గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: స్టేజ్‌పైనే అత్త పరువు తీసిన శృతి.. విరిగిన ప్రభావతి నడుము.. బాలు, మీనా రొమాన్స్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 24) ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ మొత్తం బెస్ట్ కపుల్ 2025 పోటీలో పాల్గొనడానికి వస్తుంది. అయితే స్టేజ్ పైనే అత్త పరువు తీస్తుంది శృతి. మరోవైపు బాలు, మీనా రొమాన్స్ లో మునిగి తేలుతారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 582వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సత్యం, ప్రభావతి తమ పిల్లలందరితో కలిసి బెస్ట్ కపుల్ పోటీలో పాల్గొనడానికి వెళ్తారు. అయితే అక్కడ బాలు, శృతి కలిసి ప్రభావతితోపాటు మనోజ్, రోహిణి పరువు తీస్తారు. తర్వాత ఏం జరిగిందో చూడండి.

బెస్ట్ కపుల్ పోటీకి కామాక్షి కూడా..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 24) ఎపిసోడ్ బెస్ట్ కపుల్ పోటీలకు కామాక్షి కూడా తన భర్తతో కలిసి రెడీ అయ్యి రావడంతో మొదలవుతుంది. వాళ్లను చూసి ప్రభావతి, సత్యం షాక్ తింటారు. ఒకరికి తెలియకుండా మరొకరు రావడంతో ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటారు.
ఈ పోటీల కోసం పాతిక వేలు ఖర్చు పెట్టానని కామాక్షి అంటుంది. రూ.లక్ష అనగానే ఆమె వచ్చేసిందని ప్రభావతి గురించి సత్యం అంటాడు. అందరూ కలిసి లోనికి వెళ్తారు. వాళ్లను చూసి ఎంట్రన్స్ దగ్గర ఉన్న రవి, శృతి ఆశ్చర్యపోతారు. మనోజ్, రోహిణి కూడా ఇప్పటికే వచ్చేశారని వాళ్లు చెబుతారు.
బాలు, మీనా కూడా బరిలోకి..
అందరూ వచ్చారు బాలు అన్నయ్య, మీనా వదిన కూడా వస్తే బాగుండేది అని శృతితో రవి అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బాలు రవికి ఫోన్ చేస్తాడు. ఇక్కడే ఉన్నామని, లోనికి రమ్మంటాడు. లోనికి వెళ్లిన తర్వాత అప్పటికే అక్కడ అందరూ ఉండటం చూసి బాలు షాక్ తింటాడు. లక్షావతి ఓవైపు, లక్షలు మింగినోడు మరోవైపు కూర్చోవడం బాలు, మీనా చూస్తారు. గుడికి అని చెప్పి ప్రభావతి.. షాపుకు అని చెప్పి మనోజ్ అక్కడికి రావడంతో వాళ్లను బాలు తిడతాడు. ఈవెంట్లోనూ తల్లీ కొడుకులను వదలడు.
ఈవెంట్లో అందరినీ ఏడిపించిన బాలు
ఆ తర్వాత ఈవెంట్ మొదలవుతుంది. యాంకర్ వచ్చి అందరినీ పరిచయం చేసుకోమని చెబుతుంది. మనోజ్ తన గురించి చెబుతూ తాను బిజినెస్‌మ్యాన్ అని అనడంతో మంచాలు, కుర్చీలు అమ్ముకుంటాడంటూ బాలు అతన్ని ఆట పట్టిస్తాడు. తర్వాత రోహిణి గురించి కూడా అలాగే అంటాడు.
ఇక ప్రభావతి తన గురించి చెబుతూ తాను క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నానని అంటుంది. ఈవిడ డ్రైవరు, ఆవిడ కండక్టర్ అని బాలు మరోసారి ఏడిపిస్తాడు. చివరికి యాంకర్ బాలు, మీనా దగ్గరికి వెళ్తుంది. బాలు తాను ట్యాక్సీ డ్రైవర్ అని, మీనా తాను పూల వ్యాపారం చేస్తానని చెప్పినా ఎవరూ చప్పట్లు కొట్టరు. దీంతో బాలు ఫీలవుతాడు.
స్టేజ్‌పైనే అత్త పరువు తీసిన శృతి
ఆ తర్వాత అసలు పోటీ మొదలవుతుంది. మొదటి రౌండ్లో భార్య సైతం అంటూ భర్తకు సంపాదన, టాలెంట్ లో పోటీగా ఉండే భార్యలకు కాంపిటీషిన్ నిర్వహిస్తారు. ఇందులో రోహిణి స్టేజ్ పై ఓ అబ్బాయిని అమ్మాయిగా మార్చేసేలా మేకప్ వేసి ఆకట్టుకుంటుంది.
అటు శృతి తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ అని, ఈ మధ్యే ఓ సీరియల్ కు స్క్రిప్ట్ కూడా రాస్తున్నానని అంటుంది. ఆ సీరియల్ పేరు గయ్యాలి గంగావతి అని చెప్పడంతో అందరూ ప్రభావతి గురించే అని ఫిక్సయిపోతారు. అంతేకాదు తాను మిమిక్రీ చేస్తూ అత్తా కోడళ్ల మధ్య జరిగే సంభాషణ గురించి చెబుతానని మీనా అంటుంది.
రోజూ ప్రభావతి, మీనా మధ్య జరిగే సంభాషణనే స్టేజ్ పైనా చెబుతుంది. అందరూ ఆమె మిమిక్రీని ఎంజాయ్ చేయగా.. ప్రభావతి మాత్రం ముఖం ఏదోలా పెడుతుంది.
నడుము విరగ్గొట్టుకున్న ప్రభావతి
ఈవెంట్ లో భాగంగా భర్తలు భార్యలను ఎత్తుకుంటే వాళ్లు పైనున్న పువ్వును నోటితో తీసి ఇవ్వాలని పోటీ పెడతారు. సత్యంకు అది సాధ్యం కాదని, తాను కుర్చీపై ఎక్కి చేస్తానని ప్రభావతి అంటుంది. సరే అని ఆర్గనైజర్లు అంటారు. ఆ ప్రయత్నంలోనే ప్రభావతి కింద పడి నడుము విరగ్గొట్టుకుంటుంది. మరోవైపు రోహిణిని మనోజ్, శృతిని రవి, మీనాను బాలు ఎత్తుకొని వాళ్ల నోటితో పూలు తీసే ప్రయత్నం చేస్తారు. బాలు, మీనా రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












