గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుని మెడ పట్టి బయటకు గెంటేయించిన మౌనిక.. అతడెవరో తెలియదంటూ.. మురిసిపోయిన సంజూ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్ లో సత్యం, ప్రభావతి కలిసిపోయారనేలోగా.. ఆ ఇంటికి మరో సమస్య వస్తుంది. బాలుని ఎవరో తెలియదంటూ మెడపట్టి బయటకు పంపించేలా చేస్తుంది మౌనిక.

Dec 17, 2025, 07:10:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 577వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి, సత్యంలను కలపాలన్న సుశీల, బాలు ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ ఇద్దరూ బాగా కలిసిపోతారు. అయితే చివర్లో బాలు ఎవరో తెలియదంటూ చెల్లి మౌనిక అతన్ని మెడపట్టి బయటకు గెంటేయించడంతో బాలు షాక్ తింటాడు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుని మెడ పట్టి బయటకు గెంటేయించిన మౌనిక.. అతడెవరో తెలియదంటూ.. మురిసిపోయిన సంజూ
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుని మెడ పట్టి బయటకు గెంటేయించిన మౌనిక.. అతడెవరో తెలియదంటూ.. మురిసిపోయిన సంజూ

ఆ లెటర్‌పై మనోజ్ టెన్షన్.. రోహిణిలోనూ అనుమానం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్ మనోజ్ తనకు అందిన లెటర్ గురించి టెన్షన్ పడుతున్న సీన్ తో మొదలవుతుంది. అసలు ఈ పనిని ఎవరు చేశారా అని ఆలోచిస్తుంటాడు. బాలు, మీనానా లేక ఇంకా ఎవరైనా చేశారా అంటూ.. రోహిణి వెంట వచ్చిన విద్యను కూడా అతడు అనుమానిస్తాడు. అటు మనోజ్ ను టెన్షన్ పడొద్దని చెప్పి విద్యతో కలిసి పక్కకు వెళ్లిన రోహిణి కూడా లెటర్ పై ఆందోళన చెందుతుంది. దినేష్ ఏమైనా చేశాడా అని విద్యతో అంటుంది.

రెండో పెళ్లాన్ని తీసుకొచ్చిన బాలు

ఇటు ఇంటికి రెండో పెళ్లాన్ని తీసుకొచ్చానంటూ బయట నుంచి మీనాకు ఫోన్ చేసి చెబుతాడు బాలు. రెండో కారు అని ఆమె అర్థం చేసుకుంటుంది. ఇంట్లో వాళ్లందరికీ రెండో కారు విషయం చెప్పి బయటకు తీసుకెళ్తుంది. అందరూ కారు చూసి మురిసిపోతుంటారు. కానీ ప్రభావతి మాత్రం రోహిణి ఇచ్చిన డబ్బుతోనే కదా అంటుంది. నువ్వు, మనోజ్ మింగిన డబ్బే కదా అని రవి అంటాడు. దీంతో ప్రభావతి అతన్ని మందలిస్తుంది. తర్వాత మీనా కారుకు హారతి ఇచ్చి, పూజ చేస్తుంది. కారులో అమ్మానాన్నలను గుడికి తీసుకెళ్లమని సుశీల చెబుతుంది.

కారులో ఒక్కటైన సత్యం, ప్రభావతి

సరే అంటూ బాలు, మీనాతోపాటు సత్యం, సుశీల గుడికి బయలుదేరుతారు. కారులోనూ వాళ్లు మాట్లాడుకోకపోవడంతో బాలు ఓ ప్లాన్ వేస్తాడు. రోడ్డు బాలేదంటూ కారును కావాలని అటూఇటూ తిప్పుతూ ఒకరిపై మరొకరు పడిపోయేలా చేస్తాడు. ఇలా అయితే మేం నడుచుకుంటూ వెళ్తామని ప్రభావతి అంటుంది. నువ్వు నా చేయి పట్టుకొని కూర్చో అంటూ సత్యం ఆమెకు చెబుతాడు. ఆమె భర్త చేయి పట్టుకొని మురిసిపోతూ కూర్చొంటుంది. ఇద్దరూ ఒక్కటవడంతో బాలు, మీనా సంతోషిస్తారు.

రవి సిగ్గు బిళ్ల ఫొటో శృతికి చూపించిన సుశీల

ఇటు ఇంట్లో శృతి.. సుశీలకు ఆమె బర్త్ డే ఫొటోలు చూపిస్తుంటుంది. బాలు మీకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని అంటుంది. మీ బాయ్‌ఫ్రెండ్ గోపాల్ కూడా బాగున్నాడని శృతి అనడంతో సుశీల మురిసిపోతుంది. మీ గోపాలం ఫొటో కూడా చూపిస్తానని రవి చిన్నప్పుడు సిగ్గు బిల్లతో ఉన్న ఫొటోను శృతికి చూపిస్తుంది. అది చూసి రవిని ఆమె ఆట పట్టిస్తుంది. ఆ ఫొటో డిలీట్ చేయమని ఆమె వెంట పడతాడు. అప్పుడే బాలు, మీనా కూడా రావడంతో ఏం జరుగుతోందని వాళ్లు అడిగినా రవి చెప్పొద్దని అంటాడు.

ఒక్కటిగా తిరిగొచ్చిన సత్యం, ప్రభావతి.. ఆట పట్టించిన మీనా

ఆ వెంటే సత్యం, ప్రభావతి కూడా నవ్వుతూ ఇంటికి రావడం చూసి సుశీల, రవి, శృతి ఆశ్చర్యపోతారు. ఇందుకేనా మమ్మల్ని వెళ్లొద్దన్నది అని సుశీలతో రవి అంటాడు. ఇద్దరూ కలిసిపోయారా అని అడిగితే.. ఆ మనోజ్ గాడి వల్లే ఇదంతా జరిగిందని ప్రభావతి అంటుంది. పిల్లలను ప్రేమించడమే కాదు.. వాళ్లు తప్పు చేస్తే మందలించడం కూడా అవసరమనే తాను చెబుతున్నానని సత్యం అంటాడు. ఆ తర్వాత సత్యం మెడకు ప్రభావతి స్టిక్కర్ ఉండటం చూసి మీనా వాళ్లను ఆట పట్టిస్తుంది.

అంతా కలిసి ఆనందంగా ఉన్నారనుకుంటున్న సమయంలో ఎపిసోడ్ చివర్లో మౌనిక ఇచ్చిన షాక్ ఆశ్చర్యపరుస్తుంది. ఓ రైడ్ కోసం వెళ్లిన బాలుకి మౌనిక కనిపిస్తుంది. ఆమె తన పర్స్ పడేసుకొని వెళ్లడంతో అది ఇవ్వడానికి బాలు వెంట వెళ్తాడు. ఆమెతో మాట్లాడుతుండగా.. సెక్యూరిటీ వచ్చి బాలును అడ్డుకుంటాడు. తను మా చెల్లెలు అని అతడు చెప్పగా.. అతనెవరో తనకు తెలియదని ఆమె అనడంతో బాలు షాక్ తింటాడు. దీంతో సెక్యూరిటీ బాలు మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. అది చూసి సంజూ మురిసిపోతాడు అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More