గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా ఆదర్శ దంపతుల పోటీ.. పెద్ద ఆపదలో మనోజ్.. జ్యోతిష్యుడి పరిహారం

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (డిసెంబర్ 19) ఎపిసోడ్ లో లెటర్ గురించి ఆందోళన పడుతూ జ్యోతిష్యుడి దగ్గరికి మనోజ్ వెళ్లడం, అతనికి పెద్ద ఆపద పొంచి ఉందని అతడు చెప్పడం చూడొచ్చు. అటు బాలు, మీనా ఆదర్శ దంపతుల పోటీకి సిద్ధమవుతుంటారు.

Dec 19, 2025, 07:11:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 579వ ఎపిసోడ్ మొత్తం బాలు, మీనా, మనోజ్ చుట్టే తిరుగుతుంది. తమ కొత్త కారును బాలు, మీనా.. రాజేష్ కు రెంట్ కు ఇవ్వగా.. అటు మనోజ్ తనకు వచ్చిన లేఖ చూసి భయపడుతూ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా ఆదర్శ దంపతుల పోటీ.. పెద్ద ఆపదలో మనోజ్.. జ్యోతిష్యుడి పరిహారం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనా ఆదర్శ దంపతుల పోటీ.. పెద్ద ఆపదలో మనోజ్.. జ్యోతిష్యుడి పరిహారం

మౌనిక గురించి చెప్పి ఏడ్చిన బాలు.. ఓదార్చిన మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 19) ఎపిసోడ్ మౌనిక గురించి మీనాకు చెబుతూ బాలు ఏడ్చే సీన్ తో మొదలైంది. అసలు మౌనిక అలా ఎందుకు చేసింది.. ఆ రోజు జరిగినదాన్ని మనసులో పెట్టుకొని అలా చేసిందా అని బాలు బాధపడతాడు. మీనా అతన్ని ఓదారుస్తుంది. ఫంక్షన్ హడావిడిలో ఉండి సంజూ పక్కనే ఉండటం వల్ల అలా చేసి ఉండొచ్చు.. తర్వాత ఆమెనే ఫోన్ చేస్తుంది.. అతిగా ఆలోచించొద్దని ఓదారుస్తుంది.

అటు మౌనికతో మెల్లగా తన భార్య ఎలా ఉండాలో అలా మారుతున్నావని సంజూ అంటాడు. బాలుతో నువ్వు ఎలా ప్రవర్తించావో చూశానని, అలాగే ఉండమని అంటాడు. అప్పుడే మీనా ఫోన్ చేస్తుంది. కానీ మౌనిక కట్ చేస్తుంది. అది చూసి సంజూ మరింత మురిసిపోతాడు. అటు మీనా ఆందోళన చెందుతుంది.

లెటర్ గురించే ఆలోచిస్తూ మనోజ్ ఆందోళన.. ప్రభావతికి ఫోన్

ఇటు ఇంట్లో మనోజ్ తనకు వచ్చిన లెటర్ గురించే ఆలోచిస్తూ రాత్రి నిద్ర కూడా పోడు. ఎవరి వల్ల సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తూ.. రోహిణినీ అనుమానిస్తాడు. తర్వాత తల్లి ప్రభావతికి ఫోన్ చేసి పెరట్లోకి రమ్మంటాడు. ఆమె మరే ఉపద్రవం తెచ్చాడో అనుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ లెటర్ గురించి చెబుతాడు.

అయినా తల్లిని అని కూడా చూడకుండా అన్ని మాటలు అన్న తర్వాత నిన్ను ఎందుకు పట్టించుకోవాలి.. నిన్ను నేను నమ్మను.. ఆ బాలుగాడిని అయినా నమ్ముతాను కానీ నిన్ను నమ్మను అని మరోసారి మనోజ్ ను ప్రభావతి కొడుతుంది. తల్లి కూడా నమ్మకపోవడంతో మనోజ్ బాధపడుతూ వెళ్లిపోతాడు.

రాజేష్‌కు బాలు కారు రెంట్.. మనోజ్‌కు కడిగి పారేసిన మీనా

ఇటు బాలు తాను కొత్తగా కొన్న కారును తన ఫ్రెండ్ రాజేష్ కు రెంట్ కు ఇస్తాడు. సత్యం చేతుల మీదుగా తాళాలు అందుకొని తన ఆశీర్వదించమని రాజేష్ కోరతాడు. బాలు పెద్ద బిజినెస్‌మ్యాన్ కావాలని రాజేష్ అనడంతో ఎవడు పడితే వాడు కాలేడు.. దానికో స్టేటస్ ఉండాలని మనోజ్ అంటాడు.

దీంతో మీనా అతన్ని కడిగి పారేస్తుంది. షాపులో మోసపోవాలి.. దాని కోసం నా నగలు అమ్ముకోవాలి.. బిజినెస్‌మ్యాన్ అంటే ఇలాంటి స్టేటస్‌లే ఉండాలని మీనా దెప్పిపొడుస్తుంది. తన భర్తను ఎందుకు అంటున్నావని రోహిణి అంటే.. ఇక నుంచి తన భర్తను ఎవరు తక్కువ చేసినా ఇలాగే ఉంటుందని మీనా స్పష్టం చేస్తుంది.

దీంతో ప్రభావతి జోక్యం చేసుకొని బాలు, మీనాలను అవమానించేలా మాట్లాడుతుంది. మీనా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చి.. మా ఆయన ఎన్ని కార్లు కొంటాడో చూడండి అని మరో శపథం చేయబోతుండగా.. బాలు అడ్డుకుంటాడు. ఇప్పటికే రెండు ఉన్నాయి.. అవి పూర్తయిన తర్వాత చేద్దువుగానీ అంటాడు. సత్యం మరోసారి ప్రభావతిని తిట్టి వెళ్లిపోతాడు.

పార్క్ ఫ్రెండ్‌తో కలిసి జ్యోతిష్యుడి దగ్గరికి మనోజ్..

ఇటు మనోజ్ కు ఏం చేయాలో తోచక తన పార్క్ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు. అతనికి కూడా ఆ లెటర్ విషయం చెబితే.. నీ వల్లే మరొకరికి సమస్య కదా అని అతడూ ఎగతాళి చేస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అతడు మనోజ్ ను చూసి త్వరలోనే నీకు పెద్ద ఆపద రాబోతోందని అనడంతో మనోజ్ మరింత టెన్షన్ పడతాడు. దానికి పరిహారంగా రోజుకో రంగు బట్టలు వేసుకోమంటాడు.

మరోవైపు ఇంట్లో రవి తమ రెస్టారెంట్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషిన్ నిర్వహిస్తున్నారని, గెలిచిన వారికి రూ.లక్ష ఇస్తారని చెబుతాడు. దీంతో మనోజ్, రోహిణి, ప్రభావతి ఆ డబ్బుకు ఆశపడతారు. బాలు, మీనా కూడా ఈ పోటీకి సిద్ధమవుతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More