గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి గురించి నిజం చెప్పిన తల్లి- చింటును దత్తత తీసుకుంటున్న బాలు, మీనా- సత్యం ఓకే
గుండె నిండా గుడి గంటలు జనవరి 5 ఎపిసోడ్‌లో చింటు బర్త్ డేలో కూతురు రోహిణి గురించి నిజం చెబుతుంది తల్లి సుగుణ. అదంతా విన్న రోహిణి తల్లిపై అరుస్తుంది. బాలు, మీనాలు ఇంకోసారి రాకుండా తిట్టి పంపించేయ్ అని చెబుతుంది. చింటును దత్తత తీసుకోవాలని బాలు, మీనా అనుకుంటారు. ఇంట్లో విషయం చెబుతారు. సత్యం ఓకే అంటాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చింటు బర్త్ డేలో కల్యాణ్ గురించి చుట్టు పక్కలవాళ్లు అడుగుతారు. చింటు అమ్మ అంటే మీనా అడిగితే.. అత్తను అమ్మ అంటున్నాడు అని రోహిణి తల్లి సుగుణ చెబుతుంది. అత్త కాదు అమ్మ అని చింటు అంటాడు. తర్వాత అమ్మ కాదు అత్త అని చింటు అంటాడు.

అత్తనే అమ్మ అనుకుంటున్నాడు
అమ్మ మీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్తాడు బాలు. ఆ మాటలు రోహిణి వింటుంది. వీడి పుట్టినరోజున కూడా అయిన చింటు అత్త రావొచ్చుగా. వాడు అత్తనే అమ్మ అనుకుంటున్నాడు. ఇంకెప్పుడు ఆవిడ వస్తుంది. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను అని బాలు అంటాడు.
తను రాదు బాలు. తనకు రావడం ఇష్టంలేదు. తన అన్న కొడుకు కాదు. కన్నకొడుకు. నేను అత్త అని చెప్పలేదు. వాళ్ల అమ్మే అలా చెప్పమంది. నిజం ఎవరికి చెప్పలేదు. అబద్ధం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. కారణం నేనే. నేను తన జీవితం చేతులారా నాశనం చేశాను అని సుగుణ చెబుతుంది.
మా ఇంటాయన చనిపోయే నాటికి మాకు చాలా అప్పులు ఉండేవి. అప్పుడు నా కూతురు డిగ్రీ చదువుతుండేది. వయసులో పెద్దాయన మా అప్పులు తీరుస్తానని ముందుకు వచ్చాడు. అందుకు బదులుగా మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఒంటరి ఆడదాన్ని. వేరే దారిలేక నా కూతురుని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశాను. కానీ, కొన్ని రోజులకే అల్లుడు చనిపోయాడు అని రోహిణి పేరు చెప్పకుండా తన కూతురు గతం గురించి చెబుతుంది సుగుణ.
జీవితం నాశనం చేశానని
తన జీవితం నాశనం చేశానన్న కోపంతో నా మీద కోపం పెంచుకుంది. చదువు పూర్తయ్యాక చింటును వదిలేసి దుబాయ్ వెళ్లిపోయిందని చెబుతుంది సుగుణ. నిజంగా మీ కూతురుకు అన్యాయమే జరిగింది అని మీనా అంటుంది. మరి వాళ్లమ్మ చింటుకు అన్యాయం చేయలేదా అని బాలు అంటాడు.
ప్రాయిశ్చత్యంగా చింటు నేను పెంచుతున్నా. తన కొడుకు అని తీసుకెళ్తే తను అనుకున్న జీవితం అనుభవించలేదు. అందుకే చెప్పనివ్వలేదు అని సుగుణ అంటుంది. తప్పు చేసి మీరు, దూరంగా మీ కూతురు అంతా బాగున్నారు కానీ, చింటుకు మాత్రం అన్యాయం చేస్తున్నారని బాలు అంటాడు. మీ కూతురుకు ఇంత స్వార్థం పనికిరాదు. ఏదో ఒక రోజు శిక్ష పడుతుంది. ఆవిడ కోరుకున్న జీవితం దక్కకుండా పోతుంది అని మీనా శాపం పెడుతుంది.
