గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నేను లేకుంటే దిక్కు లేదా- అత్తపై మీనా చిందులు- ఊహించని బహుమతితో బామ్మ బర్త్ డే ఆఫర్

గుండె నిండా గుడి గంటలు నవంబర్ 6 ఎపిసోడ్‌లో బాలు కోపంగా ఉంటాడు. అవి ఆకలి కేకలు అని మీనా కవర్ చేస్తుంది. ఎక్కడ ఉరేగావ్ అని ప్రభావతి అంటే రివర్స్ అవుతుంది మీనా. నేను లేకుంటే దిక్కు లేదా. వంట చేసుకోలేరా అని చిందులు తొక్కుతుంది మీనా. సత్యం కుటుంబానికి బహుమతి ఆఫర్ ప్రకటిస్తుంది సుశీల.

Published on: Nov 6, 2025, 08:36:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనా ఇంటికి వస్తారు. అమ్మమ్మ వెళ్లేవరకు ఏ గొడవ చేయరని మాటిచ్చారని మీనా అంటుంది. ఎక్కడికెళ్లారని రవి అడిగితే.. ప్రభావతి కడుపున పుట్టడం గురించి మాట్లాడుతాడు బాలు. ఇప్పటిదాకా ఎక్కడ ఊరేగావే అని ప్రభావతి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌

మీకు చేతకాదా

నా ఇష్టం. నా మొగుడితో కలిసి ఎక్కడైనా ఊరేగుతా అని మీనా ఎదురుతిరుగుతుంది. వంట ఎవరు చేస్తారు అని ప్రభావతి అంటే.. మీకు చేతులు లేవా. మీకు చేతకాదా. నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా. నేను లేకుంటే దిక్కు లేదా అని మీనా వరుసపెట్టి వాయించేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

మనోజ్‌ను బెలూన్స్ ఊదమంటే బుగ్గలు నొప్పి పెడతాయ్ అని అంటాడు. అన్ని నొప్పి పెడతాయిరా నీకు అని బాలు బెలూన్ ఊది ఊది పగిలేలా చేస్తాడు. కాఫీ పెట్టమంటారా అని మీనా అడిగితే.. అగ్ని పర్వతాన్ని నీళ్లతో ఆపలేవని బాలు అంటాడు. ఏమైందమ్మా అని సత్యం అంటాడు. ఆకలి అగ్ని పర్వతంలా రగులుతుందంటున్నారు. కోపంతో ఆకలి కేకలు పెడుతున్నారు అని మీనా చెబుతుంది.

ముందే రావాల్సింది అని సత్యం అంటే.. గుడికి వెళ్లి అమ్మ పేరున పూజ చేశాం. రెండు రోజుల తర్వాత అభిషేకం చేస్తాను అని బాలు కోపంగా వెళ్లిపోతాడు. వంటలో హెల్ప్ చేయనా అని రవి అంటే.. వద్దని, బాగా మండుతోంది. మంట నేనే పెడతాను, వంట నేనే చేస్తాను అని మీనా వెళ్లిపోతుంది. మరోవైపు బాలు గురించి మనోజ్ భయపడుతుంటాడు.

నీ వల్లే స్కూల్‌కు వెళ్తున్నా

ఇంతలో రోహిణికి తల్లి కాల్ చేస్తుంది. కానీ, చింటు మాట్లాడుతాడు. తనకు మ్యాథ్య్‌లో 92 మార్కులు వచ్చాయని, ఇంతకుముందు 50 మాత్రమే వచ్చేవని, నువ్వు అమ్మవని తెలిసాకే స్కూల్‌కు జాలీగా వెళ్తున్నట్లు, నీవల్లే మార్క్స్ తెచ్చుకున్నాను అని చెబుతాడు చింటు. నిన్ను చూడాలని ఉందని చింటు అంటాడు. అమ్మ కొంచెం బిజీగా ఉందని, త్వరలో వస్తాను బంగారం అని కాల్ కట్ చేస్తుంది రోహిణి.

