజం చెప్తుంది చంద్ర.

Published on: Dec 3, 2025, 07:36:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో విరాట్ తోసేయడంతో శాలిని మెట్ల పై నుంచి పడిపోతుంది. కింద పడి దెబ్బ తగిలినా శాలిని డ్రామా కంటిన్యూ చేస్తుంది. శాలినిని హాస్పిటల్ కు తీసుకెళ్తారు. తను పడలేదు మెట్ల మీద నుంచి తోసేశారని క్రాంతి చెప్తాడు. కంగారు పడకురా అని క్రాంతికి చెప్తాడు విరాట్.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శాలిని డ్రామా

భరోసా ఇవ్వడానికి వచ్చావా? చంపడానికి వచ్చావా? అని విరాట్ పై సీరియస్ అవుతాడు క్రాంతి. జస్ట్ జ్యూస్ లో ఏదైనా కలిసిందని చెప్పమన్నా కానీ ఇంతలా దెబ్బ తగిలించుకున్నారు ఏంటీ అని డాక్టర్ అడుగుతుంది. శత్రువును దెబ్బ కొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తానని శాలిని నవ్వుతూ చెప్తుంది. బయట క్రాంతి ఎమోషనల్ అవుతాడు.

జ్యూస్ వల్ల

జ్యూస్ లో ఏం కలిపావని చంద్రకళపై ఫైర్ అవుతాడు క్రాంతి. తనేమో బిడ్డను చంపే ప్రయత్నం చేసింది. నువ్వేమో నా భార్యను చంపాలని చూశావని క్రాంతి అంటాడు. అంత ఈ మహాతల్లి ట్రైనింగ్ ఏ క్రాంతి, లేకపోతే విరాట్ ఎందుకిలా అవుతాడని శ్యామల అంటుంది. జ్యూస్ వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది. ఏం జరిగినా రెడీగా ఉండండని డాక్టర్ చెప్పడంతో క్రాంతి ఏడుస్తాడు.

అబార్షన్ నాటకం

కడుపు లేదని చెప్పలేను, ముందే డాక్టర్ ను ప్రిపేర్ చేసినట్లుందని చంద్ర అనుకుంటుంది. డాక్టర్ వచ్చి పిండాన్ని కాపాడలేకపోయా. తనకు అబార్షన్ అయిందని డాక్టర్ చెబుతుంది. శాలిని బయటకు వచ్చి క్రాంతిని హగ్ చేసుకుని మొసలి కన్నీళ్లు కారుస్తుంది. పిన్ని అని శ్యామలను పట్టుకుని ఏడుస్తూ చంద్రను చూసి కన్ను కొడుతుంది. నా బిడ్డ, సారీ క్రాంతి నాకు అమ్మ అయ్యే అదృష్టం లేదని శాలిని డ్రామా కొనసాగిస్తుంది.

రఘురాం కోసం

విరాట్,చంద్ర మీదకు కోపంతో క్రాంతి వెళ్తుంటే శాలిని ఆపుతుంది. మామయ్య కోసం గొడవ పడొద్దని తన మీద ఒట్టు వేయించుకుంటుంది శాలిని.ప్రెగ్నెన్సీ పోయిన విషయం మామయ్యకు చెప్పొద్దని అంటుంది. ఫుడ్ పాయిజన్ అయిందంటా అన్నయ్య, ప్రమాదం ఏమీ లేదన్నారు అని శ్యామల చెప్పడంతో అందరూ రిలీఫ్ గా ఫీల్ అవుతారు.

నిందలు వేయొద్దు

రఘురాం రెస్ట్ తీసుకుంటానని లోపలికి వెళ్తాడు. అప్పుడు శాలిని గర్భం పోయిందని చెప్తుంది శ్యామల. క్రాంతి కిందపడి ఏడుస్తాడు. ఈ మహాతల్లి వల్లే, నా బిడ్డను చంపేశారని క్రాంతి ఏడుస్తాడు. మన ఇంటి వారసుడిని నా కడుపులోనే సమాధి చేశారత్తయ్యా అని శాలిని ఏడుస్తుంది. అందరూ చంద్రపై నిందలు వేస్తారు. హత్య చేసిందని అంటారు. నా భార్య మీద నిందలు వేయొద్దని విరాట్ అంటాడు.

నిజం చెప్పిన చంద్ర

మీరెన్ని నిందలు వేసినా భరిస్తూనే ఉన్నాం. అది కూడా నాన్న ఆరోగ్యం కోసమే. ఎవరు ఏమన్నా మనమేంటో తెలుసు రా చంద్ర అని లోపలికి వెళ్తాడు విరాట్. ఎంత తప్పు చేశాను? క్రాంతి బిడ్డను కోల్పోవడానికి కారణం నేను అయ్యానేంటీ? నా చేతులతో ఓ ప్రాణం పోయింది. జీవితాంతం ఈ బాధను ఎలా మోయాలి అని విరాట్ బాధపడుతుంటాడు.

శాలిని కడుపులో బిడ్డ ఉంటే కదా బావ పోవడానికి. శాలిని అసలు ప్రెగ్నెంటే కాదు. తను డ్రామా ఆడింది. నిన్న ఎంక్వైరీ చేస్తే అసలు కన్సీవ్ కాలేదని చెప్పారు. మామయ్య కోసం చెప్పకుండా ఉండిపోయా. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నాటకం బయటపడుతుందని అబార్షన్ డ్రామా ప్లే చేసిందని చంద్ర నిజం చెప్తుంది. ఆ రిపోర్ట్ లు పట్టుకుని విరాట్ అందరినీ పిలుస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More