గుండె నిండా గుడి గంటలు: మనోజ్‌కు సంతాన సమస్యలు- రోహిణి గతం తెలుసుకోమన్న ప్రభావతి- చెకప్‌తో బయటపడిన నిజం- కోడలిపై నిఘా

గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి తల్లి కాబోతుందని మీనా స్వీట్స్ పంచుతుంది. కానీ, రోహిణి ప్రెగ్నెంట్ కాదని చెబుతుంది. మనోజ్‌తో ఇద్దరం చెకప్ చేయికుందామని అడుగుతుంది. కానీ, మనోజ్ వినడు. నీకే సంతాన సమస్యలు ఉండొచ్చుగా అని రోహిణి అంటుంది. అది విన్న ప్రభావతి కోప్పడుతుంది.

Published on: Jan 10, 2026, 05:40:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో డిగ్రీలో క్లాస్ టాపర్ వచ్చిన సుమతి అక్క మీనాతో కలిసి మెటర్నిటీ హాస్పిటల్‌లో అకౌంటెంట్ జాబ్ కోసం వెళ్తుంది. అక్కడికే రోహిణి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం చెకప్‌కు వస్తుంది. పూల ఆర్డర్ వచ్చిందని మీనా వెళ్లిపోతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

సుమతి జాబ్ వచ్చిందని

హాస్పిటల్‌లో రోహిణిని సుమతి చూస్తుంది. ఇంటర్వ్యూ తర్వాత అక్క మీనాకు కాల్ చేసి తనకు జాబ్ వచ్చిందని, ఆరు నెలల తర్వాత పర్మనెంట్ చేస్తారని చెబుతుంది సుమతి. దాంతో మీనా తెగ సంతోషిస్తుంది. తర్వాత మెటర్నిటీ హాస్పిటల్‌కు రోహిణి కూడా వచ్చిందని, తనను చూశానని సుమతి చెబుతుంది.

అది ప్రసవం కోసం వచ్చే హాస్పిటల్ కదా అని మీనా అంటుంది. ఏమో తెలియదు, నేను మాట్లాడిద్దామనుకునేసరికే ఇంటర్వ్యూకి పిలిచారు. వెళ్లాను అని సుమతి చెబుతుంది. ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత అక్కడికి రోహిణి ఎందుకు వెళ్లింది, రోహిణి ప్రెగ్నెంట్ అయిందా, ప్రసవం గురించి తెలుసుకోడానికి వెళ్లిందా అని మీనా అనుకుంటుంది.

కచ్చితంగా రోహిణి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని స్వీట్స్ కొంటుంది మీనా. ఇంటికి వెళ్లి ఇంట్లో అందరిని పిలుస్తుంది మీనా. ప్రభావతి వచ్చి సెటైర్లు వేస్తుంది. మీ చెల్లి పాస్ అయినంత మాత్రాన ఇంత హడావిడి చేయాలా అని ప్రభావతి అంటుంది.

తలెత్తుకునేలా చేసిందంటూ

పాస్ మాత్రమే కాదు తనకు జాబ్ కూడా వచ్చింది అని మీనా చెబుతుంది. దానికి సత్యం చాలా సంతోషిస్తాడు. ఇలా పాస్ అయింది అలా జాబ్ తెచ్చుకుంది అని సుమతిని పొగుడుతాడు. బాలు కూడా చాలా సంతోషిస్తాడు. చిన్న పూలగంప మీ అందరిని తలెత్తుకునేలా చేసింది. మీ అమ్మకు కష్టం తీరినట్లే అని బాలు అంటాడు.

ఇంతలో రోహిణి వస్తుంది. రోహిణికి, మనోజ్‌కు స్వీట్స్ ఇస్తుంది. అసలు విషయం ఏంటో ముందు చెప్పు మీనా అని రోహిణి అంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా రోహిణి అని మీనా అంటుంది. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. అమ్మా రోహిణి నువ్వు తల్లివి కాబోతున్నావా. ఒక్క మాట కూడా చెప్పలేదు అని ప్రభావతి అంటుంది.

నేను ప్రెగ్నెంట్ కాదు అని రోహిణి ఈసడింపుగా చెబుతుంది. మరి ఇవాళ డెలివరి చేసే హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లావ్ అని మీనా అడుగుతుంది. నీకెలా తెలుసు అని రోహిణి అంటే సుమతి చూసింది. సుమతి జాబ్ కోసం వచ్చిన విషయం చెబుతుంది మీనా. అలా చెకప్‌తో రోహిణి నిజం బయటపడుతుంది.

మనోజ్‌కు సంతాన సమస్యలు

నేను కన్సీవ్ అవ్వట్లేదు కదా. ఏదైనా సమస్య ఉందేమో అని చెక్ చేయించుకోడానికి వెళ్లాను. ఏం సమస్య లేదని డాక్టర్ చెప్పిందని రోహిణి అసలు విషయం చెబుతుంది. కొన్ని క్షణాల్లో నా ఆశలన్నింటిని అడియాసల్ని చేసింది నీ పెళ్లాం అని ప్రభావతి అంటుంది.

తర్వాత మనోజ్‌తో మన ఇద్దరం వెళ్లి చెకప్ చేయించుకుందామా అని రోహిణి బతిమిలాడుతుంది. కన్సీవ్ కానిది నువ్వు. నేనెందుకు చెకప్ చేయించుకోవాలని మనోజ్ అంటాడు. నీ మాజీ లవర్‌తో నువ్వు లివింగ్ రిలేషన్‌షి‌ప్‌లో ఉన్నావు కదా. మరి అప్పుడు తను కన్సీవ్ అయిందా. అంటే నీ లోపల సంతాన సమస్యలు ఉన్నాయ్ కాబట్టే కాలేదేమో అని మనోజ్‌ను నిలదీస్తుంది రోహిణి.

ఆ మాటలు ప్రభావతి వింటుంది. రోహిణిపై కోప్పడుతుంది. మనోజ్‌ క్యారెక్టర్ గురించి మాట్లాడి ఎందుకు అవమానిస్తున్నావ్. నువ్వు విదేశాల్లో ఉన్నావుగా. మరి నిన్ను మేము అవమానించామా అని ప్రభావతి అంటుంది. దాంతో సైలెంట్ అవుతుంది రోహిణి.

రోహిణి గతంపై ప్రభావతి ఆరా

తర్వాత కొడుకు మనోజ్‌తో ప్రభావతి మాట్లాడుతుంది. రోహిణి గర్భవతి కావట్లేదు అంటే పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకు తెలియదు కదా. తను నీ దగ్గర ఏదో దాస్తుందనిపిస్తుంది అని డౌట్‌గా చెబుతుంది ప్రభావతి.

వెంటనే రోహిణి గతమేంటో తెలుసుకో అని, ఆరా తీయమని మనోజ్‌కు చెబుతుంది తల్లి ప్రభావతి. కోడలిపై అత్త ప్రభావతి, భర్త మనోజ్ నిఘా పెట్టడంతో చింటును ఇక్కడికి తీసుకొచ్చి చూసుకోవాలనే రోహిణి ఆశలు గల్లంతు అవుతాయి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More