నిన్ను కోరి డిసెంబర్ 1 ఎపిసోడ్: తిరిగొచ్చిన రఘురాం-భార్యను గ్రేట్ అన్న విరాట్-శాలిని చెంపలు వాయించిన చంద్ర
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 1 ఎపిసోడ్ లో రఘురాం కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడతారు. బయట రఘురాంను చూసిన శాలిని కావాలనే రాంగ్ అడ్రస్ చెప్తుంది. జేబులో అడ్రస్ చూసి అతణ్ని ఓ వ్యక్తి ఇంటికి తీసుకొస్తాడు. ప్రెగ్నెంట్ అబద్ధమని తెలిసినా ఏం చేయలేవని శాలిని అంటుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శాలిని ప్రెగ్నెన్సీ అబద్ధమని చంద్రకళ తెలుసుకుంటుంది. ఈ విషయం బయట పెడితే ఇంట్లోవాళ్లు ఏమైపోతారు? ముఖ్యంగా క్రాంతి తట్టుకోగలడా? అని ఆలోచించి చంద్ర ఇంటికి వెళ్తుంది. శాలినిని బయటకు తీసుకొస్తాడు క్రాంతి.

రఘురాం కనిపించలేదని
అక్కడే శాలినిని జూబ్లీహిల్స్ ఎటు వెళ్లాలని రఘురాం అడుగుతాడు. ఈ మనిషి మర్చిపోయారని శాలిని వదిలించుకోవాలని చూస్తుంది. విరాట్ కనిపించలేదని బాధతో ఇంటికి వచ్చి తల్లి జగదీశ్వరికి చెప్తాడు. క్రాంతి ఇంటికి వచ్చి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను కూడా మీకు పరాయివాణ్నేనా? అని అడుగుతాడు. ఏంటి క్రాంతి అసలే మామయ్య కనిపించడం లేదనే టెన్షన్ లో ఉంటే చెప్పలేదని సీరియస్ అవుతావు అని శాలిని అంటుంది.
అడ్రస్ చూసి
కాసేపు వెయిట్ చేసి పోలీస్ కంప్లయింట్ ఇద్దామని శాలిని అంటుంది. మామయ్య రాకుండా రాంగ్ అడ్రస్ చెప్పి కన్ ఫ్యూజ్ చేశానని అనుకుంటుంది శాలిని. మరోవైపు జూబ్లీహిల్స్ ఎలా వెళ్లాలని రోడ్ మీద వెళ్లే వాళ్లను అడుగుతాడు రఘురాం. సౌండ్ కు మళ్లీ డైవర్ట్ అవుతాడు రఘురాం. అతని జేబులో నుంచి అడ్రస్ చిట్టి కింద పడిపోతుంది. అందులో అడ్రస్ చూసి ఆటోలో తీసుకెళ్తానని ఆ వ్యక్తి అంటాడు.
తిరిగొచ్చిన రఘురాం
మరోవైపు పోలీస్ కంప్లయింట్ ఇచ్చేందుకు క్రాంతితో కలిసి శ్యామల వెళ్తుంది. అప్పుడే చంద్రకళ వస్తుంది. మామయ్య తిరిగి వస్తాడనే కాన్ఫిడెన్స్ నాకుందని చంద్ర అంటుంది. అప్పుడే ఆటోలో రఘురాం వస్తాడు. జేబులో అడ్రస్ ఎవరు రాసి పెట్టారని అడుగుతారు. నేనే అని చంద్ర చెప్తుంది. నువ్వు చాలా మంచి పని చేశావమ్మా అని రఘురాం అంటాడు.
గ్రేట్ చంద్ర
శ్రుతి ఎవరితోనో ఫోన్లో క్లోజ్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి ఫాలో అవుతూ వెళ్లా. డిటెక్టివ్ లా వచ్చి పట్టుకోవాలని అనుకున్నా. కానీ మధ్యలో మెమొరీ డైవర్ట్ అయిందని రఘురాం చెప్తాడు. చంద్ర నీ వల్లే నాన్న ఇంటికి తిరిగి రాగలిగాడు. నువ్వు గ్రేట్ చంద్ర. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అందరి ముందు కావాలనే విరాట్ అంటాడు.
నువ్వు మనిషివేనా?
శాలిని గదిలోకి వచ్చి చంద్ర డోర్ లాక్ చేస్తుంది. శాలిని రెండు చెంపలు వాయించేస్తుంది చంద్ర. ఈ ఇంటి వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు వాడికి ఏమైనా అయిందో అని శాలిని అనగానే ఆమె పీకను పట్టుకుంటుంది చంద్ర. ఇదంతా నాటకమని నాకు తెలియదు అనుకుంటున్నావా? కడుపే రాకుండా బిడ్డ ఎక్కడి నుంచి వస్తాడు? ఎవరూ కనిపెట్టలేరనుకున్నావు కదా. పొద్దున ఇల్లంతా పరుగులు పెట్టావు. చాటుగా బొప్పాయి ముక్కలు తిన్నావు. అసలు నువ్వు మనిషివేనా? అని చంద్ర ఫైర్ అవుతుంది.
నా ప్రెగ్నెన్సీ అబద్ధమని తెలిసి ఏం చేస్తావు? నా గురించి బయట పెట్టలేవని శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


