గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణికి కొడుకు, షాపింగ్ మాల్‌లో అత్తకు తెలిసిన నిజం- ప్రభావతి అష్ట దరిద్రమైన కోరిక

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 30 ఎపిసోడ్‌లో కాంపిటీషన్‌లో జడ్జ్‌లు సీక్రెట్స్ గురించి ఏం చెప్పారని రోహిణి, మనోజ్ ఇద్దరిని వేరు వేరుగా ప్రభావతి అడుగుతుంది. దానికి ఇద్దరు ఏం చెప్పకుండా తప్పించుకుంటారు. షాపింగ్ మాల్‌లో రోహిణి కొడుకు చింటూకు బట్టలు కొంటుంది. అది ప్రభావతికి తెలిసి షాక్ అవుతుంది.

Published on: Dec 30, 2025, 08:48:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనాకు లక్ష రావడం చూసి ప్రభావతి వాళ్లు ఏడుస్తుంటారు. సత్యం వచ్చి బాలు, మీనాకు సపోర్ట్ చేస్తారు. వాళ్లు ఫ్రాడ్ చేసి గెలిచారని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ చేసిన మోసాల గురించి మీనా అంటుంది. లక్ష ఇస్తేనే లక్షణమైన జంట అయిపోదని ప్రభావతి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్‌

ఏదో దాస్తున్నట్లు లెక్క

వాళ్లకే సరిగా తెలియనట్లుంది. అండర్‌స్టాండింగ్ అంటే మాది. మేము ఎప్పుడైన గొడవ పడ్డామా అని మనోజ్ అంటాడు. నువ్వు ఏం చేసిన పార్లరమ్మా భరిస్తుంది. ఇంకెలా గొడవ అవుతుందిరా. అయినా మీరిద్దరు కేడీగాళ్లను మార్కులు వేసేవాళ్లే చెప్పారు. చిన్న చిన్న తగాదాలు రావట్లేదంటే భార్యాభర్తలు ఏదో దాస్తున్నారట. అది బయటపడితే ఎప్పటికీ క్షమించుకోలేరట. వాళ్లు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాన్న అని బాలు అంటాడు.

దాంతో రోహిణి వంటింట్లోకి వెళ్లి నీళ్లు తాగుతుంది. వెంటే వెళ్లిన ప్రభావతి జడ్జ్‌లు ఏమన్నారో అడుగుతుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు లేవంటే దాపరికాలు ఉన్నట్టా. సీక్రెట్స్ ఉన్నట్టా. ఒకరినొకరు మోసం చేసుకున్నట్టా అని ప్రభావతి నిలదీస్తుంది. ఇన్నాళ్లు మావయ్యతో కాపురం చేసిన మీకే తెలియాలి అత్తయ్య. వాళ్లు ఇంగ్లీషులో అడిగింది వాళ్లుకు ఏం అర్థమైందో. నాకు టైడ్‌గా ఉంది అని తప్పించుకుంటుంది రోహిణి.

చెక్ పట్టుకుని సత్యంతో బాలు ఫొటో దిగుతాడు. బ్యాంక్‌లో డబ్బు పడగానే నీకే ఇస్తాను నాన్న అని బాలు అంటాడు. నాకు ఈ ప్రేమ చాలు అని సత్యం అంటాడు. ఈ డబ్బు మేము ఏం చేసుకుంటాం అని మీనా అంటే.. ఆ లక్షతో ఇల్లు కట్టుకోమ్మని సత్యం చెబుతాడు. ఇదేదో బాగుందే బాలు అంటాడు. లక్షతో ఇల్లు కడతాడట అని ప్రభావతి అంటే.. బాలు చేసిన మంచి పనులు చెప్పి ఇల్లు కట్టలేడా అంటాడు సత్యం.

అష్ట దరిద్రమైన కోరిక

మనోజ్ చేసిన తప్పులు చెప్పి వాడు నిన్ను విమానంలో తిప్పుతాడని కలలు కనడం కంటే అష్ట దరిద్రమైన కోరిక ఉంటుందా అని తిట్టి వెళ్లిపోతాడు సత్యం. ఇంతలో మనోజ్ వచ్చి నేను చెప్పిన సమాధానాలు వాళ్లకు అర్థం కాలేదు అని అంటాడు. అది కాదు. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉంటే గొడవలు రావన్నార. మీ మధ్య రహస్యాలు ఉన్నాయా. రోహిణి దగ్గర ఏదైనా రహస్యం దాస్తున్నావా అని నిలదీస్తుంది ప్రభావతి.

వామ్మో బాలు గాడి లాగే అడుగుతున్నావమ్మా. అసలు రహస్యం అనగానేమి అని తప్పించుకుంటాడు మనోజ్. ఎవరు ఎవరి దగ్గర రహస్యం దాస్తున్నారు. అది ఏమై ఉంటుంది అని డౌట్ పడుతుంది ప్రభావతి. తర్వాత లక్ష కోల్పోవడం గురించి రోహిణి బాధపడుతుంటే మనోజ్ ఓదారుస్తాడు. ఎవరి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మనదే బెస్ట్ కపుల్ అని మనోజ్ అంటాడు.

జడ్జ్‌లు చెప్పిన గొడవలు, సీక్రెట్స్ గురించి మనోజ్ అడుగుతాడు. నేను చిన్న తప్పులు చేసి దొరికిపోతుంటాను. కానీ, నువ్వు తప్పు చేసినట్లు మాత్రం ఎప్పుడు రాలేదు. వాళ్లు అన్నారు నువ్వు కచ్చితంగా ఏదో దాస్తున్నావని. అందుకే అడుగుతున్నా అని మనోజ్ అంటాడు. వాళ్లు అంటే మాత్రం నీకు అనిపిస్తుందా నేను దాస్తున్నా అని రోహిణి అంటుంది.

రోహిణికి కొడుకు ఉన్నాడని

మనం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. నువ్వే నా బెస్ట్ వైఫ్. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం అని మనోజ్ ప్రేమగా అంటాడు. మరోవైపు కాంపిటీషన్ గురించి శ్రుతి, రవి గొడవ పడతారు. ఓడిపోవడానికి ఒకరినొకరు నిందించుకుంటారు. పిల్లల గురించి అందరిముందు ఎందుకు మాట్లాడావ్ అని శ్రుతి గొడవ పడుతుంది.

ఐయామ్ సారీ. నాకు పిల్లలు అస్సలు వద్దు అని రవి అంటే.. అంతా నీ ఇష్టమేనా. నాకు ఇప్పుడు పిల్లలు కావాలి అని శ్రుతి అంటుంది. దాంతో రవి షాక్ అవుతాడు. మరుసటి రోజు కొడుకుకు బట్టల కోసం షాపింగ్‌కు వెళ్తుంది రోహిణి. అక్కడికి ప్రభావతి, కామాక్షి కూడా వస్తారు. వాళ్లిద్దరికి రోహిణి ఎదురవుతుంది.

ఇంతలో పని చేసే వ్యక్తి వచ్చి మేడమ్ మీ కొడుకుకి మంచి బట్టలు తీసుకున్నారు అని అంటాడు. అది విన్న ప్రభావతి కొడుకా అని నోరెళ్లబెడుతుంది. అలా రోహిణికి కొడుకు ఉన్నాడని ప్రభావతికి తెలుస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More