గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పుట్టింటికి మౌనిక- రవి, సుమతి సరసాలు- ప్రభావతి నగల మోసం బయటపెట్టిన శ్రుతి తల్లి శోభ

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 11 ఎపిసోడ్‌లో పుట్టింటికి మౌనిక వస్తుంది. సుశీలకు రోహిణి మేకప్ వేస్తుంది. రోహిణి తల్లిదండ్రుల గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంది సుశీల. పంతుల్లు వచ్చి పూజ చేస్తారు. శ్రుతి తల్లి ఇంటికి వస్తుంది. ఇంట్లో రవి, సుమతి సరసాలు ఆడుతారు. మీనా నగలు రోడ్ గోల్డ్ అని శోభన అంటుంది.

Published on: Nov 11, 2025, 08:38:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో పుట్టింటికి వెళ్లడానికి మౌనికకు అత్త పర్మిషన్ ఇస్తుంది. కారు వరకు వదిలిపెట్టిన అత్తతో మౌనిక ఎందుకు మాటిచ్చారంటుంది. సంజు రాత్రి వరకు రానన్నాడు. అప్పటిలోపు వచ్చేసేయ్ అని మౌనికకు చెబుతుంది అత్త. దాంతో రవి వాళ్లతో మౌనిక వెళ్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌

కన్న కొడుకు ప్రేమ చూపించావా

మరోవైపు బాలును ఏమన్నావ్ అని ప్రభావతిని నిలదీస్తుంది సుశీల. నాకేం తెలుసు అని ప్రభావతి అంటుంది. ఏనాడైనా కన్న కొడుకు అనే ప్రేమ చూపించావా అని తిడుతుంది సుశీల. ఇంతలో రవి వాళ్లు వస్తారు. మౌనిక రావడంతో అంతా సంతోషిస్తారు. సుశీలను హగ్ చేసుకుంటుంది మౌనిక. మౌనికకు నానమ్మ పుట్టినరోజు గురించి చెప్పకపోవడం గురించి మాట్లాడుకుంటారు.

మౌనికకు కాల్ చేయమని ప్రభావతికి చెప్పినట్లు సత్యం చెబుతాడు. దీపావళికే రాలేదని చేయలేదంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి వచ్చి సుశీలకు మేకప్ వేస్తానంటుంది. సుశీల వద్దంటుంది. అందరు చెప్పడంతో సుశీల ఒప్పుకుంటుంది. మౌనికతో మీనా మాట్లాడుతుంది. సంజుకు తెలియదని, అత్త పంపించిందని చెబుతుంది మౌనిక. సుశీలకు రోహిణి మేకప్ చేస్తుంది.

రోహిణి తండ్రి గురించి మాట్లాడుతుంది సుశీల. అందరిని చూశాను కానీ మీ నాన్ననే చూడలేదంటుంది. తల్లి గురించి అడుగుతుంది. ఎప్పుడు చనిపోయిందని సుశీల అంటే 14 ఏళ్లప్పుడు అని రోహిణి చెబుతుంది. అయితే నీ దగ్గర ఫొటో ఉండే ఉంటుందిగా చూపించు అని సుశీల అంటుంది. ఈవిడేంటీ గుచ్చి గుచ్చి అడుగుతుంది. మేకప్ వేద్దామని తీసుకొచ్చి అనవసరంగా బుక్కయ్యాను అని రోహిణి అనుకుంటుంది.

ఏడుపు కంట్రోల్ చేసుకోలేను

అమ్మ నాన్న ఫొటో లేదని, ఊరి నుంచి వచ్చేటప్పుడు కోపంతో వచ్చానని చెబుతుంది రోహిణి. అమ్మను చూస్తే ఏడుపు కంట్రోల్ చేసుకోలేను అందుకే తెచ్చుకోలేదంటుంది. కాసేపు మీరు నోరు మూసుకుంటారా అని రోహిణి అంటుంది. ఏంటీ నోరు మూసుకోవాల. ఎక్కువ మాట్లాడుతున్నానా. మీవాళ్ల గురించి ఎక్కువ అడుగుతున్నానా అని సుశీల అంటుంది.

కాదు, లిప్‌స్టిక్ వేయాలంటుంది రోహిణి. మలేషియా మావయ్య గురించి అడుగుతుంది సుశీల. అన్నింటిని కవర్ చేస్తుంది రోహిణి. సుశీలకు మేకప్ సూపర్‌గా ఉందని మౌనిక అంటుంది. పాత సినిమాల్లో హీరోయిన్‌లా ఉన్నావంటుంది మౌనిక. ముగ్గురు సెల్ఫీ తీసుకుంటారు. బామ్మను చూసి అంతా ఆశ్చర్యపోతారు. అంతా బాగున్నావని మెచ్చుకుంటారు.

ప్రపంచంలో నాకు తెలిసిన అందమైన దేవత మా అమ్మే అని సత్యం అంటాడు. మా అమ్మ అందంగా కనిపించలేదా అని మనోజ్ అడుగుతాడు. ఎవరైనా సరే మా అమ్మ తర్వాతే అని సత్యం అంటాడు. సుశీలను మోడ్రన్ వేసుకోమ్మని శ్రుతి అంటుంది. చుడీదార్, జీన్స్ ప్యాంట్ కొనుక్కురావాలా అని రవి అంటాడు. ఇంతలో పంతుల్లు వస్తారు. మంత్రాలతో పూజ చేస్తారు పంతుల్లు.

మీ నాన్న కూడా ప్లాన్ చేస్తున్నారు

అమ్మ వారికి కట్టిన చీరను సుశీలకు ప్రదానం చేస్తారు పంతులు. తర్వాత సుశీల దగ్గర అంతా ఆశీర్వాదం తీసుకుంటారు. అందరూ సెల్ఫీలు తీసుకుంటారు. సత్యంకు రంగా కాల్ చేస్తే వెళ్లిపోతాడు. మనోజ్, ప్రభావతి పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. మనకు చెప్పకుండానే మీ నాన్న ఏదో ప్లాన్ చేస్తున్నారు ఆయనకు పెద్ద బహుమతి వస్తే నాకు వచ్చినట్లేగా అని ప్రభావతి అంటుంది.

మీనా వంట చేస్తుంటే వెళ్లి రెడీ అవ్వమంటుంది సుశీల. ఆయనొచ్చాక అవుతానంటుంది మీనా. బాలు గురించి అడుగుతుంది సుశీల. తర్వాత సత్యం ఇంటికి శ్రుతి తల్లి శోభన వస్తుంది. సుశీలకు బర్త్ డే విషెస్ చెబుతుంది. రవితో మీనా చెల్లెలు సుమతి సరదాగా ఉంటుంది. ఇద్దరు బావమరదల్లా సరసాలు ఆడుతారు. అదంతా చూసి ప్రభావతి కోప్పడుతుంది.

బయటపడిన ప్రభావతి మోసం

ఏం మీనా మీ ఆయన ఇంకా నగలు చేయించలేదా. రోడ్ గోల్డ్ నగలే పెట్టుకున్నావని ప్రభావతి మోసం బయటపెడుతుంది శోభన. అవి బంగారు నగలే అని ప్రభావతి అంటే అసలు నగలకు నాకు తేడా తెలియదా అని శోభన అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More