ఇంతలో బాత్రూమ్ నుంచి మనోజ్ వస్తాడు. బంగారం, బుజ్జి కన్నా అంటున్నావేంటని అడుగుతాడు. ఫ్రెండ్ పేరు బుజ్జి.. ఇలాగే పిలుస్తామంటుంది రోహిణి. మరి నన్ను పిలవాలనిపించలేదా అని మనోజ్ అంటే.. నీ పేరు స్టైల్‌గా ఉంటుంది. మను, బావ అని పిలవాలని ఉంటుందని మనోజ్ చేయి పట్టుకుని రొమాంటిక్‌గా చెబుతుంది రోహిణి. ఇప్పుడు బంగారం అని పిలుస్తానని రోహిణి అంటుంది.

నేను బుజ్జి కన్నా అని పిలుస్తానని మనోజ్ అంటాడు. అమ్మమ్మకు ఏదో ఒకటి కొనిద్దామంటే వద్దని మనోజ్ అంటాడు. కనీసం చీర అయిన కొందామంటే సరే అంటాడు మనోజ్. మరోవైపు పుట్టింటికి కాల్ చేసి సుశీల 75వ బర్త్ డే గురించి రమ్మంటుంది మీనా. సత్యం కాల్ చేశాడని చెబుతుంది పార్వతి. బాలు కూడా రమ్మని పిలుస్తాడు. పెద్దావిడ పుట్టినరోజుకు ఏం పెట్టమంటావే అని పార్వతి అడిగితే మీకు తోచింది పెట్టమని మీనా చెబుతుంది.

ఏం చేయలేకపోతున్నా

సుమతి, పార్వతి ఇద్దరమే ఫంక్షన్‌కు వెళ్దామని, చీర కొనిద్దామని, పళ్లు పూలు పెడదామని మాట్లాడుకుంటారు. మనోజ్ గాడి వల్ల ఏం చేయలేకపోతున్నామని బాలు అంటే.. అది కాకుండా అమ్మమ్మ గుర్తు పెట్టుకునేలా చేయమని చెబుతుంది మీనా. మరుసటి రోజు సుశీలను కారులో తీసుకొస్తాడు బాలు. బాలు అదోలా ఉండటంతో సుశీల అడుగుతుంది.

రాత్రంతా డ్రైవింగ్ వెళ్లాలని అబద్ధం చెబుతాడు బాలు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగుతుంది. పక్కన ఒకావిడ బైక్‌పై నగలు వేసుకుని కనిపిస్తుంది. ఈ ఊరు బాగా డబ్బున్నోళ్ల ఊరు అయిపోయిందంటుంది సుశీల. అవి గిల్ట్ నగలా, నిజంగా బంగారు నగలా అని సుశీల అంటుంది. కనిపెట్టాలని బాలు అంటాడు. ఊరికే అన్నారా అని సుశీల అంటుంది.

మరోవైపు ప్రభావతిని నువ్వు మంచి కూతురువి కాదు, తల్లివి కాదు, అత్తవి కాదు, కోడలివి కాదు. ఏదో జనాభా లెక్కల్లో పడి ఉన్నావని సత్యం కోప్పడుతాడు. ఇంతలో సుశీలను బాలు తీసుకొస్తాడు. మీనా హారతి రెడీ చేస్తే ప్రభావతి ఏదోటి అంటుంది. మీనా పంచ్‌లు వేస్తుంది. రోహిణిని హారతి ఇవ్వమంటుంది ప్రభావతి. కానీ, ముగ్గురితో హారతి తీయించుకుంటుంది సుశీల.

సుశీల ఆఫర్

సుశీలకు పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా చేసి మీనా సర్‌ప్రైజ్ ఇస్తుంది. ఎవరైతే తన మనసుకు బాగా నచ్చిన బహుమతి ఇస్తారో వారికి ఊహించని బహుమతి ఇస్తానని ఆఫర్ ఇస్తుంది సుశీల. ఇంట్లో అందరూ సుశీలకు ఏది ఇష్టమో అని ఎవరికి వారు ప్లాన్స్ వేసుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More