ఇప్పుడిప్పుడే దాని మనసు మెత్తబడుతుంది. త్వరలోనే తను తీసుకెళ్తుందని నమ్మకం ఉందని సుగుణ అంటుంది. బాలు కోప్పడితే మీనా సర్దిచెబుతుంది. తర్వాత ఇంట్లో చింటుతో కేక్ కట్ చేయిస్తారు బాలు, మీనా. ఇంత దూరం వచ్చిన వాడి పక్కన ఉండి కేక్ కట్ చేయించే అదృష్టం లేకుండా పోయిందని ఏడుస్తుంది రోహిణి. చింటు కేక్ కట్ చేస్తాడు.
గుండెలకు హత్తుకుని
కానీ, చింటు చాలా డల్‌గా ఉంటాడు. తర్వాత చింటును నవ్విస్తాడు బాలు. రోహిణి ఏడుస్తూ వెళ్లిపోతుంది. అది చూసిన సుగుణ కాల్ చేస్తుంది. బాలు, మీనాను పంపించమని చెబుతుంది రోహిణి. సరే అని సుగుణ అంటుంది. బయట రోహిణి ఎదురుచూస్తుంటుంది. బాలు, మీనా వెళ్లిపోతారు. అంతా వెళ్లిపోతారు. రోహిణి వస్తుంది. అమ్మ అని పిలవచ్చా అని చింటు అంటే గుండెలకు హత్తుకుంటుంది రోహిణి.
చింటుకు కేక్ తినిపిస్తుంది రోహిణి. నా కథ అంతా చెప్పేస్తావా అని సుగుణపై అరుస్తుంది రోహిణి. వాళ్లు చింటు గురించి ఆలోచించడంలో నువ్వు కనీసం ఆలోచించడం లేదు. వాళ్లు నీతో మాట్లాడాలని అంటున్నారు. మాట్లాడించనా అని కూతురుకు రివర్స్ అవుతుంది తల్లి సుగుణ. అది ఒక తల్లి గురించి చెప్పింది. నీ పేరు రాదు అని సుగుణ అంటుంది.
బాలు మాములోడు కాదు. వెంట్రుకతో కొండను తవ్వుతాడు. ఇకనుంచి వాళ్లు రాకుడదు. వాళ్లు వస్తే తిట్టి పంపించు. నా గురించి ఆరాలు తీయకని చెప్పు. కోప్పడు అని ఆర్డర్ వేసి వెళ్తుంది రోహిణి. దాంతో సుగుణ షాక్ అవుతుంది. మరోవైపు కారులో బాలు, మీనా చింటు గురించి ఆలోచిస్తారు. వాడు నాలాగే బామ్మ దగ్గర పెరుగుతున్నాడు అని బాలు అంటాడు.
చింటును దత్తత తీసుకుందాం
మనం ఉన్నంతవరకు వాడికి ఏం కాదు. వాడిని మనం దత్తత తీసుకుందామా అని మీనా అంటుంది. నాకు కూడా అదే అనిపిస్తుందని బాలు అంటాడు. ఇప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అత్తయ్య ఒప్పుకోవాలి. అందరు ఒప్పుకుంటునే చింటు సంతోషంగా ఉంటాడు అని మీనా అంటుంది.
మన నిర్ణయం మంచిదో కాదో గుడికి వెళ్లి దేవుడి సమాధానం తీసుకుందాం అని బాలును మీనా తీసుకెళ్తుంది. దేవుడుకు అర్జి పెట్టుకుందాం. నిర్ణయం మంచిది అనిపిస్తే సరే అంటాడు అని రెండు చిట్టీలపై రాస్తుంది మీనా. వాటిని అమ్మవారి ముందు పెట్టిపిస్తుంది మీనా.
తర్వాత ఇంట్లో చింటు తల్లి గురించి మొత్తం చెబుతాడు బాలు. ఆ మాటలు వింటుంది రోహిణి. చింటును దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాం అని బాలు, మీనా చెబుతారు. సత్యం ఓకే అంటాడు. తల్లికే అక్కర్లేని వాడు మనకెందుకు అని ప్రభావతి వద్దంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


