నిన్ను కోరి డిసెంబర్ 18 ఎపిసోడ్: చంద్ర‌పై కుట్ర‌-అండ‌గా ర‌ఘురాం, విరాట్-తాళి తీయ‌మ‌న్న కామాక్షి-జ‌గ‌దీశ్వ‌రి వార్నింగ్

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 18 ఎపిసోడ్ లో రాజ్ తో శ్రుతి పెళ్లి చంద్రకళ కుట్ర అని నమ్మించాలని శాలిని ప్రయత్నిస్తుంది. తాళి తీసేయమని కామాక్షి అంటుంది. కానీ జగదీశ్వరి అడ్డుకుంటుంది. రాజ్, సరోజాకు వార్నింగ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తుంది.

Published on: Dec 18, 2025, 07:44:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శ్రుతి తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ అబద్దం చెప్పలేదు. నేనే అబద్దం చెప్పానని రాజ్ అంటాడు. శాలిని మధ్యలో వచ్చి మళ్లీ చంద్ర మీదకు డైవర్ట్ చేస్తుంది. కామాక్షి వచ్చి నీ కళ్లు చల్లబడ్డాయా అని అంటుంది. ఇదంతా చంద్ర ఆడిన నాటకమే. వీళ్లంతా ఉసిగొల్పిన మనుషులే అని కామాక్షి అంటే, బుద్ధి ఉండాలని రఘురాం మధ్యలో చంద్రకు అండగా నిలుస్తాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చంద్రకళ పనే

ఇది నిజంగా చంద్రకళ పనే. నిన్న జల్ రాజ్ నాకు డబ్బులు కావాలని అడిగాడు. అప్పుడే చంద్ర నాకు డబ్బులిచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమందని శ్రుతి చెప్తుంది. చంద్ర ఆఫీస్ కు వెళ్తుంటే నేనే పనసపొట్టు కూర చేయమన్నా. చంద్ర డబ్బులిచ్చి డిపాజిట్ చేయమని చెప్పిందని రఘురాం అంటాడు. అవును, చంద్ర ముందే ఆ డబ్బులు నన్ను అడిగిందని విరాట్ చెప్తాడు.

జగదీశ్వరి వార్నింగ్

నేనే పరాయిదాన్ని. ఇదంతా అసలు పెళ్లే కాదు. ఆ తాళి తీసి వాడి ముఖం మీద కొట్టు అని కామాక్షి అంటే, శ్రుతి తాళి తీసేందుకు రెడీ అవుతుంది. ఆగు శ్రుతి తాళి తీయడం సంప్రదాయానికిి విరుద్ధం. తాళికి విలువ ఇవ్వమని చెప్తున్నా. నా కొడుకులిద్దరూ ఇలాగే పెళ్లి చేసుకుని వచ్చారు. కానీ నేను ఇలాగే తాళి తెంచమన్లేదు. తాళికి విలువ ఇవ్వల్సిందేనని జగదీశ్వరి అంటుంది. మీ కొడుకు ప్రేమ నాటకం అని తెలిస్తే మాత్రం విడాకులు ఇప్పించి, నష్ట పరిహారం కూడా వసూలు చేస్తానని సరోజాకు జగదీశ్వరి వార్నింగ్ ఇస్తుంది.

కామాక్షి పంతం

రాజ్, శ్రుతికి హారతి ఇచ్చి ఇంటి లోపలికి రమ్మంటుంది జగదీశ్వరి. మొత్తానికి ఇంట్లో అడుగుపెట్టా. ఇక సింహాసనం దక్కించుకోవాలని రాజ్ అనుకుంటాడు. కూతురి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నానని కామాక్షి ఏడుస్తుంది. చంద్ర తప్పేం లేదని రఘురాం వెనకేసుకొస్తాడు. మనమే శ్రుతి జీవితాన్ని చక్కదిద్దాలని జగదీశ్వరి చెప్తుంది. చంద్రను మాత్రం వదలను. విరాట్ తో కాపురం చేయనివ్వనని కామాక్షి అనుకుంటుంది.

నిజం చెప్పిన శ్రుతి

కిచెన్ లోకి వెళ్లి శ్రుతిని బలి పశువును చేసింది నేనేనని చంద్రతో శాలిని చెప్తుంది. నిన్ను బ్యాడ్ చేయాలనుకున్నా. శ్రుతి ఓ ఫ్రాడ్ ను ప్రేమించింది. ఆ విషయం కామాక్షి పిన్నికి చెప్పేలా చేశా. పెళ్లి చేసుకునేలా రెచ్చగొట్టా. శ్రుతి పెళ్లి జరగాలి. అందుకు కారణం నువ్వే అని నిందించాలి. నీపై అందరికీ కోపం పెరగాలి. అదే నా ప్లాన్. సక్సెస్ అయింది. ఏదో ఒక రోజు మామయ్యను కొట్టింది కూడా నువ్వే అని నమ్మిస్తానని శాలిని అంటుంది.

శాలినిని చంద్ర కొట్టబోతుంటే శ్యామల వస్తుంది. శ్రుతిని ఎందుకు మోసం చేశావని అడిగితే కొట్టబోతుందని శాలిని చెప్తుంది. రూమ్ లో ఉన్న పరుపు, వస్తువులు చూసి రాజ్, సరోజా సంబరపడిపోతుంటారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More