ఐపీఎల్ 2026 ఆడనున్న ధోనీ.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. సంజూ శాంసన్ కోసం ట్రై చేస్తున్న ఫ్రాంఛైజీ

ఎమ్మెస్ ధోనీ మరో సీజన్ కూడా ఐపీఎల్లో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ శుక్రవారం (నవంబర్ 7) కన్ఫమ్ చేశారు. అంతేకాదు ఆ ఫ్రాంఛైజీ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది.

Published on: Nov 7, 2025, 21:42:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ధృవీకరణ వచ్చేసింది. సీఎస్కే టీమ్‌ తరఫున రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌లో ఎమ్మెస్ ధోనీ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ధోనీ తమకు తెలియజేశాడని ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్వయంగా ధృవీకరించారు. “ఎంఎస్ ధోనీ తదుపరి సీజన్‌కు తాను అందుబాటులో ఉంటానని మాకు చెప్పారు” అని కాశీ విశ్వనాథన్ Cricbuzzతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

ఐపీఎల్ 2026 ఆడనున్న ధోనీ.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. సంజూ శాంసన్ కోసం ట్రై చేస్తున్న ఫ్రాంఛైజీ (REUTERS)
ఐపీఎల్ 2026 ఆడనున్న ధోనీ.. కన్ఫమ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. సంజూ శాంసన్ కోసం ట్రై చేస్తున్న ఫ్రాంఛైజీ (REUTERS)

మరో సీజన్ ఆడనున్న ధోనీ

ఐపీఎల్ 2025లో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. ధోనీ స్వయంగా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన ఈ వికెట్ కీపర్-బ్యాటర్, జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు.

ముఖ్యంగా ఆ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్ స్థానం కూడా చర్చనీయాంశమైంది. అతడు రెండు సార్లు ఏకంగా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్ నిషేధానికి గురైన రెండు సీజన్‌లు మినహా తన కెరీర్ మొత్తం సీఎస్కేతోనే ఉన్నాడు.రాబోయే ఐపీఎల్ సీజన్ ధోనీకి సీఎస్కే తరఫున 17వ సీజన్ కాగా, మొత్తం మీద 19వ ఐపీఎల్ సీజన్ అవుతుంది. ధోనీ సీఎస్కే తరఫున ఇప్పటివరకు 248 మ్యాచ్‌లు ఆడి 4,865 పరుగులు సాధించాడు. 2010, 2011, 2018, 2021, 2023లో ఫ్రాంఛైజీకి ఐదు టైటిల్స్ అందించాడు.

సంజు శాంసన్ ట్రేడింగ్

రాజస్థాన్ రాయల్స్‌ ఫ్రాంఛైజీకి సంజు శాంసన్ దూరం కావాలని అనుకుంటున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ భారత వికెట్ కీపర్-బ్యాటర్ పై ఢిల్లీ క్యాపిటల్స్‌ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే Cricbuzz రిపోర్టు ప్రకారం సంజు శాంసన్ ట్రేడ్‌పై సీఎస్కే ఫ్రాంఛైజీ.. రాజస్థాన్ రాయల్స్ మళ్లీ సంప్రదింపులు ప్రారంభించింది.ఈ ట్రేడింగ్ డీల్‌లో సీఎస్కే నుంచి ఒక టాప్ ప్లేయర్ కూడా ఉండే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో సహా అనేక ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నారు.మరోవైపు చెన్నై ఫ్రాంఛైజీ కూడా తమ జట్టులోని ఒక ముఖ్య ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న విషయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ ట్రేడింగ్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిటెన్షన్స్ ప్రకటించడానికి చివరి గడువు నవంబర్ 15 కాగా.. ఐపీఎల్ 2026 ఎడిషన్‌కు ముందు మినీ వేలం డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More