నిన్ను కోరి డిసెంబర్ 8 ఎపిసోడ్:శాలిని ప్రెగ్నెన్సీ నిజమని డాక్టర్ బుకాయింపు-పీక మీద క‌త్తి పెట్టిన చంద్ర‌-క్రాంతికి ఫోన్

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో డాక్టర్ తో అసలు నిజం చెప్పించాలని విరాట్, చంద్రకళ ప్రయత్నిస్తారు. కానీ శాలిని ప్రెగ్నెన్సీ నిజమని డాక్టర్ బుకాయిస్తుంది. చంద్ర కత్తి తీసుకుని డాక్టర్ పీక మీద పెడుతుంది. మరోవైపు రఘురాంను మరో డాక్టర్ పరీక్షిస్తాడు. 

Published on: Dec 8, 2025, 07:31:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈ రోజు డిసెంబర్ 8 ఎపిసోడ్ లో డాక్టర్ గా ఊహించుకున్న రఘురాం పేషెంట్లను ట్రీట్ చేస్తాడు. కడుపు నొప్పి అంటే కళ్లు చూపించమని అంటాడు రఘురాం. అజీర్తి చేసిందని, నీళ్లలో చెంచాడు వాము, జీలకర్ర వేసి బాగా మరిగించి తాగమని చెప్తాడు. తెలుగులో ప్రిస్కిప్షన్ రాస్తాడు. మరోవైపు రఘురాం కోసం జగదీశ్వరి, శ్యామల వెతుకుతారు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

బేబీ ఎవరు?

బేబీని కలవడానికి వెళ్లానని కామాక్షితో చెప్తుంది శ్రుతి. బేబీని గర్ల్ ఫ్రెండ్ అనుకోని కామాక్షి మాట్లాడుతుంది. మధ్యలో శాలిని వచ్చి పెళ్లి చేసుకుంటారని అనడంతో శ్రుతి షాక్ అవుతుంది. కానీ శాలిని మాట మారుస్తుంది. రోజు బేబీ బేబీ అని పరుగెత్తుతున్నావ్ కానీ ఒక్క సారి కూడా ఇంటికి ఎందుకు రాదు? అని కామాక్షి అడుగుతుంది. రఘురాం ఎక్కడ అని విరాట్, చంద్ర కూడా వెతుకుతారు. బెల్ మోగించిన రఘురాం మళ్లీ అంతా గుర్తుకు తెచ్చుకుంటాడు.

డాక్టర్ దగ్గరకు రఘురాం

తండ్రిని ఎలా వదిలేశాడని విరాట్ పై ఫైర్ అవుతుంది శ్యామల. డాక్టర్ వచ్చి అడిగితే రఘురాం కనిపించడం లేదని చెప్తారు. అప్పుడే రఘురాం వస్తాడు. అతణ్ని డాక్టర్ పరీక్షిస్తాడు. మీరు సరైన మందులే ఇస్తున్నారా? అని డాక్టర్ ను అడుగుతాడు రఘురాం. నిన్న ఏం జరిగిందో డాక్టర్ చెప్పమంటే.. నా మేనకోడలు శ్రుతి ఎవరి బైక్ మీదో వచ్చిందని రఘురాం చెప్తాడు. నా మెడిసిన్ పని చేస్తుందని, అలా అయితేనే శ్రుతి దగ్గర నుంచి డబ్బులు అందుతాయని డాక్టర్ అనుకుంటాడు.

డాక్టర్ షాక్

విరాట్, చంద్రకళను చూసి డాక్టర్ షాక్ అవుతుంది. మమ్మల్ని గుర్తు పట్టారా? డాక్టర్ అని విరాట్ అడుగుతాడు. శాలిని బావ, తోటి కోడలు అని అంటుంది. కనెక్షనా? లేదా కరెప్షనా? లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి ఒక మనిషికి ఫేవర్ చేశారంటే క్లోజ్ కనెక్షన్ అయినా ఉండాలి? లేదంటే డబ్బుల కోసం ఏదైనా చేసే కరెప్టెడ్ అయి ఉండాలని చంద్ర గట్టిగానే అడుగుతుంది. తనకు ఏం తెలియనట్లు డాక్టర్ కవర్ చేయాలని చూస్తుంది.

విరాట్ రిక్వెస్ట్

శాలిని ప్రెగ్నెన్సీ విషయంలో అబద్దం చెప్పలేదని డాక్టర్ చెప్తుంది. మీరు చేసిన పని వల్ల ఓ కుటుంబం ముక్కలవుతుంది. అన్నదమ్ముల మధ్య వైరం పెరిగింది. ఓ అమాయకురాలిపై నింద పడింది. దయచేసి నిజం ఒప్పుకోండని విరాట్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ మీలాంటి ఫ్రాడ్స్ తో మాట్లాడలేని అని డాక్టర్ ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడే శాలినికి ఫోన్ చేస్తానని డాక్టర్ అంటుంది.

చంద్ర సీరియస్

మర్యాదగా మా మాట వింటారా? అని చంద్రకళ అక్కడే ఉన్న కత్తి తీసి డాక్టర్ పీక మీద పెడుతుంది. నా కుటుంబం కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడను అని చంద్ర అనేసరికి ఒప్పుకుంటానని డాక్టర్ అంటుంది. క్రాంతికి ఫోన్ చేసి చెప్పమంటారు. డాక్టర్ క్రాంతికి ఫోన్ చేసి హాస్పిటల్ కు రమ్మంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More