Niharika Konidela: నేను ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లాలని సినిమాలు తీయలేదు.. రాకాస ఎక్కడిదాకా వెళ్తుందో: నిహారిక కొణిదెల
Niharika Konidela Comments On Film Festivals And Raakaasa: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా నిర్మించిన మరో కొత్త సినిమా రాకాస. సంగీత్ శోభన్ హీరోగా చేసిన రాకాస టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకుంది. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు.

సంగీత్ శోభన్ హీరోగా
ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. రాకాస సినిమాను ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
రాకాస టీజర్ రిలీజ్
ఈ క్రమంలో ఆదివారం (మార్చి 1) నాడు రాకాస టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన రాకాసటీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సపోర్ట్ చేస్తూనే ఉన్నారు
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘రాకాస’ చెప్పిన కథ నాకు వెంటనే నచ్చేసింది" అని అన్నారు.
అదే మా లక్ష్యం
"మనందరినీ గతంలోకి తీసుకెళ్లేలా ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీని నిర్మించాను. సినిమా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నదే నా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ లక్ష్యం. ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. థియేటర్‌కు వచ్చిన వాళ్లని మాత్రం నిరాశపరచం. ఈ చిత్రంతో సంగీత్ మరింత షైన్ అవుతాడు" అని నిహారిక కొణిదెల తెలిపారు.
ప్రేమతో, ప్యాషన్‌తో నిర్మించాను
"నేను ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లాలని సినిమాలు తీయలేదు. ప్యాషన్‌తో, ప్రేమతో సినిమాల్ని తీస్తున్నాను. అలా ‘కమిటీ కుర్రోళ్లు’ అవార్డుల్ని అందుకుంది. ‘రాకాస’ కూడా అంతే ప్రేమతో, ప్యాషన్‌తో నిర్మించాను. ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి" అని నిహారిక కొణిదెల చెప్పుకొచ్చారు.
అన్ని రకాల జోనర్ల తీస్తాను
"పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ని నేను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరితో, అన్ని రకాల జోనర్ల సినిమాల్ని తీస్తాను" అని నిహారిక కొణిదెల పేర్కొన్నారు.
మంచి విజయాన్ని సాధిస్తుంది
జీ తెలుగు హెడ్ దివ్య మాట్లాడుతూ .. "పింక్ ఎలిఫెంట్‌తో కలిసి ‘రాకాస’ని చేయడం ఆనందంగా ఉంది. నిహారికతో కలిసి పని చేయడం మాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ‘రాకాస’ క్వాలిటీని అందరూ చూస్తున్నారు. ‘రాకాస’ రిలీజ్ కోసం నేను కూడా ఎంతో ఎదురుచూస్తున్నాను. ఏప్రిల్ 3న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది" అని అన్నారు.
సినిమాలో మూడు పాటలుంటాయి
"‘రాకాస’ సినిమాలో మూడు పాటలుంటాయి. మూవీ రిలీజ్ తరువాత మరో పాటను విడుదల చేస్తాం. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఏప్రిల్ 3న ‘రాకాస’ మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అని సంగీత దర్శకుడు అనుదీప్ తెలిపారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


