గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కొత్త కారుతో సత్యం, ప్రభావతిలను కలిపిన బాలు.. మనోజ్‌కు అజ్ఞాత వ్యక్తి లేఖ
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ లో సత్యం, ప్రభావతిలను కలపడానికి బాలు, మీనా తమ కొత్త కారునే వాడుకుంటారు. అటు మనోజ్ ను ప్రభావతి చెడామడా తిడుతుంది. చివరికి మనోజ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ వస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 576వ ఎపిసోడ్ లో మొత్తానికి తల్లిదండ్రులను కలపడంలో బాలు సక్సెస్ అవుతాడు. ఇంట్లో అందరినీ కలపడానికి సుశీల వేసిన ప్లాన్ మొత్తానికి వర్కౌటవుతుంది. అయితే చివర్లో మనోజ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాయడం ఈ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలచింది.

ప్రభావతి కంటతడి.. మనోజ్‌కు క్లాస్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ మనోజ్ కు ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. నేను సంపాదించే డబ్బుతో కూర్చొని తిందామనుకుంటున్నావా అని తల్లిని మనోజ్ అనడంతో ఆమె ఒక్కసారి కంటతడి పెడుతూ ఆవేశ పడుతుంది.
బాలును సవతి తల్లిలాగా చూస్తూ ప్రేమంతా నీ ఒక్కడికే పంచినందుకు తనకు తగిన శాస్తే తగిలిందని అంటుంది. ఒక్కదానొక్క ఆడ పిల్లకు కూడా ఏమీ ఇవ్వకుండా పంపించి అంతా నీకే ఇచ్చినందుకు, లక్షలు తెచ్చి ఇచ్చినందుకు తనకు ఇలా జరగాల్సిందే అని ప్రభావతి బాధపడుతుంది. చివరికి రోహిణి కూడా మనోజ్ ను అసహ్యించుకుంటుంది. తానే తల్లిని అయి ఉంటే పళ్లు రాలగొట్టేదాన్నని చెప్పి వెళ్లిపోతుంది.
ప్రభావతికి క్లాస్ పీకిన సుశీల.. ఎవరి వంట వాళ్లే చేసుకోవాలంటూ..
ఇక ఉదయాన్నే అందరూ వచ్చి తమకు టిఫిన్ పెట్టాలని మీనాను అడుగుతారు. దీంతో సుశీల అందరిపై మండిపడుతుంది. ఈ ఇంట్లో ఇంకా ఎవరూ ఆడవాళ్లు లేరా.. అందరూ మీనాపై పడతారేంటి అని అంటుంది. ఇక నుంచి ఎవరి పెళ్లాలు వాళ్ల మొగుళ్లకు వంట చేసి పెట్టాలని షరతు పెడుతుంది.
పెళ్లాల కోసం మొగుళ్లు వంట చేయాలని చెబుతుంది. తనకు దోశలు వేయడం రాదని శృతి అంటే.. నీ మొగుడు వంటోడే కదా.. నేర్పిస్తాడులే అని అంటుంది. సత్యం, ప్రభావతి సహా అందరూ వంటింట్లోకి వెళ్లి ఎవరి దోశలు వాళ్లే వేసుకోవాలని సుశీల ఆర్డర్ వేస్తుంది.
ఎవరి దోశలు వాళ్లే వేసుకొని.. ఒకరికొకరు తినిపించుకుంటూ..
మొదట ప్రభావతి, సత్యం వంటింట్లోకి వెళ్లి దోశలు వేస్తారు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటంతో సుశీల వెళ్లి పని మొదలుపెట్టమంటుంది. వాళ్లు ఎలా వేస్తారో అని కొడుకులు, కోడళ్లు వచ్చి చూస్తుంటారు. చివరికి ఒకరి కోసం మరొకరు దోశలు వేసుకుంటారు.
ఆ తర్వాత మనోజ్, రోహిణి.. రవి, శృతి.. చివరికి బాలు, మీనా కూడా ఒకరి కోసం మరొకరు దోశలు వేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి తింటుండగా.. ఇలా కాదని ఒకరికి మరొకరు తినిపించుకోవాలని సుశీల చెబుతుంది. అందరూ సరే అంటే.. సత్యం మాత్రం ప్రభావతికి తినిపించబోయి తానే తినేస్తాడు.
దీంతో వీళ్లు ఇలా కలిసేలా లేరని, గుడికి తీసుకెళ్లాలని బాలుతో చెబుతుంది సుశీల. అతడు సరే అంటాడు. కాసేపటికి తాను కొత్త కారు కొనడానికి వెళ్తున్నానని మీనాతో బాలు చెబుతాడు. ఆ కారు తెచ్చిన తర్వాత అత్తయ్య, మామయ్యలను గుడికి తీసుకెళ్దామని మీనా అంటుంది. బాలు సరే అంటాడు.
మనోజ్‌కు అజ్ఞాత వ్యక్తి లేఖ
ఇటు షాపు పూజ చేస్తూ దేవుడికి మొర పెట్టుకుంటాడు మనోజ్. ఇన్ని డిగ్రీలు చదివాను.. బిజినెస్ పెట్టుకొని బాగా సంపాదించుకుందామంటే అన్నీ అప్పులూ తిప్పలే ఎందుకు స్వామి.. తనను ఆదుకోమని దేవుడిని అడుగుతాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మనోజ్ ను పిలుస్తాడు. అతడు మనోజ్ చేతిలో ఓ లెటర్ పెట్టి వెళ్లిపోతాడు. అందులో నీ చుట్టూ ఉన్న వాళ్లతోనే నీకు సమస్యలు వస్తున్నాయి జాగ్రత్త అని రాసి ఉంటుంది. అది చూసి మనోజ్ షాక్ తింటాడు. అది ఎవరు రాశారా అని ఆలోచిస్తుండగా.. రోహిణి, విద్య అక్కడికి వస్తారు. వాళ్లూ మనోజ్ చేతిలో లేఖ చదవి ఆశ్చర్యపోతారు.
ఇటు బాలు కొత్త కారు ఇంటికి తీసుకొస్తాడు. దానిని చూసి అందరూ సంతోషిస్తారు. అందులో సత్యం, ప్రభావతిలను గుడికి తీసుకెళ్లాలని సుశీల చెప్పడంతో బాలు తీసుకెళ్తాడు. అయితే దారిలో కావాలని కారును అడ్డదిడ్డంగా నడుపుతూ వెనుకాల ఉన్న సత్యం, ప్రభావతిలను ఒకరిపై మరొకరు పడేలా చేస్తాడు. చివరికి తన చేతిలో చేయి వేసి కూర్చోవాలని ప్రభావతికి సత్యం చెబుతాడు. ఈ క్రమంలో సత్యం మెడకు ప్రభావతి స్టిక్కర్ అంటుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీరు గుడికి వెళ్లారా పార్కుకు వెళ్లారా అని సుశీల వాళ్లను ఆటపట్టిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


