గ్లోబల్ వైడ్‌గా సంగీత్ శోభన్ హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస- ఓవర్సీస్‌లో 350కిపైగా థియేటర్లలో రిలీజ్
సంగీత్ శోభన్ సోలో హీరోగా చేస్తున్న హారర్ ఫాంటసీ కామెడీ సినిమా రాకాస. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస సినిమాను గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను నిహారిక, సంగీత్ వీడియో ద్వారా చెప్పారు.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో తన కామెడీతో అలరించిన సంగీత్ శోభన్ సోలో హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెలతోపాటు ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించారు.

ఓటీటీ సిరీస్ డైరెక్టర్
ఓటీటీ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ డైరెక్టర్ మానస శర్మ రాకాస సినిమాకు రచన, దర్శకత్వం వహించారు. అయితే, అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ‘రాకాసా’ వరల్డ్ వైడ్‌గా ఆడియెన్స్ మీద ముద్రను వేయనుంది.
350కి పైగా థియేటర్లలో
రాకాస చిత్రం యూఎస్ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో గ్లోబల్ వైడ్‌గా విడుదల కానుంది. ఇక ‘రాకాస’ ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ కాబోతోండటంతో అక్కడి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి.
బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్లు
ఓవర్సీస్ పంపిణీల్లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్‌కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ బ్రాండ్ ఇమెజ్‌కు తగినట్లుగానే రాకాస సినిమాను ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
1.8 మిలియన్ వ్యూస్
కాగా, ‘రాకాస’ టైటిల్ ప్రకటన, గ్లింప్స్ తరువాత పెరిగిన బజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ‘రాకాస’పై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ‘రాకాస’ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది.
విజువల్స్, బీజీమ్ గురించి
ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు. కెమెరామెన్ అందించిన విజువల్స్, బీజీఎమ్ గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకున్నారు. టెక్నికల్ పరంగా ‘రాకాస’కి మంచి పేరు లభించింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ
ప్రస్తుతం ‘రాకాస’ యూనిట్ పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎడిట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ వంటి వాటిపై టీం పని చేస్తోంది. గతంలో విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ‘రాకాస’ నేషనల్ వైడ్‌గానే కాకుండా ఓవర్సీస్ ఆడియెన్స్‌లోనూ బజ్‌ను క్రియేట్ చేయనుంది.
రాకాస నటీనటులు
ఇకపోతే ‘రాకాస’లో సంగీత్ శోభన్‌కు జోడీగా హీరోయిన్ నయన్ సారిక చేసింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి అద్భుతమైన నటీనటులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఏప్రిల్ 3న రాకాస రిలీజ్
రాకాస సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా రాకాస మూవీని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఈ మూవీ ఓవర్సీస్ హక్కుల్ని దక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


