నిన్ను కోరి డిసెంబర్ 22 ఎపిసోడ్: విరాట్, చంద్ర గేమ్-కొత్త దంపతుల‌తో వ్ర‌తం-చెడ‌గొట్టేందుకు కామాక్షి, శ్రుతి ప్లాన్‌

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 22 ఎపిసోడ్ లో పెళ్లి తర్వాత తంతులన్నీ జరిపించాలని సరోజా అడుగుతుంది. ముందుగా వ్రతం చేయాలని జగదీశ్వరి చెప్తుంది. ఇక చంద్రపై సీరియస్ అవుతూ విరాట్ గేమ్ కొనసాగిస్తాడు. వ్రతాన్ని ఆపేందుకు శ్రుతి, కామాక్షి ప్లాన్ చేస్తారు.

Published on: Dec 22, 2025, 07:49:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 22 ఎపిసోడ్ లో విరాట్ ముద్దు పెట్టబోతుంటే చంద్ర తోసేసి వెళ్లిపోతుంది. గదిలో కునికిపాట్లు పడుతున్న సరోజాపై రాజ్ ఫైర్ అవుతాడు. నువ్వు చెప్పిందేంటీ? చేస్తుందేంటీ? కనక మహాలక్ష్మి మన చేతికి అందాలంటే అడుగు ముందుకు వేయాల్సిందేనని తల్లిని కిందకు తీసుకొస్తాడు రాజ్.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

పెళ్లి తంతులు

శ్యామల దగ్గరకు వచ్చి పొగిడేస్తుంది సరోజా. పెళ్లి జరిగిపోయింది. ఎలా జరిగినా పెళ్లి పెళ్లే కదా. ఆ తర్వాత జరిగే తంతులన్నీ జరిపించాల్సిందే కదా అని సరోజా అంటుంది. మెల్లగా అజమాయిషీ చెలాయించి ఈ ఆస్తి దక్కించుకోవాలన్నదే కదా మీ ప్లాన్ అని శ్యామల అంటుంది. ఎప్పుడూ డబ్బు గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరే దగ్గరుండి మీ అమ్మాయి పెళ్లి జరిపించి ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు. మీకు ఆ డబ్బంతా ఆదా చేశామని సరోజా అంటుంది.

మూడు రాత్రులు

మూడు ముళ్లు పడ్డాక మూడు రాత్రుల ఏర్పాట్లు జరగాల్సిందే కదా అని సరోజా అంటుంది. మూడు రాత్రులు లేవు, ఏం లేవు లోపలికి వెళ్లండని కామాక్షి అంటుంది. మీ గురించి తెలుసుకోకుండా ఎలా జరిపిస్తామని క్రాంతి అంటాడు. అప్పుడే విరాట్ మా తమ్ముడు చెప్పేది కరెక్ట్ అంటూ డ్రామా స్టార్ట్ చేస్తాడు. మీరు మా అందరినీ చీట్ చేసి పెళ్లి చేశారని విరాట్ అంటాడు. చంద్రకళ మధ్యలో వస్తే ఎందుకు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావని విరాట్ సీరియస్ అవుతాడు.

వ్రతం జరిపించాలని

పెళ్లి ఎలా జరిగినా ఆ తర్వాత అన్నీ పద్ధతి ప్రకారం జరగాలి. ముందుగా సత్యనారాయణ వ్రతం జరిపించాలని జగదీశ్వరి చెప్తుంది. రఘురాం కూడా అదే మాట అంటాడు. జల్ రాజ్ వాళ్లు ఏం ప్లాన్ వేశారు బావ. శ్రుతి లైఫ్ బాగుండాలంటే ఆ అబ్బాయి ఆలోచన మారాలని విరాట్ తో వచ్చి చంద్ర అంటుంది. క్రాంతి నిన్ను నమ్మేవరకూ ఎన్ని బాధలైనా పడతానని చంద్ర చెప్తుంది. క్రాంతి నిన్ను నమ్మేలా చేయాలంటుంది.

శ్రుతి ప్లాన్

వాడితో కలిసి వ్రతం చేస్తే జల్ రాజ్ ను భర్తగా యాక్పెస్ట్ చేసినట్లే కదా అని తల్లి కామాక్షితో శ్రుతి అంటుంది. వదిన పద్ధతి ప్రకారం వ్రతం జరగాలంటుందని కామాక్షి ఆలోచిస్తుంది. వ్రతం ఆగిపోయేలా చేయాలి. ఆ జల రాజ్ నష్టజాతకుడని, వాడితో కలిసి కాపురం చేస్తే జీవితం లేకుండా పోతుందని వదిన నమ్మేలా చేయాలని కామాక్షి చెప్తుంది.

శ్యామలను పొగడ్తలతో బుట్టలో వేసుకోవాలని చూస్తాడు రాజ్. శ్రుతి చేయిని పట్టుకుని నడవమని శ్యామల చెప్తుంది. అది చూసి నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావా? అని శ్యామలను అడుగుతుంది కామాక్షి. పెళ్లి గురించి బాధ పడొద్దని శ్యామల చెప్తుంది. కింద అలంకరణ చేస్తున్న చంద్రపైకి పువ్వు విసురుతాడు విరాట్. అది వెళ్లి సరోజాకు తగులుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More