థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ.. 38 ఏళ్ల తర్వత కాంబో రిపీట్.. కమల్ హాసన్ మూవీకి ఊహించని టాక్.. మణిరత్నం డైరెక్షన్ అలా!

థగ్ లైఫ్ మూవీ ట్విట్టర్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీమియర్స్ చూసిన నెటిజన్స్ థగ్ లైఫ్ రివ్యూలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, త్రిష, శింబు, అభిరామి నటించిన ఈ మూవీ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదల కానుడంగా థగ్ లైఫ్ ట్విటర్ రివ్యూలోకి వెళితే..

Published on: Jun 5, 2025, 08:58:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇలా థగ్ లైఫ్ మూవీపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్, శింబు యాక్టింగ్ అదిరిపోయిందన, సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్లస్‌లతోపాటు త్రిషతో వచ్చే లవ్ సీన్స్, మ్యూజిక్ నిరాశపరిచిందని మైనస్ అంశాలను చెబుతున్నారు. కొన్ని సీన్స్ మెప్పిస్తాయని, సెకండాఫ్ ఊహించనంతగా లేదని సినిమా చూసిన వారు థగ్ లైఫ్‌ రివ్యూ ఇస్తున్నారు.

థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ.. 38 ఏళ్ల తర్వత కాంబో రిపీట్.. కమల్ హాసన్ మూవీకి ఊహించని టాక్.. మణిరత్నం డైరెక్షన్ అలా!
థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ.. 38 ఏళ్ల తర్వత కాంబో రిపీట్.. కమల్ హాసన్ మూవీకి ఊహించని టాక్.. మణిరత్నం డైరెక్షన్ అలా!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టార్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థగ్ లైఫ్. ఈ సినిమాకు కోలీవుడ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇదివరకు 1987లో మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో నాయగన్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

30 ఏళ్ల తర్వాత

ఇప్పుడు నాయగన్ తర్వాత 38 ఏళ్లకు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్‌తోపాటు త్రిష, శింబు, అభిరామి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, సాన్య మల్హోత్రా వంటి స్టార్స్ నటించిన థగ్ లైఫ్ ప్రీమియర్స్ ఇదివరకే పడిపోయాయి.

థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ

ఈ సినిమా చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా థగ్ లైఫ్‌పై రివ్యూలు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూలు వైరల్ అవుతున్నాయి. థగ్ లైఫ్‌పై ఆడియెన్స్, నెటిజన్ టాక్ ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.

కమల్-శింబు సీన్స్ అదుర్స్

"ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్. ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ షో మొత్తం దోచేశాడు. కమల్ హానస్, శింబుసన్నివేశాలు అదిరిపోయాయి. చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఫైరే. సెకండాఫ్‌లో తన నటనతో శింబు అదరగొట్టాడు. కమల్, శింబు మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బెస్ట్ ఆఫ్ ది డికెడ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బ్లాస్ట్" అని రివ్యూ ఇస్తూ 5కి 4.75 రేటింగ్ ఇచ్చారు.

"ప్రతి ఫ్రేమ్‌లో శింబు నటనతో అదరగొట్టాడు. శింబు యాక్టింగ్ చేయలేదు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే గూస్‌బంప్స్ ఇచ్చే మెటీరియల్" అని ఒకరు చెప్పుకొచ్చారు.

మణిరత్నం మాత్రమే

"థగ్ లైఫ్ సెకండాఫ్ మ్యాడ్‌గా ఉంది. ఒక్కదాంట్లో అన్ని రకాల ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసే ఏకైక డైరెక్టర్ మణిరత్నం మాత్రమే. మణిరత్నం నిజంగా చాలా స్పెషల్. అంజు వన్న పూవే పోర్షన్ ఏడిపిస్తుంది. శింబు ఎప్పటిలాగే అదరగొట్టాడు. కమల్ హాసన్‌ను ఎందుకు గురువు అంటారో మరోసారి నిరూపించారు" అని మరొక ఎక్స్ యూజర్ తెలిపారు.

"కమల్ హాసన్-త్రిష మధ్య వచ్చే లవ్ పోర్షన్ చాలా డల్‌గా ఉన్నాయి. శింబు, అభిరామి నీట్‌గా చేశారు. పాటలు బాగున్నాయి. ఢిల్లీ ల్యాండ్‌స్కేప్ విజువల్స్ అదిరిపోయాయి. బలహీనమైన కథ, ఎమోషన్స్ లేవు, పెద్దగా ట్విస్టులు లేవు. ఆసక్తిగా లేని సాగదీసే నెరేషన్. డిసాప్పాయింట్‌మెంట్. సినిమా, పాలిటిక్స్, ఫ్యామిలీ అంశాలు ఫెయిల్ అయ్యాయి" అంటూ 10కి 2 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఒక యూజర్.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More