ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్.. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఘటన

ఐశ్వర్య రాయ్.. ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కిన వీడియో వైరల్ అవుతోంది. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు వచ్చిన ఆమె.. తన స్పీచ్ తర్వాత మోదీ కాళ్లకు దండం పెట్టడం గమనార్హం.

Published on: Nov 19, 2025, 18:57:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటి ఐశ్వర్య రాయ్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బుధవారం (నవంబర్ 19) నాడు పుట్టపర్తిలో జరిగిన ఈ వేడుకలలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె కులం, మతం, ప్రేమపై పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చింది. ప్రసంగం తర్వాత ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాదాలను తాకింది.

ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్.. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఘటన
ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్.. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఘటన

ఐశ్వర్య రాయ్ స్పీచ్ ఇలా..

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకల వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో సత్యసాయి బాబా సందేశాన్ని చెప్పింది. "ఒకే ఒక్క కులం ఉంది, అది మానవత్వం. ఒకే ఒక్క మతం ఉంది.. అది ప్రేమ అనే మతం. ఒకే ఒక్క భాష ఉంది.. అది హృదయం అనే భాష. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు.. ఆయన సర్వాంతర్యామి" అని ఐశ్వర్య చెప్పడం గమనార్హం.

తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత నటి ఐశ్వర్య రాయ్ వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి వినయపూర్వకంగా ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది. అది చూసి మోదీ కూడా వెంటనే ఆమెకు నమస్కరిస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అభిమానుల స్పందన

ఐశ్వర్య రాయ్ చేసిన ఈ పనిని అభిమానులు అభినందించారు. ఒక అభిమాని స్పందిస్తూ.. "ఒక కులం, ఒక మతం, ఒక దేవుడు అనే సత్యసాయి బాబా సందేశాన్ని ఐశ్వర్య రాయ్ ప్రతిధ్వనించడం ఈ యుగంలో అత్యంత ప్రభావవంతమైన ప్రసంగాలలో ఒకటి. గౌరవం, స్పష్టత, జ్ఞానం.. అన్నీ ఒకే ఫ్రేమ్‌లో" అని రాశారు.

మరొకరు స్పందిస్తూ.. "ఐశ్వర్య రాయ్ పీఎం మోదీ పాదాలను తాకడం.. కొన్ని క్షణాలకు హ్యాష్‌ట్యాగ్‌లు అవసరం లేదు.." అని అన్నారు. "సూపర్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సత్యసాయి బాబా శత జయంతి కార్యక్రమంలో పీఎం మోదీ పాదాలను తాకడం గొప్ప విషయం.. సంస్కారానికి కేరాఫ్ ఐశ్వర్య రాయ్" అని కొందరు కామెంట్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More