నిన్ను కోరి డిసెంబర్ 13 ఎపిసోడ్: శాలినికి శిక్ష- శ్రుతికి 2 లక్షలు ఇచ్చిన చంద్రకళ- పెళ్లి కూతురిలా శ్రుతి, తల్లి దిష్టి
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో శాలిని చేసిన తప్పుకు శిక్ష పడిందని రఘురాం చెబుతాడు. చంద్రకళ అడిగిన రెండు లక్షలను విరాట్ ఇస్తాడు. ఆ డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయమని శ్రుతికే ఇస్తుంది చంద్రకళ. అవి తీసుకుని పెళ్లి కూతురిలా ముస్తాబై వెళ్తుంది శ్రుతి. అది చూసి తల్లి దిష్టి చుక్క పెడుతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి రెండు లక్షలు అడిగితే శాలిని ఇవ్వదు. ఇరిటేషన్‌గా కూర్చున్న శ్రుతి దగ్గరికి కామాక్షి వచ్చి అడుగుతుంది. దాంతో కామాక్షిపై ఫ్రస్టేట్ అవుతుంది శ్రుతి. అదంతా చూస్తూ మెట్లపై నుంచి శాలిని వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీకి కాలు తగిలి అరుస్తుంది శాలిని. అక్కడే ఉన్న కామాక్షి వచ్చి పట్టుకోబోతుంది.

శాలినికి శిక్ష
కానీ, కామాక్షి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ శాలినిపై కాళ్లపై పడుతుంది. దాంతో మరింత అరుస్తుంది శాలిని. చిటికెన వేలి మీద పడిందని శాలిని నొప్పితో బాధపడుతుంది. క్రాంతి వచ్చి ఐస్ పెడతాడు. గతంలో పెద్ద తప్పులు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. నేను ఏం చేశానో నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు. నువ్వు కూడా ఏదో పెద్ద తప్పు చేశావ్. అందుకే దేవుడు ఈ శిక్ష వేశాడు. ఇది దేవుడు ఇచ్చే వార్నింగ్. ఇంకోసారి తప్పు చేయకు అని రఘురాం అంటాడు.
శాలిని ఏం తప్పు చేసింది నాన్న అని క్రాంతి అడుగుతాడు. చేశాను గతంలో చాలాసార్లు మూర్ఖంగా ప్రవర్తంచి నిన్ను బాధపెట్టాను. అందుకే అయ్యుంటుంది అని శాలిని బాగా కవర్ చేసుకుంటుంది. అయిండొచ్చు అని రఘురాం అంటాడు. తర్వాత శ్యామల దగ్గరికి వెళ్లిన శ్రుతి ప్రేమగా మాట్లాడి బిజినెస్ గురించి చెబుతుంది. చైన్ బిజినెస్ గురించి చెప్పి రెండు లక్షలు అడుగుతుంది.
ఇలాంటి చైన్ బిజినెస్‌లు వర్కౌట్ కావని, అలాంటివి వద్దని శ్యామల చెప్పి పంపిస్తుంది. తర్వాత తన ఫ్రెండ్ మౌనికకు కాల్ చేసి రాజ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు, మా అమ్మకు తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లికి రెండు లక్షలు కావాలి, ఇవ్వవే అని శ్రుతి అడుగుతుంది. తనేం చేయలేనని మౌనిక చెబుతుంది. మరోవైపు చంద్రకళను వెనుక నుంచి పట్టుకుంటాడు విరాట్.
చంద్రకళకు రెండు లక్షలు
మీ చిలిపి పనులు మొదలుపెట్టారా అని చంద్రకళ అంటుంది. ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. చంద్రకళ అడిగిన రెండు లక్షలు విరాట్ తీసుకొస్తాడు. ఇవ్వకుండా కాసేపు ఆటాడుకుంటాడు. ముద్దు ఇవ్వమంటాడు. నేను వేరే చోట డబ్బులు ట్రై చేసుకుంటా అని చంద్రకళ అనేసరికి విరాట్ ఇస్తాడు. అంతలోనే చంద్రకు ముద్దు పెడతాడు విరాట్.
డబ్బు పక్కన పెట్టి విరాట్‌తో సరదాగా గొడవ పడుతుంది చంద్రకళ. ఇక నాకు చంద్రకళే దిక్కు అని అడగడానికి వెళ్తుంది శ్రుతి. చంద్ర, విరాట్ రొమాన్స్ చూసి తిరిగి వెళ్లిపోతుంది. తర్వాత పనసపొట్టు కూర వండుతావ అని చంద్రకళను రఘురాం రిక్వెస్టింగ్‌గా అడుగుతాడు. చేస్తానని చంద్రకళ ఒప్పుకుంటుంది.
వంట చేస్తానని ఒప్పుకున్న కానీ ఆఫీస్‌లు అర్జంట్‌గా డబ్బు అవసరం ఉంది. ఏం చేయాలని చంద్రకళ ఆలోచిస్తుంది. మరోవైపు డబ్బు గురించి ఆలోచిస్తూ శ్రుతి వస్తుంది. ఒకరినొకరు అడగాలని అనుకుంటారు. శ్రుతికి రెండు లక్షల డబ్బు ఇచ్చి ఆఫీస్‌లో అవసరం ఉంది. బ్యాంక్‌లో డిపాజిట్ చేయమని చంద్రకళ చెబుతుంది. అదంతా శాలిని చూస్తుంది.
దిష్టి చుక్క పెట్టిన తల్లి
ఆఫీస్ అవసరం తర్వాత చూద్దాం. నా పెళ్లికి లోటు తీరిందని శ్రుతి అనుకుంటుంది. నీ మీద నమ్మకంతో కాదు నాకు అవసరంతో ఇచ్చాను అని చంద్రకళ అంటుంది. శ్రుతి వెళ్లిపోతుంది. ఈ పిచ్చిది పెళ్లి చేసుకునేందుకు వెళ్తుందని తెలియక దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు డబ్బు ఇచ్చింది చంద్రకళ. అనుకోకుండానే అన్ని నాకు అనుకూలంగా జరుగుతున్నాయని శాలిని అనుకుంటుంది.
మరోవైపు పెళ్లి కూతురిలా రెడీ అయి శ్రుతి కనిపిస్తుంది. కామాక్షి, శ్యామల అడిగితే.. ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నట్లు చెబుతుంది శ్రుతి. కామాక్షి దిష్టి తగులుతుందని దిష్టి చుక్క పెడుతుంది. కామాక్షి, శ్యామల ఆశీర్వాదం తీసుకుంటుంది. శ్రుతి వెళ్లిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


