నిన్ను కోరి డిసెంబర్ 17 ఎపిసోడ్: రాజ్‌, శ్రుతి పెళ్లి-ఆప‌లేక‌పోయిన చంద్ర‌క‌ళ‌-శాలిని ప్లాన్ స‌క్సెస్‌-చంద్ర‌పై నింద‌లు

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్ లో శాలిని ప్లాన్ ప్రకారం రాజ్, శ్రుతి పెళ్లి అయిన తర్వాతే చంద్రకళ గుడికి వస్తుంది. రఘురాం కుటుంబం కూడా అక్కడికి వస్తారు. శ్రుతిని కామాక్షి చెంపలపై కొడుతుంది. చంద్రపై నిందలు వేసేలా శాలిని నాటకం స్టార్ట్ చేస్తుంది. రాజ్ నిజస్వరూపం శ్రుతికి తెలుస్తుంది.

Published on: Dec 17, 2025, 07:35:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్ లో శ్రుతి మెడలో రాజ్ తాళి కడతాడు. మూడు ముళ్లు పడ్డ తర్వాత రాజ్, శ్రుతిని చంద్రకళ చూస్తుంది. దండలు మార్చుకునేటప్పుడు వచ్చి షాక్ అవుతుంది. రాజ్, శ్రుతి కూడా కంగారు పడతారు. ఎం పని చేశావ్ శ్రుతి, అతను చేపల బిజినెస్ చేస్తాడని చంద్ర చెప్తుంది. ఆ రోజు ఇంటికి నన్ను కలిసేందుకు అలా వచ్చాడని శ్రుతి చెప్తుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చంద్ర షాక్

నువ్వు చెప్పాకే రాజ్ నాకు పరిచయమయ్యాడు. ఇద్దరం లవ్ చేసుకున్నాడు. అమ్మ మా పెళ్లికి ఒప్పుకోదని అర్థమైంది. అందుకే ఇలా అని శ్రుతి చెప్తుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో? జగదీశ్వరి అత్తయ్య ఎలా రియాక్టవుతుందో ఆలోచించావా? అని చంద్రకళ అడుగుతుంది. రాజ్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ తెలిస్తే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారు అని శ్రుతి చెప్తుంది.

ఆశీర్వదించమని

శాలినికి మధు ఫోన్ చేసి పెళ్లి అయిపోయింది. తాళి పడ్డ సమయానికి చంద్రకళ వచ్చిందని చెప్తాడు. క్రాంతి పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలిసిందని అందరినీ రామాలయం తీసుకొస్తుంది శాలిని. చంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లు ఎలా బతకాలో నీకు తెలుసు. మమ్మల్ని ఆశీర్వదించు. ఇప్పుడు అక్కవైనా, అమ్మవైనా నువ్వే అని చంద్ర కాళ్ల మీద పడతారు రాజ్, శ్రుతి. అప్పుడే ఫ్యామిలీ అంతా అక్కడికి వస్తారు.

శ్రుతిని కొట్టిన కామాక్షి

మూడు ముళ్లు పడిపోయాయని అంతా షాక్ అవుతారు. అది నా బిడ్డరా. నాకు చెప్పకుండా నన్నే మోసం చేసి తాళి.. ఎన్ని కలలు కన్నాను నీ కోసం. ఎంత దిగజారిపోయాను. ఎన్ని అవమానాలు పడ్డాను. నా కూతురు బాగుంటే చాలు అనుకున్నా. కానీ నా కూతురే నన్ను మోసం చేస్తే ఎలా తట్టుకోమంటావ్ అని శ్రుతి చెంపలపై లాగి కొడుతుంది కామాక్షి.

చంద్రపై నిందలు

సీన్ ను శ్రుతి నుంచి చంద్ర మీదకు డైవర్ట్ చేద్దామని శాలిని నాటకం స్టార్ట్ చేస్తుంది. చంద్ర నువ్వెందుకు పెళ్లి ఆపలేదు. జరిగితే చూద్దామనుకున్నావా? కామాక్షి పిన్ని ఏ రోజుకైనా విరాట్ ను శ్రుతికి ఇచ్చి పెళ్లి చేస్తుందనే భయం నీలో ఉందేమో. అందుకే అడ్డు తొలగించుకోవాలని చూశావేమో అని శాలిని అంటుంది. శాలిని అనుమానించడానికి కూడా ఓ హద్దుండాలని జగదీశ్వరి అడ్డుకుంటుంది.

రాజ్ నిజస్వరూపం

చంద్ర ఎప్పుడైతే నా లైఫ్ నన్ను చూసుకోమని చెప్పిందే అప్పుడే డిసైడ్ అయ్యా. తర్వాతి రోజే రాజ్ పరిచయమయ్యాడు. మన స్టేటస్ కు తగ్గ మనిషి అని ఫ్యామిలీకి రాజ్ ను పరిచయం చేస్తుంది శ్రుతి. ఉత్తి రాజ్ వి కాదు, జల రాజ్ వి. మాయగాడు నిన్ను మోసం చేసి తాళి కట్టాడు. వాడికి ఉన్న ఆస్తి సున్నా. అప్పులు లెక్కలేనన్నీ అని విరాట్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ బావ అని చంద్ర అంటే, ఏం తెలియనట్లు ఏం నాటకాలు ఆడుతున్నావ్. నా కూతురి బ్రెయిన్ వాష్ చేసి, ఈ తలకు మాసినోన్ని తగిలించావు కదా అని చంద్రపై సీరియస్ అవుతుంది కామాక్షి.

రాజ్ ను కామాక్షి కొట్టబోతుంటే సరోజా వచ్చి అడ్డుకుంటుంది. జల రాజ్ తల్లిని అని సరోజా చెప్పగానే శ్రుతి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను మోసపోయానమ్మా అని శ్రుతి ఏడుస్తుంది. నువ్వు డబ్బున్నవాడివని లవ్ చేశానని అంటుంది. నీకు డబ్బుందని వాడు, వాడికి డబ్బుందని నీకు.. సరిపోయిందని రఘురాం అంటాడు. శ్రుతిని కంటికి రెప్పలా చూసుకుంటానని రాజ్ చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More