నిన్ను కోరి డిసెంబర్ 9 ఎపిసోడ్: క్రాంతి రాగానే మాట మార్చిన డాక్ట‌ర్‌-శాలిని ప్రెగ్నెన్సీ నిజ‌మ‌ని విరాట్‌, చంద్ర‌కు షాక్

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 9 ఎపిసోడ్ లో క్రాంతి రాగానే డాక్టర్ మాట మారుస్తుంది. శాలిని ప్రెగ్నెన్సీ నిజమని చెప్తుంది. విరాట్, చంద్రకళ బెదిరించి అబద్దం చెప్పాలన్నారని అంటుంది. దీంతో క్రాంతి కోపంతో ఊగిపోతాడు. శాలిని ఇంట్లో గొడవ స్టార్ట్ చేస్తుంది.

Published on: Dec 9, 2025, 07:32:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 9 ఎపిసోడ్ లో క్రాంతిని హాస్పిటల్ కు రమ్మంటుంది డాక్టర్. క్రాంతి వచ్చి ఏమైందని కంగారుగా అడుగుతాడు. అక్కడ విరాట్, చంద్రకళను చూస్తాడు క్రాంతి. మేం ఏదో చేసి శాలిని ప్రెగ్నెన్సీ పోగొట్టామని అనుకుంటున్నావు. నిజం నీకు తెలిసేలా చేసేందుకు ఇక్కడికి రప్పించామని విరాట్, చంద్ర అంటారు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

డాక్టర్ డ్రామా

శాలిని ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్దం. ఇలా చెప్పాలని వీళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ శాలిని ప్రెగ్నెన్సీ 100 శాతం నిజం క్రాంతి అని డాక్టర్ చెప్పగానే విరాట్, చంద్రకళ షాక్ అవుతారు. చూశారా క్రాంతి ఎలా బెదిరిస్తున్నారో? పీక మీద కత్తి పెట్టి మీకు ఫోన్ చేయించారు. శాలిని ప్రెగ్నెన్సీ అబద్దమని చెప్పాలన్నారు. ప్రాణం పోతుందేమోనన్న భయంతో అలా చెప్పడానికి ఒప్పుకున్నా. కానీ మీరు వచ్చాకే నాకు ధైర్యం వచ్చింది. క్రాంతి గారు నన్న కాపాడండి అని డాక్టర్ నాటకం ఆడుతుంది.

క్రాంతికి కోపం

క్రాంతి డాక్టర్ చెప్తుంది అబద్దమని విరాట్ అంటాడు. ఎందుకు ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు? నీకు తన మీద కానీ నా మీద కానీ పగ ఉంటే ఒక్కసారి తీర్చుకోవచ్చు కదా అని క్రాంతి అడుగుతాడు. నువ్వు రాగానే డాక్టర్ మాట మార్చింది క్రాంతి. నువ్వు అడ్డదారుల్లో డాక్టర్ అయ్యావని డాక్టర్ పై చంద్ర సీరియస్ అవుతుంది. కానీ క్రాంతి కోపంగా వెళ్లిపోతాడు.

శాలినికి ఫోన్

శాలినికి డాక్టర్ ఫోన్ చేసి అక్కడ జరిగింది చెప్తుంది. క్రాంతికి విరాట్, చంద్ర ఎంత చెప్పినా వినడు. నేను మీ మాయలో పడను. మీ మీద పీకల దాకా కోపం ఉంది. కానీ ఏ గొడవ చేయను. నాకు నాన్నే ముఖ్యం. అందుకే గొడవ చేయనని క్రాంతి వెళ్లిపోతాడు. క్రాంతి కామ్ గా ఉండటం చూసి శాలిని చూడలేకపోతుంది. గొడవ చేయాలని ప్రయత్నిస్తుంది.

గొడవ చేయాలని

ఏం జరిగిందని శాలిని అడిగితే క్రాంతి వదిలేయమంటాడు. కానీ క్రాంతిని రెచ్చగొడుతుంది శాలిని. మా అన్నయ్య, చంద్ర కలిసి నీ ప్రెగ్నెన్సీ అబద్దమని డాక్టర్ ను బెదిరించి చెప్పాలని ప్రయత్నించారు. నన్ను కూడా కన్వీన్స్ చేయాలని చూశారని క్రాంతి చెప్తాడు. అప్పుడే ఏడుస్తూ శాలిని మళ్లీ గొడవ స్టార్ట్ చేయాలని చూస్తుంది. కానీ నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని క్రాంతి చెప్తాడు.

కానీ బయటకు వెళ్లి జగదీశ్వరి దగ్గర నాటకం ఆడుతుంది శాలిని. అత్తయ్యకు జరిగింది చెప్తుంది శాలిని. అప్పుడే కామాక్షి, శ్యామల వస్తారు. శాలిని చెప్పింది విని శ్యామల ఫుల్ ఫైర్ అవుతుంది. విరాట్, చంద్రను పిలిచి అడుగుతుంది.

శాలిని మొసలి కన్నీళ్లు కారుస్తుంది. అబద్దాన్ని నిజం చేయాలని చూస్తుంది. చచ్చిపోవాలని అనిపిస్తుంది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ చంద్రను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని కామాక్షి అంటుంది. తప్పు చేసింది చంద్ర కాదు విరాట్ అని జగదీశ్వరి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More