నిన్ను కోరి డిసెంబర్ 11 ఎపిసోడ్: కెమెరా పెన్ ముందు నిజాలు చెప్పేసిన శాలిని- చంద్రకళ నడుము అందాలు- టెంప్ట్ అయిన విరాట్

నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో కెమెరా పెన్‌ను నడుము దగ్గర పెట్టుకుని విరాట్‌ను టెంప్ట్ చేస్తుంది చంద్రకళ. ఇంతలో మేనేజర్ కాల్ చేసి రెండు లక్షలు కావాలంటే చంద్రకళ అరేంజ్ చేయిస్తానంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తావని తల్లిని శ్రుతి అడిగితే లాగిపెట్టి కొడుతుంది కామాక్షి.

Published on: Dec 11, 2025, 08:51:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి జాలి రాజ్ కాల్ చేస్తాడు. ఎక్కడ కలుద్దామని శ్రుతి అంటే.. పెళ్లి గురించి అడుగుతాడు రాజ్. ఏంటీ బేబీ చిరాకు పడుతున్నావ్ అని శ్రుతి మాట్లాడుతుంది. ఇంతలో చంద్రకళ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని శ్రుతి అంటే చంద్రకళ తెగ నవ్వుతుంది.

నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 11 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 11 ఎపిసోడ్‌

తలకు మాసినోడే అయుంటాడు

నిన్ను ప్రేమించాడంటే వాడు కచ్చితంగా తలకు మాసినోడే అయింటాడు అని చంద్రకళ అంటుంది. ఇంతలో శాలిని వస్తుంది. నీ ప్రవర్తనలో తేడా వస్తుందని, ఏంటీ విషయం. ఏ తలకు మాసినవాడిని ప్రేమించావా ఏంటీ అని శాలిని అంటుంది. అది విన్న రాజ్ తల బాదుకుని కాల్ కట్ చేస్తాడు. నీకన్నా చంద్రనే నయం లైఫ్ పార్టనర్‌ను వెతుక్కునేందుకు సలహా ఇచ్చిందని శ్రుతి చెబుతుంది.

ఇదేదే మనకు వర్కౌట్ అయ్యేలా ఉందని శాలిని అనుకుంటుంది. నువ్ ఎంత ట్రై చేసినా కామాక్షి ఒప్పుకుంటుందని లేదుగా. తనింక నిన్ను విరాట్‌కు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటుంది. అందుకే నేను ఎంకరేజ్ చేయలేదు. ముందు కామాక్షికి చెప్పు అని శాలిని అంటే చెబుతాను అని వెళ్లిపోతుంది శ్రుతి. శ్రుతి లవ్ మ్యాటర్ బయటపెట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేసి చంద్రపై నింద తోసేయాలి అని శాలిని అనుకుంటుంది.

మరోవైపు శ్రుతి తనతో బాయ్‌ఫ్రెండ్ అని వేలాకోలం ఆడుతుందని చంద్రకళ చెబుతుంది. పెన్ కెమెరా గురించి విరాట్ అడిగి భద్రంగా దాచిపెడతానంటాడు. పెన్‌ను నడుము దగ్గర పెట్టుకుంటుంది చంద్రకళ. అది చూసి పెన్ కెమెరా ఎంత అదృష్టం చేసుకుందని పొగుడుతాడు విరాట్. నడుము అందాలతో చంద్రకళ టెంప్ట్ చేస్తుంది. తర్వాత గిలిగింతలు పెట్టి చంద్రకళ నుంచి పెన్ తీసుకుంటాడు విరాట్.

2 లక్షలు అరేంజే చేస్తాను

మేనేజర్ కాల్ చేసి అర్జంట్‌గా 2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెబుతాడు. సరే అరేంజ్ చేస్తానని చంద్రకళ అంటుంది. విరాట్‌ను ఆ డబ్బు అడుగుతుంది. వడ్డీ కింద ఓ ముద్దు ఇవ్వమని విరాట్ అంటాడు. అవసరం లేదు. అత్తయ్యను అడుగుతానని చంద్ర అంటే సరే ఇస్తానంటాడు విరాట్. మరోవైపు తల్లిని ఎలాగైనా రాజ్ విషయంలో ఒప్పించాలని అనుకుంటుంది శ్రుతి.

విరాట్ బావతో పెళ్లి జరగడం సాధ్యం కాదు. బయట బావకు సరితూగే మనుషులు చాలా మంది ఉంటారు. అలా నేను ఏ అబ్బాయినైనా ప్రేమిస్తే ఏం చేస్తావని శ్రుతి అడుగుతుంది. దాంతో శ్రుతి చెంప పగులగొట్టి పదేళ్లయిన సరే విరాట్‌తోనే నీ పెళ్లి. ఎవరినైనా ప్రేమిస్తే ఊరుకోను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది కామాక్షి. రాజ్‌ను ప్రేమించానని చెబితే కాళ్లు విరగొట్టేదేమో అని శ్రుతి అనుకుంటుంది.

రాజ్ లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ నా ప్రేమలో పడ్డానని తెలిస్తే అందరి షాక్ అవుతారు. నా వాల్యూ ఏంటో అమ్మకు తెలిసేలా చేస్తానని శ్రుతి అనుకుంటుంది. శాలిని ఫోన్ మాట్లాడే ప్లేసలో చంద్రకళ పెన్ కెమెరా ఫిక్స్ చేస్తుంది. అక్కడికి శాలిని వచ్చి మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి చంద్రకళ వస్తుంది. నీకు దొరికేలా ఏం చేయను అని శాలిని అంటుంది.

నిజం చెప్పిన శాలిని

ఇంతలో అక్కడికి రఘురాం అడ్డుగా వస్తాడు. ఇప్పుడు శాలినితో నిజం చెప్పించడం కరెక్ట్ కాదని చంద్రకళ అనుకుంటుంది. కాల్ వస్తుందని శాలిని వెళ్లిపోతుంది. పెన్ కెమెరా తీసి మళ్లీ ట్రై చేయాలనుకుంటుంది చంద్రకళ. రాజ్‌ను శ్రుతి కలుస్తుంది. తన తల్లి కొట్టింది చెబుతుంది శ్రుతి.

మరోవైపు పెన్ కెమెరా ముందు శాలిని తల్లి గురించి తప్పుగా మాట్లాడి రెచ్చగొడుతుంది చంద్రకళ. దాంతో అంతా తానే చేస్తున్నట్లు ఒప్పుకుంటుంది శాలిని. అదంతా రికార్డ్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More