గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనాకు బాలు కొత్త చీర- రోహిణి కొడుకు చింటూ బర్త్ డేలో బాలు, మీనా- చిక్కుల్లో రోహిణి
గుండె నిండా గుడి గంటలు జనవరి 1 ఎపిసోడ్‌లో బాలు మీద పందెం కట్టి మరోసారి ఓడిపోతుంది మీనా. షాపింగ్ మాల్‌లో ప్రభావతి, కామాక్షి కంట పడిన రోహిణి కొడుకు గురించి బయటపడనివ్వకుండా తప్పించుకుంటుంది. చింటు బర్త్ డేకి రోహిణి వెళ్తుంది. అక్కడికి బాలు, మీనా కూడా వస్తారు. దాంతో రోహిణి చిక్కుల్లో పడుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాతో ఇంకో పందెం వేస్తారు పూలు కట్టేవారు. ఫోన్ చేసి పొద్దున చేసిన బీట్ రూట్ దోశ ఎలా ఉందో అడుగు. బాగుందని చెబితే ఐదు వందలు నీకే అని వాళ్లు అంటారు. బాలుకు మీనా కాల్ చేస్తుంది. బాలు డ్రైవింగ్‌లో ఉంటాడు. దాంతో మీనా టిఫిన్ గురించి అడగ్గానే చిరాకుపడతాడు.

మరోసారి ఓడిపోయిన మీనా
దాంతో మరోసారి మీనా పందెం ఓడిపోయి ఐదు వందలు ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు తినడానికి బాలు, రాజేష్ కూర్చొంటారు. బాలుకు దోశ పిండి, పల్లీలు, పచ్చి మిర్చి పెడుతుంది మీనా. అది చూసి షాక్ అవుతాడు బాలు. ఎందుకిలా పెట్టింది అని బాలు అంటే ఏమైనా గొడవ పడ్డారా అని రాజేష్ అడుగుతాడు. మీనా కాల్ చేసింది, తాను అరిచింది బాలు చెబుతాడు.
వాళ్లు వండింది ఎలా ఉందో వాళ్లకు చెబితే సంతోషిస్తారు. అది నువ్వు చేయలేదు దాని ఎఫెక్టే ఇది. ఇవాళ నీకు కాళరాత్రే అని రాజేష్ అంటాడు. మీనా గాయం మానాలంటే ఏం చేయాలని బాలు అడిగితే.. ఏదో ఒకటి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేయాలి అని రాజేష్ చెబుతాడు. దాంతో నాకో ఐడియా వచ్చిందని బాలు వెళ్లిపోతాడు. మరోవైపు కామాక్షితో ప్రభావతి మాట్లాడుతుంది.
జీవితం మీద ఆశ చచ్చిపోయింది. డ్యాన్స్ స్కూల్ పెట్టాను. కానీ, ఎవరు రావట్లేదు అని ప్రభావతి అంటే.. కామాక్షి ఐడియా ఇస్తుంది. మొదటి నెల ఫ్రీ అని చెబుతాం. భరతనాట్యానికి డ్రెస్ కావాలి కదా. అది మనం బయట తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ రేటుకు అమ్మేద్దాం అని కామాక్షి చెబుతుంది. చాలా బాగుందని ప్రభావతి మెచ్చుకుంటుంది.
మంచి రోజు
ఈరోజు ఏకాదశి మంచి రోజు షాపింగ్‌కు వెళ్దామని ప్రభావతి అంటుంది. మరోవైపు ఏడేళ్ల బాబుకు బట్టలు చూపించమని షాపింగ్ మాల్‌లో రోహిణి అడుగుతుంది. అక్కడికే ప్రభావతి, కామాక్షి వెళ్తారు. భరత నాట్యం డ్రెస్సుల గురించి అడుగుతారు. చింటూకి వీడియో కాల్ చేసి బట్టలు చూపిస్తుంది రోహిణి. నీకు ఏది నచ్చితే అది తీసుకురా అని చింటూ చెబుతాడు.
భరత నాట్యం డ్రెస్సులు తీసుకుంటారు ప్రభావతి, కామాక్షి. కౌంటర్ దగ్గరికి వెళ్తారు. అక్కడికే రోహిణి కూడా వస్తుంది. ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. పిల్లలకు భరత నాట్యం డ్రెస్సుల గురించి చెప్పిన ప్రభావతి నువ్వేంటీ ఇలా వచ్చావని అడుగుతుంది. నా క్లయింట్‌కు డ్రెస్ తీసుకుందామని వచ్చానని రోహిణి చెబుతుంది.
ఇంతలో సేల్స్ మెన్ వచ్చి మీ కొడుక్కి మంచి బట్టలు తీసుకున్నారు అని కౌంటర్ దగ్గర పెడతాడు. అది విని షాక్ అయిన ప్రభావతి నా కోడలుకు పిల్లలే లేరు కొడుకు అంటావేంటీ అని నిలదీస్తుంది. అతనేదే కన్‌ఫ్యూజ్ అయి అన్నాడు. మీరు వెళ్లండి అని అతన్ని పంపిస్తుంది రోహిణి. రోహిణి కొన్న బట్టలకు పది వేలు అవుతుంది. ప్రభావతి షాక్ అవుతుంది.
చింటు బర్త్ డే
వాళ్లు చాలా రిచ్ కస్టమర్స్. ఎప్పుడు ఇలాగే కొంటారు. మీ బిల్ ఎంత అయిందో చెప్పండి నేను కడతాను అని రోహిణి అంటుంది. ప్రభావతి సరే అంటుంది. అసలే డబ్బులు తక్కువ ఉన్నాయి. వీళ్ల కంట్లో పడ్డాను అనుకుంటుంది రోహిణి. మరోవైపు మీనాను బాలు పిలిస్తే కోపంగా ఉంటుంది మీనా. ఇవాళ బయటే తిన్నాను అని బాలు అంటే.. ఈ క్యారియర్ ఓపెన్ చేయలేదా అని మీనా అంటుంది.
లేదని, నీకోసం చీర తీసుకొచ్చాను అని ఇస్తాడు బాలు. బీట్ రూట్ దోశ గురించి, ఐదు వందల పందెం గురించి మొత్తం చెబుతుంది మీనా. మిమ్మల్ని నమ్మినందుకు ఐదు వందలు నష్టం అని మీనా కోపంగా వెళ్లిపోతుంది. నువ్వు బయటకు రాకుంటే నేను వెళ్లిపోతా అని బాలు బెదిరిస్తాడు. ఇంతలో బాలు తెచ్చిన చీర కట్టుకుని కిందకు వస్తుంది మీనా.
అది చూసి ఫ్లాట్ అయిపోతాడు బాలు. షోకేజ్ బొమ్మలా ఉన్నావు. రెండు పెగ్గులు వేస్తే వచ్చే కిక్కులా ఉన్నావ్ అని బాలు అంటాడు. చింటు దగ్గరికి రోహిణి వెళ్తుంది. చింటూ బర్త్ డే కావడంతో అక్కడికి బాలు, మీనా కూడా వెళ్తారు. దాంతో రోహిణి చిక్కుల్లో పడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


