నిన్ను కోరి డిసెంబర్ 2 ఎపిసోడ్: భార్యకు షాకిచ్చిన క్రాంతి-కొత్త డ్రామా స్టార్ట్ చేసిన శాలిని-తోసేసిన విరాట్
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 2 ఎపిసోడ్ లో శాలినికి చంద్ర వార్నింగ్ ఇస్తుంది. స్టెమ్ సెల్ ప్రిజర్వ్ కోసం డాక్టర్ ను రప్పించి శాలినికి షాక్ ఇస్తాడు క్రాంతి. నకిలీ ప్రెగ్నెన్సీ తెలిసిపోతుందేమోనని శాలిని కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఆమెను తోసేస్తాడు విరాట్.
నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వు మారడానికి నీకో అవకాశం ఇస్తున్నానని చంద్రకళ అంటుంది. వార్నింగ్ లు ఇవ్వకు చంద్ర అని శాలిని నవ్వేస్తుంది. నేను తలుచుకుంటే ఏం చేయగలనో మార్నింగ్ శాంపిల్ చూశావు కదా. నా జోలికి రాకపోవడమే మంచిది. నిజం తెలిస్తే నేను బయటకు పోతానేమో కానీ మామయ్య పైకి పోతారు. అలాంటి మనిషి నా కడుపులో వారసుడు లేడని తెలిస్తే ఏమైపోతాడని శాలిని అంటుంది.

విరాట్ ముద్దు
క్రాంతి మీద కూడా నీకు ప్రేమ లేదు. అతని ఎమోషన్స్ ను వాడుకుంటున్నావు కదా. ఎన్ని రోజులు నాటకమాడుతావు. కడుపులో బిడ్డ లేడనే సంగతి ఎన్ని రోజులు దాస్తావు. ఇక నిన్ను క్షమించను శాలిని అని చంద్రకళ వెళ్లిపోతుంది. ఏదైనా జరిగిందా? అని విరాట్ అడుగుతాడు. ఆఫీస్ లో లెక్కలు కిందామీద అయ్యాయని చంద్ర అబద్ధం చెబుతుంది. విరాట్ వెంటనే ముద్దు పెడతాడు. ముద్దులు, హగ్గుల దగ్గరే మన సంసారం ఆగిపోయింది. ముందుకు ఎప్పుడు వెళ్తుందో, నా తమ్ముడిలా తండ్రి కాబోతున్న సంతోషం ఎప్పుడు అనుభవిస్తానో ఏమో అని అంటాడు విరాట్.
శాలినికి షాక్
కామాక్షికి రాజ్ విషయం చెప్పాలని శ్రుతి ట్రై చేస్తుంది. అప్పుడే డాక్టర్ వస్తుంది. స్టెమ్ సెల్ బ్యాంకు గురించి క్రాంతి చెబుతుంటే శాలిని షాక్ అవుతుంది. ఈ మూల కణాలతో తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవచ్చని డాక్టర్ చెబుతుంది. నాన్న గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని క్రాంతి చెప్తాడు. రిపోర్ట్ తీసుకొని వస్తే అగ్రిమెంట్ రాసుకుందామని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. ఎలా తప్పించుకోవాలని శాలిని ఆలోచిస్తుంటుంది.
చంద్ర వార్నింగ్
ఇంకో 24 గంటల్లో నీ నిజ స్వరూపం ఇంట్లో వాళ్లందరికీ తెలుస్తుంది. నీ నకిలీ ప్రెగ్నెన్సీ నీ అసలు రూపాన్ని బయట పెట్టబోతుంది. క్రాంతి ముందుకు వెళ్లి తప్పులను ఒప్పుకోవడమే మిగిలిందని చంద్ర అంటుంది. చచ్చినా ఆ పని చేయనని శాలిని అంటుంది. చేయకపోతే క్రాంతి చేతిలో చస్తావని చంద్ర వార్నింగ్ ఇస్తుంది. క్రాంతి మనసు విరిగిందంటే కాళ్ల మీద పడ్డా క్షమించడని చంద్ర అంటుంది. ఏది ఏమైనా పైచేయి నాదే అవుతుందని శాలిని వాదిస్తుంది.
శాలిని డ్రామా
అప్పుడే శాలిని డాక్టర్ కు ఫోన్ చేస్తుంది. నాకు ప్రెగ్నెన్సీ లేదనే విషయం ఇంట్లో తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది డాక్టర్. మీరే నన్ను కాపాడాలని డాక్టర్ తో మరో ప్లాన్ చేస్తుంది శాలిని. జ్యూస్ లో ఏం కలిపావు? అందుకే నా కడుపులో నొప్పి వస్తుంది. నా బిడ్డను చంపాలని చూశారని శాలిని డ్రామా స్టార్ట్ చేస్తుంది.
బిడ్డ బయటకు వస్తే స్టెమ్ సెల్ తో మామయ్యకు నయం అవుతుంది. నీ నిజ స్వరూపం బయటకు వస్తుందనే ఇలా చేశావని శాలిని నింద వేస్తుంది. ఆ అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్ వెళ్లాలి కదా అని శాలినిని తోస్తాడు విరాట్. శాలిని మెట్ల పై నుంచి కింద పడిపోతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


