గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బెస్ట్ కపుల్ బాలు, మీనా.. డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపుగా ఇంటికి.. ప్రభావతి మరో రచ్చ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ లో బెస్ట్ కపుల్ పోటీలో బాలు, మీనా గెలుస్తారు. ఇంటికి డప్పులు కొట్టుకుంటూ, ఊరేగింపుగా రావడంతో ప్రభావతి షాక్ తింటుంది.

Published on: Dec 26, 2025, 07:28:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 584వ ఎపిసోడ్ కూడా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ చుట్టూ తిరిగింది. మరో మూడు రౌండ్లు నిర్వహించిన తర్వాత మీనా, బాలును బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తారు. దీంతో మనోజ్, రోహిణితోపాటు ప్రభావతి కూడా షాక్ తింటారు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బెస్ట్ కపుల్ బాలు, మీనా.. డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపుగా ఇంటికి.. ప్రభావతి మరో రచ్చ
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బెస్ట్ కపుల్ బాలు, మీనా.. డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపుగా ఇంటికి.. ప్రభావతి మరో రచ్చ

ప్రభావతిని ఏడిపించిన బాలు, కామాక్షి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ ప్రభావతి నడుము విరిగే సీన్ తో మొదలవుతుంది. అయితే స్టేజ్ పైనే రోహిణి, శృతిలతో కలిసి మీనా సెట్ చేస్తుంది. అయితే అక్కడితో ప్రభావతి పోటీ ముగుస్తుంది. దీంతో బాలు, కామాక్షి ఆమెను ఏడిపిస్తారు.

తాను గెలవకపోయినా నువ్వు ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని కామాక్షి అంటుంది. ఇక వెళ్దాం.. ముందు కిలోల లెక్కన చీరలు అమ్ముతున్నారంటా అంటూ ప్రభావతితో కామాక్షి చెబుతుంది. మీరే గెలిచి రావాలని, తాను ఇంటి దగ్గర హారతి పట్టుకొని ఉంటానని మనోజ్, రోహిణిలకు ప్రభావతి చెప్పగా.. మీరే గెలవాలంటూ బాలు, మీనాలకు సత్యం చెబుతాడు. తర్వాత ఆ రెండు జంటలు వెళ్లిపోతాయి.

స్టేజ్‌పైన జంటలు.. జీతాల గురించి ప్రశ్నలు

ఇక చివరిగా ఈ పోటీలో మూడు జంటలు మిగులుతాయి. మనోజ్, రోహిణి.. రవి, శృతి.. బాలు, మీనాలను స్టేజ్ మీదికి పిలుస్తారు. వాళ్లను భార్యాభర్తల జీతాల గురించి ప్రశ్నలు అడుగుతారు. ముందుగా రవి, శృతిని అడిగితే రవి జీతం తనకు తెలియదని, తన దాంట్లో పావు వంతు కూడా ఉండదని శృతి అంటుంది.

అటు మనోజ్ ను ఇదే ప్రశ్న అడిగితే తన సంపాదన గురించి మీకెందుకు చెబుతానంటూ అడ్డదిడ్డంగా వాదిస్తాడు. ప్రశ్న మార్చుకోమంటాడు. దీంతో రోహిణి సర్ది చెబుతుంది. చివరిగా బాలు, మీనాలను ఇదే ప్రశ్న అడిగితే.. వాళ్లు ఒకరి సంపాదన గురించి మరొకరు ఎంతో అర్థవంతంగా వివరణ ఇస్తారు. అది జడ్జీలకు బాగా నచ్చుతుంది.

రోహిణి కంటతడి.. స్టేజ్‌పై రవి, శృతి గొడవ

ఆ తర్వాత భార్యాభర్తలను స్టేజ్ మీదికి పిలిచి ఒకరి గురించి ఒకరు కళ్లలోకి చూసుకుంటూ మాట్లాడుకోవాలని చెబుతారు. మొదట రోహిణి, మనోజ్ లను పిలుస్తారు. మనోజ్ తనపై చూపిస్తున్న నమ్మకానికి ఎమోషనల్ అయిన రోహిణి కంటతడి పెడుతుంది. మనోజ్ ఆమెను ఓదారుస్తాడు.

తర్వాత రవి, శృతి వస్తారు. శృతి గురించి రవి మంచిగా చెబుతాడు. అయితే తనకు నలుగురు సంతానం కావాలని అనడంతో శృతి ఆవేశంగా అతన్ని తిడుతుంది. నన్ను అడగకుండా నలుగురు సంతానం కావాలని నువ్వే ఎలా డిసైడ్ చేస్తావంటుంది. ఇద్దరూ మాటామాటా అనుకొని వెళ్లిపోతారు.

బాలు, మీనా ఒకే సమాధానాలు

చివరిగా బాలు, మీనాలను పిలుస్తారు. వాళ్లు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు. ఏమీ మాట్లాడుకోరు. తాము ఇలాగే మాట్లాడుకుంటామని అంటారు. తమకు అర్థం కావాలంటే ఇలా కుదరదు అంటూ నిర్వాహకులు వాళ్లకు ఒకే ప్రశ్నలు అడిగి, వాళ్ల సమాధానాలను బోర్డుపై రాయిస్తారు. ఇద్దరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఇద్దరూ ఒకే రకమైన సమాధానాలు రాస్తారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు.

డ్రీమ్ హౌస్ కట్టిన జంటలు

బెస్ట్ కపుల్ పోటీలో చివరి రౌండ్ గా డ్రీమ్ హౌస్ కట్టాలని చెబుతారు. వాళ్లకు ఇచ్చిన బ్లాక్స్ తో భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఇల్లు కట్టుకోవాలని అంటారు. ఇందులోనూ బాలు, మీనా అందరి కంటే ముందుగా ఓ అందమైన ఇంటికి కడతారు. గొప్పలకు పోయి మనోజ్ చతికిలపడతాడు.

ఇక అన్ని రౌండ్లలోనూ జడ్జీలను మెప్పించిన బాలు, మీనా విజేతలుగా నిలుస్తారు. వాళ్లకు రూ.లక్ష ప్రైజ్ మనీ దక్కుతుంది. దీంతో ఇద్దరూ డప్పులు, మేళ తాళాలతో ఇంటికి ఊరేగింపుగా వెళ్తారు. అది చూసి ప్రభావతి షాక్ తింటుంది. ఇంట్లో మరో రచ్చ చేయడానికి సిద్ధమవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More