నిన్ను కోరి డిసెంబర్ 20 ఎపిసోడ్: విరాట్ మార్పును నమ్మని శాలిని- నిజం కనిపెడతానన్న క్రాంతి- శ్రుతితో జలరాజ్ ఫస్ట్ నైట్

నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో అందరూ నమ్మారు కానీ శాలిని అంత త్వరగా నమ్మే వ్యక్తి కాదని విరాట్ అంటాడు. మరోసారి ట్రై చేయాలని చంద్రకళ అంటుంది. విరాట్ మారినట్లు నటించినదాన్ని శాలిని నమ్మదు. అదే విషయం క్రాంతికి చెబితే తాను నిజం కనిపెడతానంటాడు. శ్రుతితో రాజ్ శోభనం చేయించాలని తల్లి అంటుంది.

Published on: Dec 20, 2025, 09:25:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ దగ్గరికి వచ్చి ఏం యాక్టింగ్ చేశావ్ బావ అని పొగుడుతుంది. నువ్ మాత్రం నిజంగానే అన్నావ్‌గా. మనసులో ఇంత పెట్టుకున్నావా. ద్వేషంతో తాళి కట్టానని అన్నావ్ అని విరాట్ అలుగుతాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తొక్క తీసేదాన్ని తొక్కలో గొడవలు ఎందుకు పెట్టుకుంటానని చంద్రకళ అంటుంది.

నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 20 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 20 ఎపిసోడ్‌

శాలిని నమ్మే వ్యక్తి కాదు

అంతా ఓకేకానీ శాలిని అంత త్వరగా నమ్మే వ్యక్తి కాదు అని విరాట్ అంటాడు. నువ్వు చేసిన ఓవరాక్షన్‌కు నమ్మకపోవచ్చు. ఇంకోసారి ట్రై చేయాలి. క్రాంతి మాత్రం కచ్చితంగా నమ్మే ఉంటాడు. కానీ, అది మార్చడానికి శాలిని ట్రై చేస్తుందని చంద్రకళ అంటుంది. తర్వాత క్రాంతి వచ్చినట్లు చంద్రకళ అంటే విరాట్ మళ్లీ నటిస్తాడు. అదంతా వట్టిదే అని చెప్పడంతో చంద్రకళను లాగుతాడు విరాట్.

ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. మరోవైపు కామాక్షి ఏడుస్తుంది. టిఫిన్ తినమని శ్రుతి వచ్చి అంటుంది. నిన్ను మోసం చేయడం కాదు నేనే మోసపోయాను అని ఏడుస్తూ అంటుంది శ్రుతి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా విరాట్, చంద్రల మధ్య గొడవ అవుతుందని కామాక్షి అంటే.. అయ్యో అమ్మా వాళ్లకు గొడవ అయిందే నా పెళ్లితో అని శ్రుతి అంటుంది.

శ్రుతిని ఓదారుస్తుంది కామాక్షి. ఆ తల్లికొడుకులక బుద్ధి చెప్పాలని అంటుంది కామాక్షి. మరోవైపు రఘురాంకు గుద్దుకుంటాడు జాలిరాజ్. నువ్వు శ్రుతి బాయ్‌ఫ్రెండ్‌వి కదా అని రాజ్‌ను ఎడా పెడా కొడతాడు రఘురాం. నేను శ్రుతిని పెళ్లి చేసుకున్నా సర్ అని రాజ్ అంటే.. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని ఇంకా గట్టిగా కొడతాడు. ఇంతలో శ్యామల వచ్చి జరిగింది చెబుతుంది.

పెళ్లి కానీ అమ్మాయిలు

శ్యామల పెళ్లిపై పంచ్ వేసి రఘురాం వెళ్లిపోతాడు. ఇంతలో జాలి రాజ్ ఫ్రెండ్ బాబ్జీ చేపలు అమ్ముకునేందుకు వస్తాడు. ఆ ఇంటికి అల్లుడు అని చెబుతాడు రాజ్. ఇంకెవరైన పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా. నేను కూడా సెట్ చేసుకుంటా అని బాబ్జీ అంటే శ్యామలను చూపిస్తాడు రాజ్. సెటైర్లు వేయకన్నా అని బాబ్జీ వెళ్లిపోతాడు. అదంతా చూసిన శ్యామల నా గురించి ఏం చెప్పావురా అని రాజ్‌ను అడుగుతుంది.

దాంతో శ్యామల గురించి గొప్పగా పొగుడుతాడు రాజ్. విరాట్ చేసినదాని గురించి శాలిని ఆలోచిస్తుంటే క్రాంతి వచ్చి వెనుక నుంచి వాటేసుకుంటాడు. వదిన విషయంలో అన్నయ్య మారాడు. ప్రశాంతంగా ఉందంటాడు. మనసులో ఉన్నది ఒక్కొక్కటిగా ఎలా బయటపడుతుందో చూశావుగా. అన్ని బయటపడే టైమ్ వస్తుందని క్రాంతి అంటాడు.

నాకు మాత్రం మీ అన్నయ్య మీద అనుమానంగా ఉంది. కావాలని డ్రామా చేస్తూ నిన్ను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారనిపిస్తుంది అని శాలిని అంటుంది. అన్నయ్య ఏదైనా డైరెక్ట్ చేస్తాడు గానీ చాటు మాటు వ్యవహారాలు చేయడు. కావాలంటే అదంతా నేను తెలుసుకుంటాను అని క్రాంతి అంటాడు. మరోవైపు విరాట్ అలిగి ఉంటే ముద్దొస్తున్నారని చంద్ర అంటుంది.

క్రాంతి ముందు రొమాంటిక్ డ్రామా

అయితే ముద్దు పెట్టు అని విరాట్ అంటాడు. విరాట్‌కు చంద్రకళ ముద్దుపెట్టబోతూ క్రాంతిని చూసి ఆగి అరుస్తుంది. క్రాంతి వచ్చినట్లు సైగ చేస్తుంది. దాంతో విరాట్ గొడవ పడినట్లు నటిస్తాడు. ఇద్దరు వాదించుకుంటారు. తర్వాత కాసేపటికి రొమాంటిక్‌గా వాదించుకుంటారు. తలుపులు మూస్తాను ఏం చేస్తావో చూస్తాను అని చంద్రకళ వచ్చి మూస్తుంది.

దాంతో క్రాంతి వెళ్లిపోతాడు. ఏం చేస్తావో చేయి అని చంద్రకళ వెనక్కి తిరిగేసరికి విరాట్ ఉంటాడు. క్రాంతి వెళ్లిపోయాడని చెబుతుంది. మరోవైపు శ్రుతితో ఫస్ట్ నైట్ జరిపించాలని జలరాజ్ తల్లి అంటుంది. ఎలాంటివారో తెలియనివాళ్లతో ఫస్ట్ నైట్ ఎలా జరిపిస్తామని క్రాంతి అంటాడు. అక్కడితో నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More