నిన్ను కోరి ప్రోమో: క్రాంతికి నిజం చెప్పేసిన లేడి డాక్టర్- శాలిని ప్రెగ్నెన్సీ నాటకం బయటపెట్టించిన విరాట్, చంద్రకళ
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో డాక్టర్ కోట్ వేసుకున్న రఘురాం పేషంట్‌కు ట్రీట్‌మెంట్ చేస్తాడు. లేడి డాక్టర్‌ను బెదిరించి క్రాంతితో నిజం చెప్పించేందుకు ఒప్పిస్తారు చంద్రకళ, విరాట్. క్రాంతి వచ్చి శాలినికి ఏమైందని అడిగితే.. తను ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్ధమని నిజం చెబుతుంది డాక్టర్.
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ సౌండ్‌తో డైవర్ట్ అయిన రఘురాం డాక్టర్ రూమ్‌లోకి వెళ్తాడు. కోట్ వేసుకుని డాక్టర్ చైర్‌లో కూర్చుంటాడు. ఇంతలో ఒక పేషంట్ కడుపు నొప్పి డాక్టర్ అంటూ వస్తాడు. అది విని నేను ఇక్కడ డాక్టర్‌నా. నాకు ఈ విషయం తెలియదే అనుకుంటాడు రఘురాం.

డ్రామా డాక్టర్ దగ్గరికి
పేషంట్ నొప్పితో అవస్థలు పడటంతో రఘురామే డాక్టర్ అనుకుని ట్రీట్‌మెంట్ ఇస్తాడు. మరోవైపు శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా ఆడిన డాక్టర్ కోసం విరాట్, చంద్రకళ బయట ఎదురుచూస్తుంటారు. పేషంట్ వెళ్లగానే లోపలికి వెళ్తారు. ఏం కావాలి, ఏంటీ సమస్య అని లేడి డాక్టర్ అడుగుతుంది.
మీరే సమస్య, వల్లే పెద్ద సమస్య ఏర్పడింది, మీరే సరిచేయాలని చంద్రకళ అంటుంది. దాంతో డాక్టర్ కోప్పడుతుంది. ఏంటీ మీరు మాట్లాడేది. నేను సమస్య ఏంటీ. అసలు ఎవరు మీరు అని అరుస్తుంది డాక్టర్. అరవకండి డాక్టర్. అన్ని నిజాలు బయటపెడతాం అని చంద్రకళ అంటుంది.
మీరు నా తోడి కోడలు కలిసి ప్రెగ్నెన్సీ, అబార్షన్ నాటకం ఆడారు కదా. శాలినికి అసలు ప్రెగ్నెన్సీనే కన్ఫర్మ్ కాలేదు. అలాంటి మీరు ప్రెగ్నెంట్ అయినట్లు, అబార్షన్ అయినట్లు నాటకం ఆడారు. అదంతా అబద్ధం అని మావాళ్లతో చెప్పాలి అని చంద్రకళ, విరాట్ అంటారు.
డాక్టర్ పీక మీద
వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటూ మరింత రెచ్చిపోతుంది లేడి డాక్టర్. దాంతో పక్కనున్న ఆపరేషన్ సిసర్స్ తీసుకుని డాక్టర్ పీక మీద పెడుతుంది చంద్రకళ. అసలు నిజం చెప్పకుంటా ఈ కత్తెర మీ గొంతులోకి దిగబడుతుంది. నిజం ఒప్పుకుంటారా లేదా అని డాక్టర్‌ను కోపంగా బెదిరిస్తుంది చంద్రకళ.
దాంతో భయపడిపోయిన లేడి డాక్టర్ నిజం ఒప్పుకుంటాను.. ఒప్పుకుంటాను అని చెబుతుంది. మీరు చెప్పేదే నిజం అని అంటుంది ఆ లేడి డాక్టర్. దాంతో ఆ విషయం మా ముందు కాదు క్రాంతి ముందు చెప్పాలి అని విరాట్ అంటాడు. దానికి సరే అని లేడి డాక్టర్ అంటుంది. ఇక క్రాంతిని తీసుకురావాలని విరాట్, చంద్రకళ అంటారు.
అతను ఇప్పుడు ఎలా వస్తాడని డాక్టర్ అంటే.. అది కూడా మీరే చేయాలి అని విరాట్ అంటాడు. అర్థం కాలేదని లేడి డాక్టర్ అంటే.. అది నేను చెబుతానుగా అని చంద్రకళ అంటుంది. క్రాంతికి కాల్ చేసి శాలినికి సమస్య ఉందని, మీరు త్వరగా రావాలని, మీతో మాట్లాడాలని చెప్పండి. దాంతో క్రాంతి కచ్చితంగా వస్తాడు అని చంద్రకళ అంటుంది.
శాలినికి ఏమైనా సమస్యా
చంద్రకళ చెప్పిటన్లుగానే క్రాంతికి కాల్ చేసి రమ్మంటుంది లేడి డాక్టర్. డాక్టర్ చెప్పడంతో క్రాంతి భయంతో హుటాహుటిన హాస్పిటల్‌కు వస్తాడు. వచ్చి కాల్ చేసిన డాక్టర్‌ను కలుస్తాడు క్రాంతి. వెంటనే క్యాబిన్‌లోకి వెళ్లి ఏమైంది డాక్టర్. శాలినికి ఏమైంది. ఎందుకు డైరెక్ట్‌గా మాట్లాడాలన్నారు. తనకేమైనా ప్రాబ్లమ్ ఉందా అని క్రాంతి భయంగా అడుగుతాడు.
అప్పుడే లోపలకి, విరాట్ చంద్ర రావడంతో విసుక్కుంటాడు క్రాంతి. మిమ్మల్ని కాదురా విసుక్కోవడం, నిజం తెలిస్తే ఎవరిని ఏం అనాలో నీకే తెలుస్తుంది అని విరాట్ అంటాడు. నాకు నీతో వాదించే టైమ్ లేదు. డాక్టర్ మీరు చెప్పండి. ఎందుకు రమ్మన్నారు అని క్రాంతి అంటాడు.
చెప్పండి డాక్టర్. మా ముందు చెప్పిన నిజాన్ని క్రాంతికి కూడా చెప్పండి అని చంద్రకళ అంటుంది. ఏంటా నిజం డాక్టర్. ఏమైందో చెప్పండి అని క్రాంతి డాక్టర్‌ను నిలదీస్తాడు. శాలిని నెలతప్పడం, అబార్షన్ జరగడం అంతా అబద్ధం అని భయపడుతూ లేడి డాక్టర్ చెబుతుంది.
నిజం చెప్పించగలిగాం
దానికి క్రాంతి తెగ షాక్ అయి బిత్తరపోతాడు. డాక్టర్‌తో నిజం చెప్పించగలిగామని విరాట్, చంద్రకళ సంతోషిస్తారు. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

E-Paper












