వీధుల్లో వేధింపులపై మాట్లాడిన ఐశ్వర్య రాయ్.. అది మీరు వేసుకునే డ్రెస్సు, లిప్ స్టిక్ తప్పు కాదంటూ..

ఐశ్వర్య రాయ్ వీధుల్లో వేధింపులపై మాట్లాడింది. అది ఓ అమ్మాయి వేసుకునే డ్రెస్సు లేదంటే లిప్ స్టిక్ తప్పు కాదని ఆమె అనడం గమనార్హం. ఈ వేధింపుల భారం ఎప్పుడూ ఓ మహిళపై ఉండకూడదని ఆమె స్పష్టం చేసింది.

Published on: Nov 27, 2025, 15:17:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటి ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ తన మనసులో మాట చెప్పడానికి వెనుకాడదు. ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే అంశాల విషయానికి వస్తే ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తాజాగా వీధుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులపై ఐశ్వర్య గట్టిగా గళం విప్పింది. ఈ సమస్యకు సంబంధించిన భారం మహిళపై, ఆమె వేసుకునే దుస్తులు, పెట్టుకునే లిప్‌స్టిక్ పై ఎప్పుడూ వేయకూడదని ఆమె అనడం విశేషం.

వీధుల్లో వేధింపులపై మాట్లాడిన ఐశ్వర్య రాయ్.. అది మీరు వేసుకునే డ్రెస్సు, లిప్ స్టిక్ తప్పు కాదంటూ.. (AFP)
వీధుల్లో వేధింపులపై మాట్లాడిన ఐశ్వర్య రాయ్.. అది మీరు వేసుకునే డ్రెస్సు, లిప్ స్టిక్ తప్పు కాదంటూ.. (AFP)

ఐశ్వర్య రాయ్ ఏమన్నదంటే?

లోరియాల్ పారిస్ (L'Oreal Paris) స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాయ్ వీధుల్లో వేధింపుల గురించి మాట్లాడింది. ఆమె ఒక దశాబ్దానికి పైగా ఈ బ్యూటీ బ్రాండ్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ సమస్యను ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఎవరూ వెనుకాడకూడదని ఆమె తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ విషయంలో ఐశ్వర్య తన స్పష్టమైన వైఖరిని తెలిపింది.

వీధుల్లో వేధింపులను మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారు అని ప్రశ్నించగా.. ఆమె ఇలా స్పందించింది. "కళ్లలోకి చూడకుండా ఉండొద్దు. నేరుగా కళ్ళలోకి చూడండి. మీ తల ఎత్తుకొని తిరగండి. ఫెమినైన్, ఫెమినిస్ట్. నా శరీరం, నా విలువ. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మీపై మీరు సందేహపడొద్దు. మీ విలువ కోసం నిలబడండి. మీ దుస్తులు లేదా మీ లిప్‌స్టిక్‌ తప్పు కాదు. వీధుల్లో వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదు" అని ఆమె బలంగా చెప్పింది.

సోషల్ మీడియా ప్రశంసలు

చాలా మంది మహిళలు తరచుగా ఎదుర్కొంటున్నా బహిరంగంగా చర్చించని ఈ సమస్యపై మాట్లాడినందుకు సోషల్ మీడియా యూజర్లు ఐశ్వర్యను ప్రశంసించారు. కామెంట్ల సెక్షన్‌లో ఆమెకు మద్దతు తెలిపారు. "వీధుల్లో వేధింపులు నిజం. దీని గురించి తగినంతగా మాట్లాడటం లేదు. ఈ సందేశం నచ్చింది" అని ఒకరు రాశారు. "యువతులు, మహిళలందరికీ ఇది శక్తివంతమైన సందేశం" అని మరొకరు అన్నారు. "గొప్ప ప్రోత్సాహం అమ్మాయిలారా" అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.

ఐశ్వర్య రాయ్ కెరీర్ ఇలా..

ఐశ్వర్య రాయ్ చివరగా మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రక యాక్షన్ డ్రామా 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2' చిత్రంలో కనిపించింది. విక్రమ్, రవి మోహన్, కార్తీ, త్రిష కృష్ణన్ వంటి నటులు కూడా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.344.63 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

ఈ సినిమాలో ఆమె నటనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో (SIIMA) ఉత్తమ నటి (క్రిటిక్స్ కేటగిరీ) అవార్డును గెలుచుకుంది. ఆమె భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఆమె నటనను ప్రశంసించారు. ఈ మధ్యే పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు వచ్చిన ఐశ్వర్య.. మంచి ప్రసంగం ఇవ్వడంతోపాటు ప్రధాని మోదీ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More