30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటున్నారు: ఇట్స్ ఓకే గురు నిర్మాత క్రాంతి ప్రసాద్ కామెంట్స్

చైల్డ్ ఆర్టిస్ట్ ఉష శ్రీ హీరోయిన్‌గా మారిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ సినిమా ఇట్స్ ఓకే గురు. సాయి చరణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు మణికంఠ దర్శకత్వం వహించారు. క్రాంతి ప్రసాద్ నిర్మించిన ఇట్స్ ఓకే గురు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత క్రాంతి ప్రసాద్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

Published on: Dec 7, 2025, 20:24:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిల్లా తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఉష శ్రీ హీరోయిన్‌గా మారిన సినిమా ఇట్స్ ఓకే గురు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి చరణ్ హీరోగా చేశాడు. ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ నిర్మించిన ఇట్స్ ఓకే గురు సినిమాకు మణికంఠ దర్శకత్వం వహించారు.

30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటున్నారు: ఇట్స్ ఓకే గురు నిర్మాత క్రాంతి ప్రసాద్ కామెంట్స్
30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటున్నారు: ఇట్స్ ఓకే గురు నిర్మాత క్రాంతి ప్రసాద్ కామెంట్స్

ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ మెహర్ రమేష్ అతిథిగా హాజరైన ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో మూవీ నిర్మాత క్రాంతి ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ మాట్లాడుతూ.. "చాలా మంచి టీంతో చేస్తున్న సినిమా ఇది. నేను స్వతహాగా మార్చల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని. 30 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. మన దైనందిన జీవితంలో చిన్న విషయాలకు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటాము. చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు" అని అన్నారు.

మంచి లవ్ స్టోరీతో

"ఈ ఇట్స్ ఓకే గురు సినిమాలో ఎమోషన్స్‌ని ఎలా అధిగమించాలి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. డిప్రెషన్‌లో ఉన్న వాళ్లు ఈ సినిమా చూస్తే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మంచి లవ్ స్టోరీతో పాటు అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు నిర్మాత క్రాంతి ప్రసాద్.

ఇక హీరో సాయి చరణ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. రమేష్ గారికి థాంక్యూ. ఇట్స్ ఓకే గురు టైటిల్ నా లైఫ్‌లో చాలా కనెక్ట్ అయింది. రవి బాబు గారితో నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎమోషనల్‌గా మెంటల్ గా చాలా లో అయ్యాను. చాలా విమర్శలు, ట్రోలింగ్ ఇప్పటికీ వస్తున్నాయి" అని చెప్పారు.

ఎంతో ఎనర్జీ నింపింది

"జీవితంలో ఏం చేయాలో తోచని సమయంలో మా అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు ఇట్స్ ఓకే ప్రయత్నించమని చెప్పింది. ఆ మాట నాలో ఎంతో ఎనర్జీని నింపింది. అక్కడి నుంచి ప్రతిక్షణం మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటి సమయంలో ఈ సినిమా ఈ సినిమా వచ్చింది" అని హీరో సాయి చరణ్ తెలిపారు.

"టైటిల్ ఇట్స్ ఓకే గురు అని చెప్పారు. అది నాకు చాలా పర్సనల్ కనెక్షన్ అనిపించింది. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా అందరికి కూడా పర్సనల్‌గా కనెక్ట్ అవుతుంది" అని కథానాయకుడు సాయి చరణ్ చెప్పుకొచ్చారు.

యూత్ చూడాల్సిన సినిమా

ఈస్ట్ వెస్ట్ సీఈవో రాజీవ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లింది. ప్రమోషన్స్‌ని కూడా చాలా కొత్తగా చేశారు. మణికంఠ చాలా పాషన్ ఉన్న డైరెక్టర్. హీరో హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా చక్కగా ప్రమోషన్స్ కూడా చేశారు. ఇది యూత్ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది" అని పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More