గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సుశీల ఆఖరి కోరిక- మీనాను నగల గురించి అడిగిన బామ్మ- వణికిపోయిన ప్రభావతి, మనోజ్
గుండె నిండా గుడి గంటలు నవంబర్ 10 ఎపిసోడ్‌లో సుశీలను వీడియో తీస్తుంది మీనా. తన ముగ్గురు చిన్ననాటి ఫ్రెండ్స్ గురించి చెబుతు వాళ్లను కలవడమే తన ఆఖరి కోరిక అని ఏడుస్తుంది. మౌనికను ఇంటికి రమ్మంటారు రవి, శ్రుతి. మీనా నగల గురించి సుశీల అడిగితే అవి డూప్లికేట్ అని బయటపడతాయేమోనని ప్రభావతి, మనోజ్ భయపడతారు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షిని టీవీ అడుగుతుంది ప్రభావతి. అది ఇవ్వడానికి ఒప్పుకుంటుంది కామాక్షి. మరోవైపు సుమతి ఫోన్ తీసుకొచ్చి మీనాకు ఇస్తుంది. కవరింగ్ నగల గురించి తెలిసింది అసలు ఏమైందని మీనాను అడుగుతుంది సుమతి.

కవరింగ్ నగల గురించి
ఇంట్లో నగలు తీసుకెళ్తే వాళ్లు కవరింగ్‌వి అన్నారు. అవి కవరింగ్ నగలు కాదని మీ బావ గట్టిగా చెప్పాడు. పెద్ద గొడవ కాదులే అని మీనా అంటుంది. మీ నగలు మీ అత్త దగ్గర ఉన్నాయి. అవే తీసుకెళ్లారు. వాటినే కవరింగ్ అంటున్నారు అంటే ఏదో జరిగింది అని సుమతి అంటుంది. అవన్నీ నీకు అవసరం లేదు. ఇది మా ఇంటి విషయం. నీకు తెలియద్దు. ఇంట్లో అమ్మకు చెప్పకు అని సుమతిని పంపించేస్తుంది మీనా.
రేపే ఊరికి వెళ్తానని సుశీల చెబితే సత్యం నిరుత్సాహపడతాడు. సత్యం, సుశీల సంతోషంగా మాట్లాడుకుంటుంటే మీనా వచ్చి వీడియో తీస్తుంది. పుట్టినరోజు అంతా వీడియో తీసి అమ్మమ్మకు పంపిస్తానని మీనా చెబుతుంది. ప్రభావతి వచ్చి అత్తకు మర్యాదలు చేయడానికి చూస్తుంది. ఇంత మార్పు జీర్ణం కాదని సత్యం అంటాడు. ఏదైనా మాట్లాడండి అని సుశీలను మీనా అంటుంది.
వీడు నా కొడుకు అని సత్యంను చూపిస్తూ సుశీల మాట్లాడుతుంటే ప్రభావతి వస్తుంది. వీడియోలో పట్టవు. పక్కకు జరుగు అని సుశీల అంటుంది. తీయవే తీయు. ఈయనో బాహుబలి, ఆమె రాజమాత అని ప్రభావతి అంటుంది. నువ్వు దేవసేనవా అని సుశీల అంటుంది. దాంతో మీనా, సత్యం నవ్వుతారు. సుశీలను ఒంటరిగా వీడియో తీస్తానని మేడపైకి తీసుకెళ్తుంది మీనా.
మీనా, బాలు శపథం
అక్కడ ఇటుకలు చూసి ఏమైందని సుశీల అంటుంది. దాంతో బాలు, తాను రూమ్ కట్టించే శపథం గురించి చెబుతుంది మీనా. తన నగలు అమ్మి సహాయం చేస్తానని సుశీల అంటే మీనా వద్దంటుంది. ఆయన కష్టార్జీతంతోనే కట్టుకుంటేనే మాకు గౌరవం అని మీనా అంటుంది. సుశీల తీపి జ్ఞాపకాల గురించి చెప్పమని మీనా అంటుంది. అవి చిన్నప్పుడే ఉండేవి అని తన చిన్ననాటి ఫ్రెండ్స్, ఆ జ్ఞాపకాలు చెబుతుంది సుశీల.
