నిన్ను కోరి ప్రోమో: దగ్గరుండి శ్రుతి పెళ్లి చేయించిన చంద్రకళ- గట్టిగా ఇరికించిన శాలిని, శ్రుతి- గుడిలో నిందలు, తిట్లు
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో గుడిలో శ్రుతి పెళ్లి చేసుకుంటున్నట్లు కామాక్షికి తెలిస్తుంది. ఇంట్లో అందరిని పిలిచి ఏడుస్తుంది కామాక్షి. మరోవైపు చంద్రకళకు కూడా విషయం తెలిసి గుడికి వెళ్తుంది. చంద్రకళే శ్రుతి పెళ్లి చేయిస్తుందని శాలిని చెబుతుంది. అది నమ్మి గుడిలో చంద్రను నిందిస్తారు.
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో చంద్రకళ బ్యాంక్‌లో వేయమన్న డబ్బు తీసుకుని పెళ్లికూతురిలా రెడీ అవుతుంది శ్రుతి. కూతురుని చూసి దిష్టి చుక్క పెట్టి మరి పంపిస్తుంది తల్లి కామాక్షి. శ్రుతి గుడికి వెళ్తుంది. జాలి రాజ్, అతని తల్లి కూడా వస్తారు. పెళ్లికొడుకులా రాజ్ రెడీ అయి వస్తాడు.

సీక్రెట్‌గా శ్రుతి పెళ్లి
శ్రుతి గుడిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటుందని కామాక్షికి ఫోన్ వస్తుంది. అది తెలిసి షాక్ అవుతుంది కామాక్షి. అందరిని పిలిచి గోల చేస్తుంది కామాక్షి. అంతా వచ్చి ఏమైంది అని అడుగుతారు. శ్రుతి పెళ్లి చేసుకుంటుందట అని ఏడుస్తూ కామాక్షి అందరికి చెబుతుంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.
పెళ్లి ఏంటీ, ఎవరిని చేసుకుంటుంది, అసలు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకునేంతగా ఏం జరిగింది అని అంతా అనుకుంటారు. ఏమైందో తెలియదు. కొన్ని రోజులుగా శ్రుతి మాములుగా లేదు. మొన్న వచ్చి ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తావని అడిగింది. నేను కోపంతో కొట్టాను. ఒకవేళ ఎవరినైనా ప్రేమించిందేమో అని కామాక్షి తల్లడిల్లుతూ చెబుతుంది.
నువ్వు కొట్టేసరికి పెళ్లికి కూడా ఒప్పుకోవేమో అని ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నట్లుంది అని శ్యామల అంటుంది. అంతే అయింటుంది అని కామాక్షి ఏడుస్తుంది. అందుకునే బిజినెస్ అంటూ అందరిని రెండు లక్షలు అడిగింది అని డౌట్ పడతారు. లేచిపోయేందుకే రెండు లక్షలు అడిగి ఉంటుందని అనుకుంటారు.
పెళ్లి పీటలపై రాజ్, శ్రుతి
ఇంతకీ ఏ గుడిలో పెళ్లి జరుగుతుందో కనుక్కున్నావా అని కామాక్షిని శ్యామల అడుగుతుంది. తెలుసు అని గుడి పేరు చెప్పి అక్కడికి అంతా బయలుదేరుతారు. మరోవైపు జాలిరాజ్, శ్రుతి ఒకరినొకరు పొగుడుకుంటూ పెళ్లి పీటలపై కూర్చొంటారు. మరోవైపు పనసపొట్టు కర్రీ చేసేందుకని పనసపండు కొనేందుకు బయటకు వెళ్తుంది చంద్రకళ.
అప్పుడు చంద్రకళకు ఎవరో ఫోన్ చేసి శ్రుతి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటుందని చెప్పి గుడి పేరు చెబుతాడు. దాంతో చంద్రకళ కూడా గుడికి వెళ్తుంది. చంద్రకళ వెళ్లేసరికి అక్కడ జాలిరాజ్‌తో శ్రుతి తాళి కట్టించుకునేందుకు రెడీగా ఉంటుంది. అది చూసి షాక్ అయిన చంద్రకళ అరుస్తుంది.
అదే సమయంలో రఘురాం ఫ్యామిలీ వస్తుంది. శ్రుతి తాళి కట్టించుకోవడం వాళ్ల ఎదురుగా చంద్రకళ ఉండటంతో అదంతా చంద్రకళే చేయిస్తుందని శాలిని అంటుంది. గుడిలో సీక్రెట్‌గా చంద్రకళే దగ్గరుండి శ్రుతి పెళ్లి చేయిస్తుందని చెబుతుంది శాలిని. అంతేకాకుండా శ్రుతికి రెండు లక్షల డబ్బు కూడా ఇవ్వడం తాను చూశానని ఇరికిస్తుంది శాలిని.
చంద్రకళ సలహాతోనే
ఇవే కాకుండా విరాట్‌ను వదిలి మనసుకు నచ్చినవాన్ని చూసుకోమని చంద్రకళనే శ్రుతికి సలహా ఇచ్చిందని, అందుకే శ్రుతి ఇలా లవ్ చేసిందని చెబుతుంది శాలిని. ఆ మాటలు నమ్మిన శ్యామల, కామాక్షి చంద్రకళను గుడిలో నిందిస్తారు. ఫ్యామిలీ అంతా రావడంతో శ్రుతి తెగ భయపడిపోతుంది.
వీరి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంది. చంద్రకళకు తెలిసే ఇదంతా జరుగుతుందా అని శ్రుతిని కామాక్షి అడుగుతుంది. తనను తాను కాపాడుకునేందుకు, అప్పటికప్పుడు తప్పించుకుందామని అవును అని అంటుంది శ్రుతి. చంద్ర ప్రోత్సాహంతోనే ఇదంతా చేస్తున్నానని శ్రుతి కూడా చంద్రకళను గట్టిగా ఇరికిస్తుంది.
అదంతా విన్న చంద్రకళ షాక్‌లో ఉండిపోతుంది. అంతా చంద్రకళను తిడతూ గుడిలో నిందిస్తారు. విరాట్ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


