గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న బాలు, మీనా.. చింటుని బలి చేస్తారా అంటూ..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జనవరి 2) ఎపిసోడ్ లో చింటు బర్త్ డే కోసం బాలు, మీనా రావడం.. రోహిణి రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకోవడంతో పెద్ద ట్విస్టే వస్తుంది. తాను రోహిణితో మాట్లాడతానని బాలు అంటాడు.

Published on: Jan 2, 2026, 07:27:54 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 589వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. చింటు బర్త్ డే కోసం వచ్చిన బాలు, మీనా.. రోహిణికి గట్టి షాకే ఇస్తారు. అటు రవికి బ్లాంక్ చెక్ ఇచ్చి శృతి తల్లి శోభ అవమానిస్తుంది. దీంతో రవి, శృతి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న బాలు, మీనా.. చింటుని బలి చేస్తారా అంటూ..
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న బాలు, మీనా.. చింటుని బలి చేస్తారా అంటూ..

చింటుకి బాలు డ్రెస్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జనవరి 2) ఎపిసోడ్ మీనా కోసం బాలు కొత్త చీర తెచ్చే సీన్ తో మొదలవుతుంది. మీనా ఆ చీర కట్టుకొని మురిసిపోతుంది. తర్వాత ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ దిగుతారు. తాను చింటుకి కూడా డ్రెస్ తీసుకొచ్చానని బాలు అంటాడు. ఎలాగూ బర్త్ డే వస్తుందని చెప్పాడు కదా.. ఇవ్వొచ్చులే అని మీనా అంటుంది.

రవిని అవమానించిన శోభ

ఇటు రవి రెస్టారెంట్ కు వెళ్తుంది శృతి తల్లి శోభ. మీరు పిల్లలు కనడానికి రెస్టారెంట్ ఓపెన్ చేసే వరకు ఆగాలని నిర్ణయించుకున్నారట కదా.. అయినా మీకేమైనా కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా అంటూ రవి చేతిలో బ్లాంక్ చెక్ పెడుతుంది శోభ. నేను మిమ్మల్ని అడగలేదు కదా.. అవసరం లేదని రవి అంటున్నా ఆమె వినదు. ఆ చెక్ చూసిన రవి సహచరులు అతన్ని అదృష్టవంతుడివి అంటూ ఆటపట్టిస్తారు. అందుకే డబ్బున్న అమ్మాయిని వలలో వేసుకున్నావా అంటారు. దీంతో రవి అవమాన భారంతో రగిలిపోతాడు.

శృతితో రవి గొడవ

వెంటనే శృతి దగ్గరికి వెళ్తాడు. ఆమె డబ్బింగ్ రూమ్ లో ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లి శోభ ఇచ్చిన చెక్ ఆమె మొహాన కొడతాడు. ఏం జరిగిందంటూ శృతి అడుగుతుంది. అసలు మన ఇంట్లో విషయాలు మీ అమ్మకి చెప్పొద్దని అన్నాను కదా.. మీ డబ్బున్న వాళ్లకు ఎంత గర్వం ఉంటుందో ఇప్పుడు మళ్లీ తెలిసింది.. మీ అమ్మ నా ముఖాన ఈ చెక్ కొట్టి వెళ్లింది అని చెబుతాడు.

మా అమ్మ నీకు ఈ చెక్ ఇస్తే.. నువ్వు నా ముఖాన కొడతావా.. వాళ్లు అడగకుండానే నన్ను అర్థం చేసుకుంటారు.. అయినా పిల్లల గురించి అడిగితే రెస్టారెంట్ పెట్టే వరకు ఆ ఆలోచన లేదని చెప్పానంతే అని శృతి ఎదురు తిరుగుతుంది. డబ్బింగ్ స్టూడియోలోనే ఇద్దరూ మాటామాటా అనుకుంటారు.

చింటు బర్త్‌డే కోసం వచ్చిన రోహిణి

ఇటు కొడుకు చింటు బర్త్ డే కోసం రోహిణి వస్తుంది. ఆమెను చూడగానే చింటూ ఎంతో మురిసిపోతాడు. నీకు ఇష్టమైన డ్రెస్ తీసుకొచ్చానని చెబుతుంది. చింటు మరింత సంతోషిస్తాడు. ఈరోజు నువ్వు మా అమ్మవని మా ఫ్రెండ్స్ అందరికీ చెబుతానని చింటు చెప్పడంతో షాక్ తిన్న రోహిణి.. ఇప్పుడే వద్దని, టైమ్ వచ్చినప్పుడు తాను చెబుతానని అంటుంది. తర్వాత బర్త్ డే ఏర్పాట్లు చేసి కేక్ కూడా ఆర్డర్ చేస్తుంది. రోహిణి తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకొని చింటు మురిసిపోతాడు.

చింటు కోసం బాలు, మీనా.. రోహిణికి షాక్

అదే సమయానికి బాలు, మీనా అక్కడికి వస్తారు. చింటు వాళ్ల దగ్గరికి పరుగెత్తుకొని వచ్చి తన బర్త్ డే అని తెలిసే వచ్చారా అని అడుగుతాడు. తెలియకుండానే అయినా కరెక్ట్ టైమ్ కే వచ్చామని బాలు, మీనా అనుకుంటారు. వాళ్లను చూసి రోహిణి, ఆమె తల్లి షాక్ తింటారు. కేక్ కట్ చేసిన తర్వాతే వెళ్దామని బాలు అనడంతో మీనా కూడా సరే అంటూ ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. దీంతో రోహిణి కిచెన్ లోనే దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఆమె లేకపోవడంతో అమ్మ ఎక్కడ అని చింటు.. కల్యాణి ఎక్కడ అని చుట్టుపక్కల వాళ్లు అడుగుతారు. అది విని బాలు, మీనా అయోమయానికి గురవుతారు. దీంతో ఆమె తల్లి వాళ్లకు అసలు విషయం చెబుతుంది. తన వల్లే ఇదంతా జరిగిందని, ఆమెకు ఇష్టం లేకపోయినా తానే రెండో పెళ్లి చేశానని అంటుంది. అయినా మీ వల్ల చింటూ బలవ్వాలా.. ఆమె నంబర్ ఇవ్వండి నేనే మాట్లాడతాను అని బాలు అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More