తన ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేరని, ఇప్పుడు అంతా దూరమయ్యారని, వాళ్లను కలుసుకోవాలని ఉందని, నా ఆశ తీరేదెలా, నా ఆఖరి కోరిక తీర్చెదెవరు అని ఎమోషనల్ అవుతూ చెబుతుంది సుశీల. అదంతా మీనా వీడియో తీసిన మీనా ఓదారుస్తుంది. మరోవైపు మౌనిక గుడికి వెళ్తానంటుంది. దానికి సంజు నానా మాటలు అంటాడు.
గుడికి వెళ్లేటప్పుడు మొగుడు పర్మిషన్ తీసుకోవాలని ఇంట్లో వాళ్లు నేర్పించలేదా అని తిడతాడు సంజు. ఇంతలో సంజు తల్లి వచ్చి కవర్ చేస్తుంది. సరే మీకు చెప్పే వెళ్తాను అని మౌనిక అంటుంది. అది నా కంట్రోల్‌లోనే ఉంది. నువ్వే నీ కోడలిని చెడగొడుతున్నావంటాడు సంజు. రాత్రి రానని, ఫామ్ హౌజ్‌కు వెళ్తున్నట్లు సంజు చెప్పి వెళ్లిపోతాడు.
బాలు తాగడంపై డౌట్
మరోవైపు బాలు ఎంతకీ ఇంటికి రాలేదేంటని, కాల్ చేసిన తీయట్లేదని మీనాను అడుగుతాడు సత్యం. దాంతో మీనా కాల్ చేస్తుంది. అయినా బాలు కాల్ లిఫ్ట్ చేయడు. ఇంతలో ప్రభావతి వచ్చి వాడు వాళ్ల నానమ్మ పేరు చెప్పి సంతోషంగా తాగుతుంటాడు. రేపు పొద్దున్నే తూలుతూ వచ్చి పడిపోతాడు చూడు అని ప్రభావతి అనేసి వెళ్లిపోతుంది.
మా అమ్మ పుట్టినరోజు నాడు అమ్మ బాధపడేటట్టు ఏ గొడవ జరకూడదు. బాలు ఏమైనా మందు తాగేసి అని సత్యం అంటుంటే.. మీనా కంగారుగా చూస్తుంది. లేదులేమ్మా మంచిగానే వస్తాడు అని సత్యం వెళ్లిపోతాడు. అమ్మమ్మ గారికి చైన్ కొనివ్వలేదనే బాధలో మందు తాగేసి వస్తారా. లేదు అని మీనా కూడా డౌట్ పడుతుంది. మరోవైపు రాజేష్‌తో కలిసి బాలు ఎవరిన వెతుకుతుంటాడు.
మీనా కాల్ చేసిందని, పని అయ్యాకే మళ్లీ చేస్తానని అంటాడు. మరోవైపు గుడిలో శ్రుతి, రవికి మౌనిక కనిపిస్తుంది. సంతోషంగా అంతా మాట్లాడుకుంటారు. నానమ్మ బర్త్ డే అని మౌనికకు చెబుతారు రవి, శ్రుతి. మౌనికను కూడా రమ్మని, సర్‌ప్రైజ్ చేసినట్లు ఉంటుంది అని శ్రుతి. వద్దులే పని ఉందని మౌనిక అంటుంది. మౌనికను ఒక్కరోజు రమ్మని బతిమిలాడుతారు.
డూప్లికేట్ నగల నిజం
దాంతో సంజు తల్లి మౌనిక వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. కానీ, మౌనిక మాత్రం భయపడుతుంది. తర్వాత సుశీల బర్త్ డేను గ్రాండ్‌గా చేయిస్తారు. పంతులతో పూజ చేయిస్తారు. మీనా మెడలో నగలు లేకపోవడంతో వేసుకుని రమ్మని సుశీల చెబుతుంది. ఇప్పుడు ఆ నగలు డూప్లికేట్‌వి అని నానమ్మ కనిపెట్టేస్తుందేమో అని మనోజ్, ప్రభావతి భయపడతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














