అవును, అతనితో డేటింగ్‌లో ఉన్నా- అఫిషియల్‌గా చెప్పిన బోల్డ్ ఓటీటీ సిరీస్ బ్యూటి కీర్తి కుల్హారి- ఐదేళ్లకు ముందు విడాకులు!
బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కీర్తి కుల్హారి తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన సహనటుడు రాజీవ్ సిద్ధార్థతో కలిసి దిగిన సన్నిహిత ఫొటోలను పంచుకుంటూ కొత్త ఏడాదిలో అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. బోల్డ్ ఓటీటీ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్‌తో ఈ జంట ఒక్కటైంది.
కొత్త ఏడాది వేళ వెండితెరపై మరో ప్రేమకథ పట్టాలెక్కింది. బాలీవుడ్ బ్యూటిఫుల్ నటి కీర్తి కుల్హారి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, తన ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ (Four More Shots Please!) సహనటుడు రాజీవ్ సిద్ధార్థతో ప్రేమలో ఉన్నట్లు కీర్తి తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇన్‌స్టాగ్రామ్ సాక్షిగా ప్రేమాయణం
శుక్రవారం (జనవరి 2) నాడు కీర్తి కుల్హారి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రత్యేకమైన రీల్‌ను షేర్ చేశారు. అందులో రాజీవ్‌తో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కారులో తీసుకున్న సెల్ఫీలు, కలిసి చేసిన ప్రయాణాలు, లిఫ్టులో దిగిన క్యూట్ ఫోటోలతో పాటు.. రాజీవ్ నుదుటిపై ఆమె ముద్దు పెడుతున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో చివరలో కిటికీపై బాణం గుర్తుతో ఉన్న హార్ట్ బొమ్మను చూపిస్తూ తన ప్రేమను చాటుకున్నారు కీర్తి కుల్హారి. "ఒక చిత్రం వెయ్యి మాటల కంటే గొప్పది.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు" అంటూ కీర్తి కుల్హారి రాసుకొచ్చారు. దీంతో రాజీవ్ సిద్ధార్థతో రిలేషన్‌లో ఉన్నట్లు అఫిషియల్‌గా ప్రకటించింది కీర్తి.
అంజనా-మిహిర్ జోడీకి ఫ్యాన్స్ ఫిదా
ఈ పోస్ట్ చూసిన వెంటనే వారి సహనటులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‌లో అంజనా, మిహిర్ పాత్రలు ఎంతో పాపులర్ అయ్యాయి. దీంతో నెటిజన్లు "ప్యారలల్ యూనివర్స్‌లో అంజనా, మిహిర్ ఒక్కటయ్యారు", "కొత్త జంట చూడముచ్చటగా ఉంది" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
గతం చేదు జ్ఞాపకం.. భవిష్యత్తుపై ఆశ
వీరి సిరీస్ కో-స్టార్ మాన్వి గాగ్రూ కూడా "హ్యాపీ న్యూ ఇయర్ లవ్లీస్" అంటూ ఈ జంటకు తన ఆశీస్సులు అందించారు. కాగా, కీర్తి కుల్హారీ గతంలో సాహిల్ సెహగల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2021 ఏప్రిల్‌లో తాము విడిపోతున్నట్లు ఆమె ప్రకటించారు.
"ఎవరితోనైనా కలిసి ఉండటం కంటే, విడిపోవాలని నిర్ణయించుకోవడం చాలా కష్టం. అది మనల్ని ప్రేమించే వారికి బాధ కలిగిస్తుంది. కానీ, జీవితం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉండాలి" అంటూ అప్పట్లో కీర్తి కుల్హారి భావోద్వేగంగా స్పందించారు.
హాట్ టాపిక్‌గా
ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి, ఇప్పుడు రాజీవ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చినా, ఇప్పుడు అధికారికంగా ప్రకటించడంతో ఈ సరికొత్త ప్రేమకథ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
ఇదిలా ఉంటే, కీర్తి, రాజీవ్ కలిసి నటించిన ఓటీటీ బోల్డ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. అమెజాన్ ప్రైమ్‌లో ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు సీజన్స్ ఉన్న ఈ ఓటీటీ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


